న్యూఢిల్లీ: విమానాలు ల్యాండింగ్ అవుతున్నప్పుడు అందులోని టాయిలెట్ ట్యాంకుల నుంచి మానవ వ్యర్థాలు ఇళ్లపై పడితే విమానయాన సంస్థలు పర్యావరణ నష్టపరిహారం కింద రూ. 50 వేల జరిమానా చెల్లించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఆదేశించింది. ఈమేరకు వాటికి సర్క్యులర్లు జారీచేయాలని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏకు ఉత్తర్వులిచ్చింది.