జూలై 8 నుంచి విశాఖ–కొలంబో విమాన సర్వీసు | Colombo Flight Service To Visakhapatnam | Sakshi
Sakshi News home page

జూలై 8 నుంచి విశాఖ–కొలంబో విమాన సర్వీసు

Published Mon, May 22 2017 12:54 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

జూలై 8 నుంచి విశాఖ–కొలంబో విమాన సర్వీసు - Sakshi

జూలై 8 నుంచి విశాఖ–కొలంబో విమాన సర్వీసు

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ–కొలంబో మధ్య అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభించడానికి అవసరమైన తుది అనుమతుల మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపింది. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ కొలంబో–విశాఖ మధ్య తన మొదటి సర్వీసును జూలై 8 నుంచి ప్రారంభించనుంది. ఈ విమానం ఉదయం 7.15 గంటలకు కొలంబో నుంచి బయలుదేరి ఉదయం 9 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

 తిరిగి ఉదయం 10 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు కొలంబో చేరుకుంటుంది. ఈ సర్వీసును వారానికి నాలుగు రోజులు సోమవారం, బుధ, శుక్ర, శనివారాల్లో నడపనున్నారు. పర్యాటకులను ఆకర్షించడానికి శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించి టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ సర్వీసు ద్వారా కొలంబో నుంచి హాంకాంగ్, చైనా, జపాన్‌ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు విశాఖ నుంచే బోర్డింగ్‌ పాసులు ఇచ్చే సదుపాయం అందుబాటులోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement