గో ఎయిర్ టికెట్లపై రూ.888 డిస్కౌంట్ | GoAir announces Rs 888 discount on all tickets | Sakshi
Sakshi News home page

గో ఎయిర్ టికెట్లపై రూ.888 డిస్కౌంట్

Published Tue, Nov 5 2013 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM

GoAir announces Rs 888 discount on all tickets

ముంబై: గోఎయిర్ కంపెనీ అన్ని విమాన టికెట్లపై రూ.888 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా రానున్న ఎనిమిది రోజుల్లో బుక్ చేసుకునే టికెట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని కంపెనీ సోమవారం తెలిపింది. వచ్చే నెల 20 వరకూ జరిగే ప్రయాణాలకు ఈ డిస్కౌంట్‌ను అందిస్తామని పేర్కొంది.  ఈ సంస్థ 21 నగరాలకు వారానికి మొత్తం 840 విమాన సర్వీసులను నడుపుతోంది. 2005, నవంబర్ 4న సర్వీసులను ప్రారంభించిన ఈ సంస్థ అహ్మదాబాద్, బగ్‌దోగ్ర, బెంగళూర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గోవా, గౌహతి, జైపూర్, జమ్మూ, కోచి, కోల్‌కత, లెహ్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, పోర్ట్‌బ్లైర్, పుణే, రాంచి, శ్రీనగర్‌లకు విమాన సర్వీసులందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement