
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.99లకే విమానటికెట్‌ను ఆఫర్ చేస్తోంది. దేశంలో 7 నగరాల మధ్య ప్రయాణానికి రూ .99 నుంచి ప్రమోషనల్ బేస్ ఛార్జీలను ప్రారంభించింది.
బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, న్యూ ఢిల్లీ, పూణే, రాంచీ వంటి నగరాలకు డైనమిక్ ధర రూ .99 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఏషియా వెబ్‌సైట్, లేదా యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు ఇంకో ఆకర్షణీయమైన ఆఫర్ కూడా ఉంది. 10 ఆసియా-పసిఫిక్ ప్రాంతం (అపాక్) దేశాలు ఆక్లాండ్, బాలి, బ్యాంకాక్, కౌలాలంపూర్, మెల్‌బోర్న్, సింగపూర్ సిడ్నీలకు బేస్ ధర రూ.1499గా నిర్ణయించింది.
కాగా ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరలకే విమానయన సదుపాయం కల్పిస్తూ చౌక ధరల యుద్ధానికి తెరతీస్తున్న తరుణంలో ఎయిర్ ఏషియా మరోమారు డిస్కౌంట్ ధరలను అందిస్తోంది. దేశీయంగా, ఇతర దేశాలను చుట్టి రావాలనుకునే విమాన ప్రయాణికులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది.