న్యూఢిల్లీ: విమానాలు ఆలస్యమైనా లేదా రద్దయినా ఇకపై విమానయాన సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావొచ్చు. వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా పలు కొత్త నిబంధనలను పౌరవిమానయాన శాఖ తీసుకురానుంది. సంబంధించిన ముసాయిదాకు ప్రస్తుతం అధికారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు.
విమానం 6 గంటలకుపైగా ఆలస్యమైతే మొత్తం చార్జీని తిరిగి చెల్లించడం, అనుసంధాన విమానాల ద్వారా ప్రయాణించేవారికి తొలి విమానం రద్దయ్యి, ఆ కారణంగా మరో సిటీలో ఎక్కాల్సిన రెండో విమానాన్ని వారు అందుకోలేని పరిస్థితుల్లో అలాంటి ప్రయాణికులకు రూ. 20వేల వరకు నష్టపరిహారంగా చెల్లించడం తదితర కొత్త నిబంధనలను ప్రవేశపెట్టబోతున్నారు. టికెట్ కొన్నాక విమానంలోకి ఎక్కడానికి అనుమతివ్వకపోతే రూ.5 వేలు పరిహారం చెల్లించాలని ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment