బెంగళూరు: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ రూ.799 నుంచే దేశీయ ప్రయాణ టికెట్లను, రూ.999 నుంచి అంతర్జాతీయ ప్రయాణ టికెట్లను అందిస్తోంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 3 నుంచి వచ్చే ఏడాది మే 29 మధ్య ప్రయాణాల కోసం ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
కార్పొబ్రీఫ్స్
ఆల్ట్రాటెక్ సిమెంట్: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్(ఎఫ్‌పీఐ) పరిమితిని 30 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. భారత్‌లో అతి పెద్ద సిమెంట్ కంపెనీ ఇది. ఈ కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.8 కోట్ల టన్నులు.
టాటా మోటార్స్: ఆర్థిక ఫలితాలు అధికారికంగా వెల్లడికాకముందే వాట్సాప్ ద్వారా లీకైన విషయంలో దర్యాప్తు జరపాలని టాటా మోటార్స్‌ను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆదేశించింది. సంబంధిత నివేదికను మూడు నెలల్లోగా అందజేయాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment