ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ) నుంచి గన్నవరం విమానాశ్రయానికి స్పైస్‌జెట్ సంస్థ ఆదివారం నుంచి కొత్త విమాన సర్వీస్‌ను ప్రారంభించింది.
విమానాశ్రయం (గన్నవరం): ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ) నుంచి గన్నవరం విమానాశ్రయానికి స్పైస్‌జెట్ సంస్థ ఆదివారం నుంచి కొత్త విమాన సర్వీస్‌ను ప్రారంభించింది. 189 సీటింగ్ సామర్థ్యంగల బోయింగ్ 737–800 విమానం 126 మంది ప్రయాణికులతో వారణాసి నుంచి హైదరాబాద్ మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడికి చేరుకుంది.
న్యూ టెర్మినల్ భవనంలో వారణాసి, హైదరాబాద్ వెళ్తున్న ప్రయాణికులకు తొలి బోర్డింగ్ పాస్‌ను ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.మధుసూదనరావు తదితరులు అందజేశారు. అనంతరం ఇక్కడి నుంచి 156 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2.40 గంటలకు విమానం వారణాసికి బయల్దేరింది. వీరిలో వారణాసి వెళ్లే ప్రయాణికులు 54 మంది ఉన్నారు.