SpiceJet airline
-
హైదరాబాద్-కొలంబో డైరెక్ట్ ఫ్లైట్
బడ్జెట్ ఎయిర్‌లైన్స్ స్పైస్ జెట్ కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది. హైదరాబాద్-కొలంబో మార్గంలో 12 కొత్త విమానాలను నడుపుతామని స్పైస్ జెట్ మంగళవారం ప్రకటించింది. ఏప్రిల్ 12నుంచి మార్చి 31 నుంచి తమ సేవలను ప్రారంభించనున్నాయి. మంగళవారం, బుధవారాలు మినహా అన్ని రోజులు ఈ విమానాలు నడుస్తాయని పేర్కొంది. శ్రీలకం, భారత్ మధ్య డైరెక్ట్ విమాన సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారి. దీంతోపాటు జాతీయ మార్గంలో మరో11డైరెక్ట్ విమానాలను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ఇవి మార్చి 31 నుంచి సర్వీసులను ప్రారంభిస్తాయని స్పైస్ జెట్ వెల్లడించింది. హైదరాబాద్- కొలంబో(శ్రీలంక రాజధాని) డైరెక్ట్ సర్వీసులు భారతదేశం శ్రీలంకల మధ్య సంబంధాలకు మద్దతిచ్చేలా తమ నిబద్ధతను మరింత బలపరుస్తోందని స్పైస్ జెట్ చీఫ్ సేల్స్ అండ్ రెవెన్యూ ఆఫీసర్ శిల్పా భాటియా చెప్పారు. -
వారణాసి–విజయవాడ విమాన సర్వీస్ ప్రారంభం
విమానాశ్రయం (గన్నవరం): ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ) నుంచి గన్నవరం విమానాశ్రయానికి స్పైస్‌జెట్ సంస్థ ఆదివారం నుంచి కొత్త విమాన సర్వీస్‌ను ప్రారంభించింది. 189 సీటింగ్ సామర్థ్యంగల బోయింగ్ 737–800 విమానం 126 మంది ప్రయాణికులతో వారణాసి నుంచి హైదరాబాద్ మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడికి చేరుకుంది. న్యూ టెర్మినల్ భవనంలో వారణాసి, హైదరాబాద్ వెళ్తున్న ప్రయాణికులకు తొలి బోర్డింగ్ పాస్‌ను ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.మధుసూదనరావు తదితరులు అందజేశారు. అనంతరం ఇక్కడి నుంచి 156 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2.40 గంటలకు విమానం వారణాసికి బయల్దేరింది. వీరిలో వారణాసి వెళ్లే ప్రయాణికులు 54 మంది ఉన్నారు. -
స్పైస్‌జెట్ ఫ్లాష్ సేల్స్
- టికెట్ ధరల్లో 10 శాతం డిస్కౌంట్ న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన దేశీ మార్గాలలోని విమాన టికెట్ ధరల్లో 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం (నేడు) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫ్లాష్ సేల్స్‌ను నిర్వహిస్తోంది. ఈ ఆఫర్ కింద టికెట్ బుకింగ్ చేసుకున్న వారు జూలై 1 నుంచి అక్టోబర్ 15 మధ్యకాలంలో ప్రయాణించవచ్చు.