ప్రయాణికులకు ఇండిగో ఆఫర్‌ | IndiGo Offers Tickets From Rs. 1,112 On Select Flights | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు ఇండిగో ఆఫర్‌

Published Fri, Dec 1 2017 1:50 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

IndiGo Offers Tickets From Rs. 1,112 On Select Flights - Sakshi

తీవ్రమైన పోటీ వాతావరణం, అంతకంతకు పెరుగుతున్న ప్రయాణికుల వృద్ధితో విమానయాన సంస్థలు టిక్కెట్‌ ధరలపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఇండిగో ఎంపికచేసిన మార్గాలకు రూ.1,112కే టిక్కెట్‌ను విక్రయించనున్నట్టు పేర్కొంది. జమ్ము నుంచి శ్రీనగర్‌కు వచ్చే నెల నుంచి వెళ్లే ఎంపికచేసిన విమానాలను రూ.1,112కే బుక్‌ చేసుకోవచ్చని ఈ విమానయాన సంస్థ తన వెబ్‌సైట్‌ 'గోఇండిగో.ఇన్‌' లో తెలిపింది. కోయంబత్తూర్‌ నుంచి చెన్నైకు రూ.1,195కు, విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు రూ.1259కు, పట్నా నుంచి కోల్‌కత్తాకు రూ.1,264కు, బెంగళూరు నుంచి చెన్నైకు రూ.1,285కు టిక్కెట్లను ఇండిగో అందిస్తోంది.

టిక్కెట్‌ ధరల తగ్గింపుపై కస్టమర్లు ఇండిగో బుకింగ్స్‌ పోర్టల్‌లో సెర్చ్‌ చేస్తే, జనవరి మధ్యలో నుంచి జమ్ము నుంచి శ్రీనగర్‌కు టిక్కెట్‌ ధర రూ.1,112కు అందుబాటులో ఉన్నట్టు చూపిస్తోంది. దీనిలోనే రూ.825 రెగ్యులర్‌ ఫేర్‌, ఫ్యూయల్‌ ఛార్జీ, రూ. 42 జీఎస్టీ కూడా ఉన్నాయి. న్యూఇయర్‌, హాలిడే సీజన్‌ కానుకగా విమానయాన సంస్థలు ఈ డిస్కౌంట్‌ ఆఫర్లకు తెరతీస్తాయి. మరో ఎయిర్‌లైన్‌ ఎయిర్‌ ఏసియా కూడా లిమిటెడ్‌ పిరియడ్‌ ప్రమోషనల్‌ స్కీమ్‌ కింద ఎంపికచేసిన విమానాలపై 40 శాతం వరకు తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. ఈ తగ్గింపు 2018 జనవరి 15 నుంచి 2018 ఏప్రిల్‌ 25 వరకు చేసే ప్రయాణాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2017 డిసెంబర్‌ 3 నుంచి ఈ టిక్కెట్ల బుకింగ్స్‌ ప్రారంభమవుతాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement