విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియా తాజాగా రూ. 999కే విమాన ప్రయాణ టికెట్ల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 27 దాకా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఎయిర్‌ఏషియా ఆఫర్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియా తాజాగా రూ. 999కే విమాన ప్రయాణ టికెట్ల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 27 దాకా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈలోగా టికెట్లు బుక్ చేసుకున్న వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఆగస్టు 28 మధ్య కాలంలో ప్రయాణించవచ్చు. వెబ్‌సైట్, ఎయిర్‌ఏషియా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయన్నది ఎయిర్‌ఏషియా ఇండియా వెల్లడించలేదు. సీట్లు పరిమితంగానే ఉంటాయని, అన్ని ఫ్లయిట్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం కోల్‌కతా, బాగ్‌డోగ్రా మధ్య విమాన ప్రయాణ చార్జీలు రూ. 999 నుంచి ఉన్నాయి.