Colombo Flight Service
-
కొలంబోకు విమాన సర్వీసులు పునఃప్రారంభం
శంషాబాద్: హైదరాబాద్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. 19 నెలల తర్వాత శుక్రవారం ఉదయం 9.55 గంటలకు 120 మంది ప్రయాణికులతో శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం ఇక్కడి నుంచి కొలంబోకు బయలుదేరింది. వారానికి రెండుసార్లు (సోమ, శుక్రవారం) ఈ విమాన సర్వీసులు ఉంటాయని గెయిల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ మీడియాకు వెల్లడించారు. అంతకుముందు కొలంబో నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానానికి జీఎంఆర్ ప్రతినిధులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. -
హైదరాబాద్-కొలంబో డైరెక్ట్ ఫ్లైట్
బడ్జెట్ ఎయిర్‌లైన్స్ స్పైస్ జెట్ కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది. హైదరాబాద్-కొలంబో మార్గంలో 12 కొత్త విమానాలను నడుపుతామని స్పైస్ జెట్ మంగళవారం ప్రకటించింది. ఏప్రిల్ 12నుంచి మార్చి 31 నుంచి తమ సేవలను ప్రారంభించనున్నాయి. మంగళవారం, బుధవారాలు మినహా అన్ని రోజులు ఈ విమానాలు నడుస్తాయని పేర్కొంది. శ్రీలకం, భారత్ మధ్య డైరెక్ట్ విమాన సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారి. దీంతోపాటు జాతీయ మార్గంలో మరో11డైరెక్ట్ విమానాలను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ఇవి మార్చి 31 నుంచి సర్వీసులను ప్రారంభిస్తాయని స్పైస్ జెట్ వెల్లడించింది. హైదరాబాద్- కొలంబో(శ్రీలంక రాజధాని) డైరెక్ట్ సర్వీసులు భారతదేశం శ్రీలంకల మధ్య సంబంధాలకు మద్దతిచ్చేలా తమ నిబద్ధతను మరింత బలపరుస్తోందని స్పైస్ జెట్ చీఫ్ సేల్స్ అండ్ రెవెన్యూ ఆఫీసర్ శిల్పా భాటియా చెప్పారు. -
జూలై 8 నుంచి విశాఖ–కొలంబో విమాన సర్వీసు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ–కొలంబో మధ్య అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభించడానికి అవసరమైన తుది అనుమతుల మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపింది. శ్రీలంక ఎయిర్‌లైన్స్ కొలంబో–విశాఖ మధ్య తన మొదటి సర్వీసును జూలై 8 నుంచి ప్రారంభించనుంది. ఈ విమానం ఉదయం 7.15 గంటలకు కొలంబో నుంచి బయలుదేరి ఉదయం 9 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరిగి ఉదయం 10 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు కొలంబో చేరుకుంటుంది. ఈ సర్వీసును వారానికి నాలుగు రోజులు సోమవారం, బుధ, శుక్ర, శనివారాల్లో నడపనున్నారు. పర్యాటకులను ఆకర్షించడానికి శ్రీలంక ఎయిర్‌లైన్స్ ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించి టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ సర్వీసు ద్వారా కొలంబో నుంచి హాంకాంగ్, చైనా, జపాన్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు విశాఖ నుంచే బోర్డింగ్ పాసులు ఇచ్చే సదుపాయం అందుబాటులోకి రానుంది.