
విజయవాడ నుంచి మూడు డైరెక్ట్ ఫ్లైట్లు: ట్రూజెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయవాడ నుంచి మూడు ప్రాంతాలకు ఫ్లైట్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ వెల్లడించింది. హైదరాబాద్, తిరుపతి, కడప రూట్లలో ఈ సర్వీసులు ఉంటాయని ట్రూజెట్ మాతృ సంస్థ టర్బో మేఘా ఎయిర్‌వేస్ ఎండీ వంకాయలపాటి ఉమేష్ తెలిపారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య సేవలు ఏప్రిల్ 22 నుంచి తిరుపతి, కడపలకు సర్వీసులు మే 3 నుంచి ప్రారంభమవుతాయని వివరించారు. కడప-విజయవాడ రూట్ లో విమానసేవలు అందించే ఏకైక ఎయిర్‌లైన్ తమదే అవుతుందని ఉమేష్ పేర్కొన్నారు.