సాక్షి, హైదరాబాద్: కేరళలో వర్షాలు, వరదలు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రన్ వేపై ఇంకా నీళ్లు నిలిచి ఉండటంతో ఆదివారం కూడా కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. శనివారం మధ్యాహ్నానికి రన్‌వేపై నీటిని తోడేయగలమని విమానాశ్రయ అధికారులు భావించినా, ప్రతికూల వాతావరణం కారణంగా సాధ్యపడలేదు. ఈ నెల 26 వరకు రన్‌వే అందు బాటులోకి వచ్చే అవకాశం లేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment