భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాక్రాపర్‌లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్).. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 121
► ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, టర్నర్ తదితరాలు.
► అర్హత: సంబంధిత ట్రేడ్‌ను అనుసరించి ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
► కాలవ్యవధి: ఒక సంవత్సరం
► వయసు: 14 నుంచి 24 ఏళ్లు మించకూడదు.
► స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8855 వరకు చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కాక్రాపర్ గుజరాత్ సైట్, అనుమల–394651, టీఏ.వ్యారా, జిల్లా. తపి, గుజరాత్ చిరునామాకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021
► వెబ్‌సైట్: www.npcilcareers.co.in
నరోరా అటామిక్ పవర్ స్టేషన్‌లో 50 అప్రెంటిస్‌లు
భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్)కి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని నరోరా అటామిక్ పవర్ స్టేషన్.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 50
► ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్–20, ఎలక్ట్రీషియన్–13, ఎలక్ట్రానిక్స్–12, మెషినిస్ట్–05.
► అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
► వయసు: 07.07.2021 నాటికి 14–24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.
► ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఒకవేళ ఐటీఐ మార్కులు ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఉంటే.. వారి వయసును ప్రామాణికంగా తీసుకుంటారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్( హెచ్‌ఆర్‌ఎం), నరోరా అటామిక్ పవర్ స్టేషన్, ప్లాంట్ సైట్, నరోరా,బులందసహార్–203389(ఉత్తరప్రదేశ్) చిరునామాకు పంపించాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.07.2021
► దరఖాస్తు హార్ట్‌కాపీలను పంపడానికి చివరి తేది: 21.07.2021
► వెబ్‌సైట్: https://www.npcil.nic.in
మరిన్ని నోటిఫికేషన్లు:
పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీ ఖాళీలు
Comments
Please login to add a commentAdd a comment