హైదరాబాద్-కొలంబో డైరెక్ట్‌ ఫ్లైట్‌ | SpiceJet launches 12 new Direct Domestic Flights, to start Hyderabad-Colombo service | Sakshi
Sakshi News home page

 హైదరాబాద్-కొలంబో డైరెక్ట్‌ ఫ్లైట్‌

Mar 5 2019 6:38 PM | Updated on Mar 5 2019 6:40 PM

SpiceJet launches 12 new Direct Domestic Flights, to start Hyderabad-Colombo service - Sakshi

బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ స్పైస్‌ జెట్‌ కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది. హైదరాబాద్-కొలంబో మార్గంలో 12 కొత్త విమానాలను నడుపుతామని స్పైస్‌ జెట్‌ మంగళవారం ప్రకటించింది.  ఏప్రిల్‌ 12నుంచి మార్చి 31 నుంచి తమ సేవలను ప్రారంభించనున్నాయి. మంగళవారం, బుధవారాలు మినహా అన్ని రోజులు ఈ విమానాలు నడుస్తాయని పేర్కొంది.  శ్రీలకం, భారత్‌ మధ్య డైరెక్ట్‌ విమాన సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారి.
దీంతోపాటు జాతీయ మార్గంలో మరో11డైరెక్ట్‌ విమానాలను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ఇవి మార్చి 31 నుంచి సర్వీసులను ప్రారంభిస్తాయని ‍ స్పైస్‌ జెట్‌ వెల్లడించింది.  

హైదరాబాద్- కొలంబో(శ్రీలంక రాజధాని) డైరెక్ట్‌ సర్వీసులు భారతదేశం శ్రీలంకల మధ్య  సంబంధాలకు మద్దతిచ్చేలా తమ నిబద్ధతను మరింత బలపరుస్తోందని  స్పైస్‌ జెట్‌  చీఫ్ సేల్స్ అండ్ రెవెన్యూ ఆఫీసర్‌ శిల్పా భాటియా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement