రూ.699కే ఎయిర్‌ ఏషియా టికెట్ | Air Asia India offers lowered advance fares | Sakshi
Sakshi News home page

రూ.699కే ఎయిర్‌ ఏషియా టికెట్

Published Wed, Jan 28 2015 10:59 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

రూ.699కే ఎయిర్‌ ఏషియా టికెట్ - Sakshi

రూ.699కే ఎయిర్‌ ఏషియా టికెట్

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా రూ.699 ధర నుంచి  విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లతో బుకింగ్స్ సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని బుధవారంతో ముగుస్తాయని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకూ జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది.

బెంగళూరు నుంచి చెన్నైకి రూ.699, బెంగళూరు నుంచి కోచికు రూ.899, బెంగళూరు-గోవా రూ.1,099, బెంగళూరు-పుణేకు రూ.1,499,  బెంగళూరు-జైపూర్, బెంగళూరు-చండీగఢ్‌లకు రూ.1,999లకే టికెట్లను ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement