ఎయిర్ఏసియా టికెట్ రూ.899కే | AirAsia announces discount on domestic, foreign travel | Sakshi
Sakshi News home page

ఎయిర్ఏసియా టికెట్ రూ.899కే

Published Tue, Oct 4 2016 1:22 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

ఎయిర్ఏసియా టికెట్ రూ.899కే - Sakshi

ఎయిర్ఏసియా టికెట్ రూ.899కే

న్యూఢిల్లీ: మలేసియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్ గ్రూప్ ‘ఎయిర్‌ఏసియా’ తాజాగా విమాన టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ప్రయాణికులకు ఈ ఆఫర్ అక్టోబర్ 16 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఎయిర్‌ఏసియా తాజా ఆఫర్‌లో భాగంగా బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, న్యూఢిల్లీ, గువాహటి, జైపూర్, పుణే, ఇంపాల్ వంటి పలు ఇతర దేశీ విమాన ప్రయాణపు టికెట్లను రూ.899ల నుంచి (ఒక వైపునకు) అందిస్తోంది.

ప్రయాణికులు కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, బాలి, మెల్‌బోర్న్, సిడ్నీ వంటి విదేశీ ప్రయాణ టికెట్లను రూ.3,599ల నుంచి బుక్ చేసుకోవచ్చు. ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 27 వరకు ఉన్న మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని సంస్థ పేర్కొంది. కాగా ఎయిర్‌ఏసియా మలేసియా, ఎయిర్‌ఏసియా థాయ్‌లాండ్, ఎయిర్‌ఏసియా ఇండోనేసియా, ఎయిర్‌ఏసియా ఫిలిప్పిన్స్, ఎయిర్‌ఏసియా ఇండియా, మలేసియా ఎయిర్‌ఏసియా ఎక్స్, థాయ్ ఎయిర్‌ఏసియా ఎక్స్ సంస్థలు నడిపే విమానాల్లో కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement