మొబైల్ బుకింగ్లపై 20 శాతం డిస్కౌంట్
ఎయిర్ ఏషియా ఆఫర్
హైదరాబాద్: మొబైల్ యాప్, మొబైల్ వెబ్‌సైట్‌ల ద్వారా బుక్ చేసే విమాన టికెట్లపై 20 శాతం డిస్కౌంట్‌ను ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ అందిస్తోంది. ఈ ఆఫర్ నేటి(3 జూన్) నుంచి ప్రారంభమై ఈ నెల 5 వరకూ అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఏషియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లు ఈ నెల 6 నుంచి సెప్టెంబర్ 30లోపు ప్రయాణాలకు వర్తిస్తాయని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌ీ సీగ్‌ట్రాండ్ టెహ్ పేర్కొన్నారు. మొబైల్ ద్వారా విమాన టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించిన తొలి విమానయాన సంస్థల్లో ఎయిర్ ఏషియా కూడా ఒకటని వివరించారు. 2010లో ఈ మొబైల్ యాప్‌ను డెవలప్ చేశామని, ఇప్పటిదాకా కోటి డౌన్‌లోడ్‌లు జరిగాయని పేర్కొన్నారు.