
ప్రైవేటు విమానంలో 3.5 కోట్ల పాతనోట్ల తరలింపు!
హర్యానాలోని హిస్సార్ నుంచి నాగాలండ్‌లోని డిమాపూర్‌కు రూ. 3.5 కోట్లను ఒక ప్రైవేటు విమానంలో తరలిస్తుండగా ఆ విమానాన్ని దించేసి, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
హర్యానాలోని హిస్సార్ నుంచి నాగాలండ్‌లోని డిమాపూర్‌కు రూ. 3.5 కోట్లను ఒక ప్రైవేటు విమానంలో తరలిస్తుండగా ఆ విమానాన్ని దించేసి, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు విమానాలు ఎగరాలంటే తప్పనిసరిగా ఉండాల్సిన సెక్యూరిటీ ప్రోగ్రాంను ఈ విమానం నడిపిస్తున్న ఎయిర్‌కార్ ఎయిర్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) రద్దుచేసింది. హిస్సార్‌లో తాము బ్యాగులు చెక్ చేశామని, అందులో కేంద్రం రద్దుచేసిన 500, 1000 నోట్లు ఉన్నాయన్న విషయాన్ని ఏటీసీకి పైలట్లు తప్పనిసరిగా చెప్పాలి. అయితే, పైలట్ టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చిందని, అందువల్ల ఏటీసీకి ఆ విషయం చెప్పలేదని ఎయిర్‌కార్ చెబుతోంది.