విశాఖ నుంచి మరో రెండు విమాన సర్వీసులు | Another two flights from Vizag | Sakshi
Sakshi News home page

విశాఖ నుంచి మరో రెండు విమాన సర్వీసులు

Published Sun, Nov 15 2015 4:22 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

Another two flights from Vizag

విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, ముంబైకి జెట్ ఎయిర్‌వేస్ సంస్థ నూతన సర్వీసులను ప్రకటించింది. విశాఖ - ఢిల్లీ విమాన సర్వీసును ఆదివారం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. ప్రతీ రోజు ఉదయం 9.10 గంటలకు విశాఖలో విమానం బయల్దేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఢిల్లీలో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి రాత్రి 8.55 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఇక, విశాఖ-ముంబై సర్వీసు ముంబైలో ఉదయం 6.25గంటలకు బయల్దేరి 8.25 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖలో రాత్రి 9.25 గంటలకు ప్రారంభమైన 11.25 గంటలకు ముంబై చేరుకుంటుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement