
న్యూఢిల్లీ: నూతన అకౌంటింగ్ స్టాండర్డ్ ‘ఐఎన్‌డీ ఏఎస్ 116’ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కంపెనీల్లో లీజుల వివరాలను వెల్లడించడం, బ్యాలన్స్ షీట్ల వివరాల వెల్లడిలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఇది సాయపడుతుందని భావిస్తున్నారు.. విమానాలను లీజులపై తీసుకుని నడిపే ఏవియేషన్ సహా పలు రంగాలపై ఈ నూతన అకౌంటింగ్ ప్రమాణాలు గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఐఎన్‌డీ ఏఎస్ 116 అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది.