accounting
-
‘బీకాం’దే హవా!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో తక్షణ ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులకే విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా బీకాంతోపాటు బీఎస్సీ లైఫ్‌సైన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసిన 2023 దోస్త్ డేటా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సంప్రదాయ డిగ్రీ కోర్సుల కన్నా.. ఆధునిక హంగులున్న విభాగాల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరారు. ఒకేషనల్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు నామమాత్రంగా ఉన్నాయి. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా.. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల వైపు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బీఏ వంటి కోర్సుల్లో మార్పులు తెచ్చినా, ఆనర్స్ వంటివి అందుబాటులోకి తెచ్చినా విద్యార్థులు వాటికి పెద్దగా మొగ్గు చూపలేదు. 1.84 లక్షల సీట్లు ఖాళీ..: 2023–24 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి పలు దఫాలుగా ‘డిగ్రీ ఆన్లైన్ సరీ్వసెస్, తెలంగాణ (దోస్త్)’అడ్మిషన్ల ప్రక్రియను ముగించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉండగా.. అందులో 2,04,674 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగతా 1,84,375 సీట్లు మిగిలిపోయాయి. బీకాం వైపే చూపు: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీలోని 11 ప్రధాన కోర్సుల్లో 2,04,674 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరిలో అత్యధికంగా 85,153 మంది బీకాం కోర్సునే ఎంచుకున్నారు. ఆ తర్వాత బీఎస్సీ లైఫ్ సైన్స్‌లో 43,180 మంది చేరారు. తర్వా తి స్థానంలో బీఏ కోర్సు ఉంది. ఇందులో 29,752 మంది చేరారు. బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌కు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిలో 25,937 మంది చేరారు. కరోనా తర్వాత ఈ–కామర్స్ జోరు పెరిగింది. అకౌంటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన కోర్సులు చేసినవారికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆడిట్ విభాగాల్లోనూ ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కామర్స్ నేప థ్యం ఉన్న వారికి డిమాండ్ వచ్చింది. డిగ్రీ పూర్తవగానే మంచి వేతనంతో ఉద్యోగం వస్తోందన్న భరోసా కనిపిస్తోంది. మరోవైపు సాధారణ డిగ్రీలోనే బొటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, కంప్యూటర్ సైన్స్ వంటి సబ్జెక్టులను చేర్చి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో వాటికీ డిమాండ్ వస్తోంది. డిమాండ్ ఉన్న కోర్సులు కోరుకుంటున్నారు విద్యార్థులు పదేళ్లుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకుంటున్నారు. మార్కెటింగ్ పెరగడం, ఈ–కామర్స్‌లో మంచి అవకాశాలు లభించడంతో బీకాంకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సు రాష్ట్రవ్యాప్తంగానూ మంచి నాణ్యతను చూపుతోంది. లైఫ్ సైన్స్ కోర్సులకు అన్నిచోట్లా ఆదరణ లభిస్తోంది. దీంతోపాటు బీఏ ఆనర్స్ కోర్సులను విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఏదేమైనా డిగ్రీలో ప్రమాణాలు పెంచే దిశగా మండలి ప్రయత్నించడం కూడా ప్రవేశాలు పెరగడానికి దోహదపడుతోంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
అదానీ గ్రూప్‌లో అకౌంటింగ్ మోసాలు!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం అదానీ గ్రూప్ రూ. 20,000 కోట్ల భారీ ఫాలో ఆన్ ఇష్యూకు (ఎఫ్‌పీవో) వస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ షాకిచ్చింది. అదానీ గ్రూప్ .. అకౌంటింగ్ మోసాలకు, షేర్ల ధరల విషయంలో అవకతవకలకు పాల్పడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనితో బుధవారం అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. వివరాల్లోకి వెడితే.. అదానీ గ్రూప్ దశాబ్దాలుగా అకౌంటింగ్ మోసాలు, షేర్ల రేట్లకు సంబంధించి మోసాలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. కరీబియన్ దేశాలు మొదలుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు వివిధ దేశాల్లో అదానీ కుటుంబ సారథ్యంలోని షెల్ కంపెనీలు ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నాయని హిండెన్‌బర్గ్ తెలిపింది. లిస్టెడ్ కంపెనీల నిధులను దారి మళ్లించేందుకు, మనీ లాండరింగ్, అవినీతి, పన్ను ఎగవేతలకు పాల్పడేందుకు వీటిని ఉపయోగించారని ఆరోపించింది. ‘అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ 120 బిలియన్ డాలర్లకు పైగా సంపద సమకూర్చుకున్నారు. ఇందులో 100 బిలియన్ డాలర్లు, గ్రూప్‌లో భాగమైన ఏడు కీలకమైన లిస్టెడ్ కంపెనీల షేర్ల రేట్లు పెరగడం ద్వారా గత మూడేళ్లలోనే పోగుపడ్డాయి. ఈ వ్యవధిలో ఆయా సంస్థల షేర్లు సగటున 819 శాతం మేర ఎగిశాయి‘ అని ఒక నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక పరిశోధనలో భాగంగా అదానీ గ్రూప్‌లోని పలువురు మాజీ సీనియర్ ఉద్యోగులతో పాటు డజన్ల కొద్దీ వ్యక్తులతో మాట్లాడి, వేల కొద్దీ డాక్యుమెంట్లను సమీక్షించి, అరడజను పైగా దేశాల్లో సైట్ విజిట్లు చేశామని హిండెన్‌బర్గ్ వివరించింది. భారీ వేల్యుయేషన్లతో ట్రేడవుతున్న 7 కంపెనీల ఫండమెంటల్స్ బట్టి చూస్తే కనీసం 85 శాతం వరకు షేరు పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. అమెరికాలో ట్రేడయ్యే బాండ్లు, ఇతరత్రా డెరివేటివ్ సాధనాల ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లో తాము షార్ట్ పొజిషన్స్ తీసుకున్నట్లు వెల్లడించింది. అదానీ గ్రూప్ ఖండన... హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ను అదానీ గ్రూప్ ఖండించింది. వాస్తవాలను తెలుసుకునేందుకు తమను సంప్రదించేందుకు ఎటువంటి కనీస ప్రయత్నమూ చేయకుండా నివేదికను విడుదల చేయడం షాక్‌కు గురి చేసిందని వ్యాఖ్యానించింది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానాలు కూడా తోసిపుచ్చిన నిరాధార ఆరోపణలు, తప్పుడు సమాచారంతో దీన్ని రూపొందించారంటూ ఒక ప్రకటనలో ఆక్షేపించింది. సరిగ్గా ఎఫ్‌పీవోకు సిద్ధమవుతున్న తరుణంలో దీన్ని విడుదల చేయడం వెనుక గల ఉద్దేశాలను ప్రశ్నించింది. ‘అదానీ గ్రూప్ ప్రతిష్టను, ఇష్యూను దెబ్బతీయాలనే ప్రధాన లక్ష్యంతోనే ఇలా చేసినట్లు స్పష్టం అవుతోంది‘ అని వ్యాఖ్యానించింది. దేశీయంగా అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా పరిగణిస్తున్న ప్రతిపాదిత ఎఫ్‌పీవో జనవరి 27న ప్రారంభమై 31న ముగియనున్న సంగతి తెలిసిందే. షేర్లకు షాక్.. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ స్టాక్స్‌లో కొన్ని బుధవారం పది శాతం వరకూ క్షీణించాయి. దీంతో ఒక దశలో అదానీ సంపద దాదాపు 6 బిలియన్ డాలర్ల మేర పడిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత షేర్లు కొంత కోలుకున్నాయి. మొత్తం మీద అదానీ ట్రాన్స్మిషన్ షేరు సుమారు 9 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 6%, అదానీ టోటల్ గ్యాస్ 5.5%, అదానీ విల్మర్.. అదానీ పవర్ .. ఎన్డీటీవీ తలో 5%, అదానీ గ్రీన్ ఎనర్జీ 3%, ఇటీవల కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, ఏసీసీ కూడా 7% పైగా క్షీణించాయి. -
పెళ్లి అనుకుంటే లొల్లి
బనశంకరి: పెళ్లి సంబంధాల వెబ్సైట్లో పరిచయమైన యువతి మాయలో పడిన ఓ యువకుడు సుమారు రూ. 10 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు దక్షిణ పరిధిలో చోటుచేసుకుంది. హనుమగిరి నివాసి అజయ్‌కుమార్ బాధితుడు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అజయ్‌కుమార్ గత నెల 29వ తేదీన వెబ్సైట్లో వధువు కావాలని తన ఫొటో వివరాలను అప్లోడ్ చేశాడు. తరువాత ఉత్తర భారతదేశానికి చెందిన యువతి అతనికి మెసేజ్ పంపించగా ఇద్దరూ ఫోన్ నంబర్లను మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. భారీగా వసూళ్లు మీరంటే ఇష్టమని, మిమ్మల్ని చూడడానికి వస్తానని యువతి చెప్పింది. దీంతో యువకుడు ఆమె బ్యాంకు అకౌంట్‌కు కొంత డబ్బు జమచేశాడు. అప్పటినుంచి యువతి పలు కారణాలు చెబుతూ అతన్నుంచి నగదు పిండుకోసాగింది. మొత్తం రూ.9.95 లక్షలు ఆమె ఖాతాలోకి జమచేశాడు. తరువాత యువతి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని అడ్రస్ లేకుండా పోయింది. మోసపోయానని గుర్తించిన యువకుడు బెంగళూరు దక్షిణ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఐటీసీటీలో అతిపెద్ద సమస్య... అక్రమ సంబంధాలతో 981 జంటలు) -
జీవితాంతం వర్చువల్‌గానే..! ఎక్కడనుంచైనా పనిచేయండి..!ఉద్యోగులకు బంపర్ఆఫర్..!
కరోనా రాకతో ఉద్యోగులు పూర్తిగా ఇంటికే పరిమితమైనా విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. కోవిడ్-19 ఉదృత్తి కాస్త తగ్గిపోవడంతో పలు కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావాలని పిలుస్తున్నారు. మరికొన్ని కంపెనీలు కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తైన ఉద్యోగులు కార్యాలయాలకు కచ్చితంగా రావాలని హుకుంను జారీ చేశాయి. ఆఫీస్‌లకు అవసరం లేదు కానీ...! తాజాగా ప్రముఖ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీ ప్రైజ్‌వాటర్‌హౌజ్‌కూపర్స్(పీడబ్ల్యూసీ) తన కంపెనీలో పనిచేసే 40 వేల యూఎస్ క్లయింట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఉద్యోగులు జీవితాంతం ఆఫీస్‌లకు రానవసరం లేకుండా ఎక్కడినుంచైనా వర్చువల్‌గా పనిచేయవచ్చునని పీడబ్ల్యూసీ ఒక ప్రకటనలో తెలిపింది. పీడబ్య్లూసీ కాకుండా ఇతర ప్రధాన అకౌంటింగ్ సంస్థలు, డెలాయిట్ , కేపీఎమ్‌జీ కూడా, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులను రిమోట్‌గా పనిచేసేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయి. చదవండి: నాడు కాలినడక.. నేడు అపరకుబేరుడు! పీడబ్య్లూసీ డిప్యూటీ పీపుల్ లీడర్, యోలాండా సీల్స్-కాఫీల్డ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... క్లయింట్ సర్వీస్ ఉద్యోగుల కోసం పూర్తి సమయం వర్చువల్ వర్క్ అందించే తొలి సంస్థగా పీడబ్ల్యూసీ నిలిచిందన్నారు. హ్యూమన్ రిసోర్స్, అకౌంటింగ్ విభాగాల్లో ఉద్యోగులు ఇప్పటికే దాదాపు పూర్తి సమయం పనిచేసే అవకాశాన్ని కలిగి ఉన్నారు. వర్చువల్‌గా పనిచేసే ఉద్యోగులు ఒక నెలలో మూడు రోజుల పాటు కచ్చితంగా ముఖ్యమైన క్లయింట్ మీటింగ్‌లకోసం, లెర్నింగ్ సెషన్ల కోసం ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసులకు రావాలనే షరతును తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సి ఉంటుందని కంపెనీ డిప్యూటీ లీడర్ సీల్స్-కాఫీల్డ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వర్చువల్ ఉద్యోగాలను చేస్తున్నవారి వేతనాల పెంపుకు అడ్డంకిగా మారేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 284,000 మంది పనిచేస్తోంది. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! -
ఇన్ఫీలో మరో దుమారం!
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి ‘అనైతిక విధానాల’ ఆరోపణల్లో చిక్కుకుంది. సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలు పాటిస్తున్నట్లు పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు ఇన్ఫీ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ‘ఇటీవలి కొన్ని త్రైమాసికాలుగా సీఈవో పాటిస్తున్న అనైతిక విధానాలను మీ దృష్టికి తేగోరుచున్నాము. స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలు పెంచి చూపేందుకు ప్రస్తుత త్రైమాసికంలో కూడా అలాంటి విధానాలే పాటిస్తున్నారు. బోర్డు తక్షణమే విచారణ జరిపి, చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం‘ అంటూ సెప్టెంబర్ 20న డైరెక్టర్స్ బోర్డుకు వారు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఈ–మెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్ కూడా తమ దగ్గర ఉన్నట్లు తెలిపారు. అందులో తమను తాము ’నైతికత గల ఉద్యోగులుగా’ ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. మరోవైపు, ప్రజావేగుల ఫిర్యాదును కంపెనీ పాలసీ ప్రకారం ఆడిట్ కమిటీ ముందు ఉంచినట్లు ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలోనూ ఫిర్యాదు.. గడిచిన రెండు త్రైమా సికాలుగా ఇన్ఫీ ఖాతాలు, ఆర్థిక ఫలితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అమెరికాలోని ‘విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం’కు కూడా ప్రజావేగులు ఫిర్యాదు చేశారు. లాభాలను పెంచి చూపడం కోసం వీసా ఖర్చుల్లాంటి వ్యయాలను పూర్తిగా చూపించొద్దంటూ తమకు ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ‘ఈ సంభాషణకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. ఆడిటరు వ్యతిరేకించడంతో దీన్ని వాయిదా వేశారు‘ అని తెలిపారు. ఈ క్వార్టర్లోనూ లాభాలు తగ్గిపోయి, స్టాక్ ధరపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ఓ కాంట్రాక్టుకు సంబంధించి 50 మిలియన్ డాలర్ల చెల్లింపులను ఖాతాల్లో చూపొద్దంటూ చాలా ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారులు తెలిపారు. కీలకమైన సమాచారాన్ని ఆడిటర్లు, బోర్డుకు తెలియకుండా తొక్కిపెట్టి ఉంచడం జరుగుతోందని తెలిపారు. సీఈవోనే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.. ‘భారీ డీల్స్ కుదుర్చుకోవడంలో బోలెడు అవకతవకలు జరుగుతున్నాయి. సీఈవో అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. భారీ మార్జిన్లు వస్తున్నాయని తప్పుదోవ పట్టించేలా నివేదికలు తయారు చేయాలంటూ సేల్స్ టీమ్‌ను ఆదేశిస్తున్నారు. సీఎఫ్‌వో కూడా ఆయన చెప్పినట్లే చేస్తున్నారు. భారీ డీల్స్‌లో లొసుగులు బోర్డు సమావేశాల్లో ప్రస్తావనకు తేనివ్వకుండా మమ్మల్ని ఆపేస్తున్నారు. బోర్డు సభ్యులకివేవీ పట్టవని.. షేరు ధర బాగుంటే వాళ్లకు సరిపోతుందని సీఈవో మాతో చెప్పారు‘ అని ఫిర్యాదుదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని త్రైమాసికాలుగా కుదుర్చుకున్న బిలియన్ల డాలర్ల డీల్స్‌లో పైసా మార్జిన్ లేదని పేర్కొన్నారు. చాలా మటుకు స మాచారాన్ని ఆడిటర్లకు చెప్పకుండా దాచిపెట్టేస్తు న్నారని, కేవలం లాభాలు, సానుకూల అంశాలే ఆర్థిక ఫలితాల్లో చూపాలని సీఈవో, సీఎఫ్‌వో ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించా రు. దీన్ని వ్యతిరేకించే ఉద్యోగులను పక్కన పెడుతున్నారని, ఫలితంగా వారిలో చాలా మంది సం స్థ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో కూడా ఇన్ఫీ.. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెలీ టెక్నాలజీ సంస్థ పనయా కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ ప్రజావేగుల ఆరోపణలు వచ్చిన దరిమిలా అప్పటి సీఈవో విశాల్ సిక్కా, ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితర వ్యవస్థాపకుల మధ్య వివాదం తలెత్తింది. చివరికి 2017 ఆగస్టులో సిక్కా వైదొలిగారు. ఆయన స్థానంలో గతేడాది జనవరిలో పగ్గాలు చేపట్టిన సలిల్ పరేఖ్ కూడా తాజాగా గవర్నెన్స్ లోపాల ఆరోపణల్లో చిక్కుకోవడం గమనార్హం. ఇన్ఫీ ఏడీఆర్ క్రాష్... తాజా పరిణామాలతో అమెరికా నాస్డాక్లో లిస్టయిన ఇన్ఫోసిస్ ఏడీఆర్ (అమెరికన్ డిపాజిటరీ రిసీట్) సోమవారం కుప్పకూలింది. ఒక దశలో ఏకంగా 16 శాతం క్షీణించింది. -
నూతన అకౌంటింగ్ స్టాండర్డ్‌ను నోటిఫై చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: నూతన అకౌంటింగ్ స్టాండర్డ్ ‘ఐఎన్డీ ఏఎస్ 116’ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కంపెనీల్లో లీజుల వివరాలను వెల్లడించడం, బ్యాలన్స్ షీట్ల వివరాల వెల్లడిలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఇది సాయపడుతుందని భావిస్తున్నారు.. విమానాలను లీజులపై తీసుకుని నడిపే ఏవియేషన్ సహా పలు రంగాలపై ఈ నూతన అకౌంటింగ్ ప్రమాణాలు గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఐఎన్డీ ఏఎస్ 116 అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి కొత్త అకౌంటింగ్ ప్రమాణాలు
న్యూఢిల్లీ: భారత అకౌంటింగ్ నూతన ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో భారత అకౌంటింగ్ స్టాండర్డ్ (ఇండ్‌ఏఎస్) 115 అమల్లోకి రానున్నట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకటించింది. దీంతో కంపెనీలు తమ ఆదాయానికి సంబంధించి సమగ్ర వివరాలను నిర్వహించాల్సి వస్తుంది. నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇండ్‌ఏఎస్ 115 అన్నది ఆదాయాల్లో మరింత పారదర్శకతకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, టెలికం వంటి రంగాల కంపెనీలపై ప్రభావం ఉంటుంది. -
ఆదాయం లెక్కింపు - కొత్త స్టాండర్డ్స్
అంతర్జాతీయంగా వ్యాపార/వాణిజ్య సంబంధిత లావాదేవీలను ఎలా లెక్కించాలి? లెక్కించిన వాటి ని స్టేట్మెంట్లలో ఎలా చూపించాలి... అనే విషయంలో గత 40 సంవత్సరాలుగా కూలంకషంగా చ ర్చలు జరుగుతున్నాయి. వీటిల్లో అకౌంటింగ్ సంస్థలూ కలిశాయి. చివరకు అంతర్జాతీయ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కూడా 2010 నుంచి భారీస్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది. వారు స్వయంగా స్టాండర్డ్స్‌ని తయారుచేసి పదింటిని విడుదల చేశారు. ఇవి 01.04.2015 నుంచి అమల్లోకి వచ్చాయి. వేతన జీవులకు, ఇంటిపై ఆదాయం వచ్చేవారికి, మూలధన లాభాలకు వర్తించవు. ఈ మూడింట్లో అకౌంటింగ్‌కు సంబంధించిన అంశాలు లేవు కనక. ఏైవైనా అంశాల్లో భేదాభిప్రాయాలు వస్తే చట్టంలోని అంశాలే చెల్లుతాయి. వీటి ముఖ్యోద్దేశం ఆదాయం పన్ను లెక్కించడానికి సంబంధించిన వివాదాలు తగ్గించడమే. ట్యాక్స్ అడిట్ ఉన్నా లేకున్నా, టర్నోవర్‌తో నిమిత్తం లేకుండా అందరికీ వర్తిస్తాయి. ఇవి అమలు చేయకపోతే డిపార్ట్మెంట్ వారు బెస్ట్ జడ్జ్మెంట్ ప్రాతిపదికన అసెస్మెంట్ను పూర్తిచేస్తారు. కొత్త స్టాండర్డ్స్- వివరాలు ఐసీడీఎస్ 1 అకౌంటింగ్ పాలసీలు ఐసీడీఎస్ 2 ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఐసీడీఎస్ 3 కన్ స్ట్రక్షన్ కాంట్రాక్టులు ఐసీడీఎస్ 4 ఆదాయాన్ని నిర్మించటం ఐసీడీఎస్ 5 స్థిరాస్తులు ఐసీడీఎస్ 6 విదేశీ మారకం రేట్లు..మార్పు ఐసీడీఎస్ 7 ప్రభుత్వపు గ్రాంట్లు ఐసీడీఎస్ 8 సెక్యూరిటీలు ఐసీడీఎస్ 9 రుణాల మీద వడ్డీ, ఖర్చులు ఐసీడీఎస్ 10 ప్రొవిజన్లు, కంటింజెంట్ అప్పులు/ఆస్తులు ఈ విషయాలు గుర్తుంచుకోండి ⇒ కొత్త స్టాండర్డ్స్‌లో కొన్ని పదాలు కావాలని తొలగించారు. దీంతో అసెస్సీలకు నష్టం, కష్టం. ⇒ ఊహించని నష్టాలను లెక్కలోకి వేయండ ని సర్వత్రా వినిపిస్తుంటే.. ఆ ప్రస్తావనే లేదు. ⇒ ఇన్వెంటరీ వాల్యుయేషన్‌లో ఎన్నో ఇబ్బందులున్నాయి. ⇒ ఆదాయాన్ని త్వరగా గుర్తించేలా, ఖర్చుని ఆలస్యంగా గుర్తించే లా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు ఇవి విరుద్ధం. ⇒ చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా స్థిరాస్తులకు సంబంధించి రికార్డులు రాయాలి. ⇒ మార్పులను, కొత్త పోకడలను పరిగణనలోకి తీసుకోలేదు. ⇒ కంపెనీలు ఎన్నో విషయాల్లో సీఏ సంస్థ ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించేవి. ఇప్పుడు ఆ అవసరం లేదు. ⇒ అటు డిపార్ట్మెంట్ వారు, ఇటు అసెస్సీ ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి , కె.వి.ఎన్ లావణ్య -
డెలాయిట్ గ్లోబల్ సీఈవోగా భారతీయుడు
- పునీత్ రంజన్ నియామకం - జూన్ 1 నుంచి బాధ్యతలు న్యూయార్క్: అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సారథ్యం వహించే భారతీయుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ గ్లోబల్ సీఈవోగా ప్రవాస భారతీయుడు పునీత్ రంజన్ సోమవారం నియమితులయ్యారు. తద్వారా ఇంద్రా నూయి (పెప్సీకో), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), అన్షు జైన్ (డాయిష్ బ్యాంక్) తదితరుల సరసన ఆయన నిల్చారు. ప్రస్తుత డెలాయిట్ సీఈవో బ్యారీ సాల్జ్‌బర్గ్ స్థానంలో జూన్ 1 నుంచి రంజన్ బాధ్యతలు చేపడతారు. సీఈవోగా నియామకంపై రంజన్ సంతోషం వ్యక్తం చేశారు. డెలాయిట్‌కి ప్రస్తుతం భారత్ సహా 150 దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. రెండు లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచంలోనే నాలుగు అతి పెద్ద ఆడిటింగ్ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. మిగతావి పీడబ్ల్యూసీ, కేపీఎంజీ, ఈ అండ్ వై. వీటిని ‘బిగ్ ఫోర్’గా పిలుస్తారు. రంజన్ నేపథ్యమిదీ.. పునీత్ రంజన్.. హరియాణాలోని రోహ్తక్కి చెందినవారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సనావర్‌లో విద్యాభ్యాసం చేశారు. అటు తర్వాత రోటరీ ఫౌండేషన్ స్కాలర్షిప్ దక్కించుకుని పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. విలామెట్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. సుమారు 27 సంవత్సరాలుగా ఆయన డెలాయిట్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం డెలాయిట్ టచ్ తొమాత్సు (డెలాయిట్ గ్లోబల్) డెరైక్టర్‌గాను, డెలాయిట్ ఫౌండేషన్ డెరైక్టర్స్ బోర్డుకు చైర్మన్‌గాను వ్యవహరిస్తున్నారు. ఇవి కాకుండా యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, యునెటైడ్ వే వరల్డ్‌వైడ్‌లలో కూడా ఆయన సభ్యులుగా ఉన్నారు. -
ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ దేవరాజరెడ్డికి సన్మానం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఎం.దేవరాజరెడ్డికి ఆదివారంనాడిక్కడ ఘనంగా సన్మానం జరిగింది. ఐసీఏఐ హైదరాబాద్ చైర్మన్ కె.మతేష్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఐసీఏఐ 65 సంవత్సరాల చరిత్రలో ఒక తెలుగు వ్యక్తి ఈ పదవి దక్కించుకోవడం ఇదే మొదటి సారి. కాగా, 2016 నుంచి దేవరాజరెడ్డి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వృత్తిపరమైన అభివృద్ధి, ఆడిటింగ్, నైతిక ప్రమాణాలను మెరుగు పరచి ప్రపంచవ్యాప్తంగా సంస్థకు గుర్తింపు తీసుకువస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో రెండవ అతి పెద్ద అకౌంటింగ్ సంస్థ అయిన ఐసీఏఐకు దేవరాజ రెడ్డి వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులవడం గర్వించదగ్గ విషయమని మతేష్ రెడ్డి అన్నారు. -
2016 నుంచి సీఏ కొత్త సిలబస్
ఐసీఏఐ ప్రెసిడెంట్ కె.రఘు * అంతర్జాతీయ ప్రమాణాలతో కరికులమ్ * మహిళా సీఏల కోసం ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్.. * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి టాస్క్‌ఫోర్స్.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతున్న అకౌంటింగ్ నిబంధనలు, పన్ను చట్టాలకు అనుగుణంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ సిలబస్‌ను రూపొందిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. 2016 కల్లా కొత్త కరికులమ్‌ను ప్రవేశపెడుతున్నామని, దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ కె.రఘు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త సిలబస్ ఉంటుందన్నారు. శనివారం ఐసీఏఐ ‘కంపెనీల చట్టం, ప్రత్యక్ష పన్నులు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రఘు విలేకరులతో మాట్లాడారు.అంతర్జాతీయంగా చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి అధిక డిమాండ్ ఉందని, ఇక్కడ కోర్సు పూర్తి చేసిన వాళ్లకి విదేశాల్లో అధిక జీతాలకు ఉద్యోగాలు లభిస్తున్నయన్నారు. గతేడాది పరీక్ష రాసిన వాళ్లలో కేవలం ఏడు శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారంటే ఈ కోర్సు ఎంత కఠినమైనదో అర్థం చేసుకోవచ్చని, అందుకే ఇక్కడ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రారంభ వేతనంగా ఏడు లక్షల నుంచి గరిష్టంగా రూ. 21 లక్షల వరకు పొందుతున్నారన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 20 కేంద్రాల్లో క్యాంపస్ నియామకాలు జరిపామని, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఐటీ, ఈకామర్స్ రంగాల నుంచి డిమాండ్ బాగుందన్నారు. విద్యార్థులకు మెరుగైన సేవలను అందించే విధంగా క్లౌడ్ క్యాంపస్, 120 రీడింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘు తెలిపారు. ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్ ప్రాక్టీసులో ఉన్న మహిళా సభ్యులు కుటుంబ బాధ్యతల వల్ల వృత్తికి దూరమవుతున్నారని, వీరు ఇంటి దగ్గర నుంచే సేవలను అందించే విధంగా ‘ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 40,000 మంది మహిళా సీఏలు ఉండగా ఈ పోర్టల్ ఇప్పటి వరకు రెండు వేల మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వీరి సేవలను ఉపయోగించుకోవడానికి 150 కంపెనీలు ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో కంపెనీల చట్టంలో సవరణలు కొత్త కంపెనీల చట్టంలో సీఏలకు ప్రతికూలంగా ఉన్న కొన్ని నిబంధనలను మార్చడానికి కేంద్రం అంగీకరించిందని, దీనికి సంబంధించి వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సవరణలు జరగొచ్చన్నారు. ముఖ్యంగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ 20కి మించి కంపెనీల్లో పనిచేయకూడదన్న నిబంధనలో ప్రైవేటు కంపెనీలకు మినహాయించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, అలాగే ఆడిట్ రొటేషన్, ఫ్రాడ్ రిపోర్టింగ్ నిబంధనలను కూడా సవరించడానికి అంగీకరించినట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్లో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రీ బడ్జెట్ మెమొరాండం తుది దశలో ఉందని, ఈ నెలాఖరుకి కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి ఇవ్వనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీ కోసం టాస్క్ ఫోర్స్ కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సూచనలు సలహాలను ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, జనధన యోజన పథకాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. -
ఆరోగ్యశాఖ గణాంకాధికారి ఆస్పత్రిపాలు
అనంతపురం మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ గణాంక అధికారి ఉమామహేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం బీపీ లెవల్స్ పూర్తిగా పడిపోవడంతో అత్యవసర చికిత్స కోసం ఆయనను ఐసీయూలో చేర్చారు. డీఎంహెచ్ఓ దూషించినందువల్లే ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆస్పత్రి పాలైనట్లు తెలిసింది. కొంతమేరకు కోలుకున్న ఆయన విలేకరులకు తెలిపిన వివరాలు ఆయన మాటాల్లో.. ‘ ఈ నెల 25న డీఎంహెచ్ఓ రామసుబ్బారావు నన్ను పిలిపించారు. గ్రామాల్లో ఇళ్లలో అవుతున్న ప్రసవాల జాబితా అడిగారు. ఏడెనిమిది క్లస్టర్ల నుంచి అందిన సమచారాన్ని ఆయనకు ఇచ్చాను. మిగిలినవి రాలేదని తెలిపాను. పూర్తి సమాచారం ఎందుకు తెప్పించుకోలేదని ఆయన నాపై ఆగ్రహించారు. అందరికీ ఫోన్లు చేశాను, సమాచారం అందగానే తెలియచేస్తానని సమాధానమిచ్చా. దీంతో ఆయన నన్ను దూషిస్తూ మాట్లాడారు. మర్యాదగా మాట్లడమని కోరాను.. దీనిపై ఆయన రెచ్చిపోయి గెట్అవుట్ అంటూ తిట్టారు. మరుసటి రోజు(26న) ఉదయం కార్యాలయానికి వచ్చాను. క్యాంప్‌నకు వెళ్లాలని డీఎంహెచ్ఓ ఉద్దేశపూర్వకంగా ఆదేశించారు. కార్యాలయంలో మీటింగ్ జరుగుతోందని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. బీపీ, షుగర్‌తో బాధపడుతున్న నేను అప్పటికే మానసిక వత్తిడికి గురయ్యాను. క్యాంపునకు వెళ్లి రాత్రి వచ్చే సరికి నీరసించి అస్వస్థతకు గురయ్యాను. శనివారం ఉదయం లేవలేకపోవడంతో మా క్వార్టర్స్‌లో ఉన్న డాక్టర్ నా పరిస్థితి గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చారు.’ డీఎంహెచ్ఓ వేధింపులవల్ల తాను అస్వస్థతకు గురయ్యానని ఎస్ఓ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకుల పరామర్శ: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఓ ఉమామహేశ్వరరావును ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్, నాయకులు పెద్ద ఓబుళేసు, ఎన్ఎన్కుంట సూరి, దొడ్డప్ప, తదితరులు పరామర్శించారు. బీసీఆర్ దాస్ మాట్లాడుతూ డీఎంహెచ్ఓ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడుతున్నారని బాధితులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. డీఎంహెచ్‌ఓపై చర్యల తీసుకోవాలని ఆందోళనలు చేయడంతోపాటు, మంత్రులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. వెంటనే డీఎంహెచ్‌ఓపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆర్బీఐ బంగారం విలువ డౌన్!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న బంగారం విలువ గడచిన అకౌంటింగ్ ఇయర్లో (జూలై 2013-జూన్ 2014) భారీగా పడింది. అయితే పరిమాణంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. 557.75 టన్నుల బంగారం ఆర్బీఐ వద్ద ఉంది. ఈ పరిమాణం విలువ 2012-13 అకౌంటింగ్ ఇయర్లో రూ.1,28,685 కోట్లు కాగా, 2013-14 అకౌంటింగ్ ఇయర్లో రూ.1,24,002 కోట్లకు తగ్గింది. అంటే ఈ విలువ దాదాపు రూ. 4,683 కోట్లు తగ్గిందన్నమాట. అంతర్జాతీయంగా ఈ మెటల్ విలువ తగ్గడం దీనికి కారణం. ఆర్బీఐ గురువారం విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. 15 శాతం తగ్గిన మిగులు కాగా ఆర్బీఐ మిగులు(లాభం) గడచిన అకౌంటింగ్ ఇయర్లో 14.75 శాతం తగ్గింది. రూ. 52,679 కోట్లుగా నమోదయ్యింది. విదేశీ సావరిన్ బాండ్లపై చేసిన పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయం తగ్గడమే తన మిగులు తగ్గడానికి కారణమని ఆర్బీఐ నివేదిక తెలిపింది. పెట్టుబడులు పెరిగినప్పటికీ వడ్డీ ఆదాయం మాత్రం తగ్గినట్లు తెలిపింది. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ 10 శాతం పెరిగింది. రూ.23,90,700 కోట్ల నుంచి రూ.26,24,400 కోట్లకు చేరింది. ఆర్బీఐ స్థూల ఆదాయం 13.10 శాతం తగ్గి రూ.64,617 కోట్లకు పడింది. వ్యయం 4.9 శాతం తగ్గి రూ.11,934 కోట్లకు దిగింది. నికర మిగులు మొత్తం రూ.52,679 కోట్లను ఆర్బీఐ ఈ నెల 11న కేంద్రానికి బదలాయించింది. -
రూపం..అపురూపం..
ముద్దమందారంలాంటి ముఖారవిందం.. అరవిరిసిన కలువల్లాంటి కళ్లకు కాటుక బంధం.. సింధూర శోభితమై మెరిసిపోయే కస్తూరి తిలకం.. నునుసిగ్గుల బుగ్గలకు నల్లటి చంద్రబింబం.. సింగారి చేతులకు సిరిగంధం.. హరివిల్లును తలపించే పెళ్లి పట్టుచీర.. కాళ్లకు పారాణి.. అందానికే అర్థం చెప్పే తెలుగింటి నవవధువుకే సొంతమైన ఆభరణాలివి. పసుపు రాసిన ముఖానికి మరింత వన్నెతెచ్చే వయ్యూరాలివి. ఒకప్పుడు ఇంటి అందానికే పరిమితమైన పెళ్లికూతురు ఇప్పుడు బ్యూటీపార్లర్లకు పరుగులు పెడుతోంది. నలుగురిలోనూ నవ వధువే అందంగా కనిపించాలని బ్యూటీషియన్లు కూడా సరికొత్త మేకప్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. నుదుట బాసికం నుంచి కాళ్ల పారాణి వరకు సెలక్టెడ్‌గా చూసుకుంటూ పెళ్లి కూతురును సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఈ తరహా బ్యూటీస్పాలు పెళ్లి కూతుర్ల పాలిట వరాలుగా మారారుు. విజయవాడ : పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేసారి జరిగే పండుగ. దీనిని వినూత్నంగా, అందంగా జరుపుకోవాలన్న తపన అందరిలోనూ ఉంటుంది. ఇక నవ వధువునైతే అందంగా ముస్తాబుచేసి మురిసిపోవాలని తల్లిదండ్రులు ఆశ పడతారు. పెళ్లిలో వినూత్నంగా కనిపించి అత్తింటి వారి నుంచి నూటికి నూరు మార్కులు కొట్టేయూలని వధువు అనుకుంటుంది. ఇందుకోసం మరింత అందంగా ముస్తాబవుతుంది. యువతుల ఈ ఆసక్తిని గమనించిన బ్యూటీషియన్లు రకరకాల మేకప్‌లతో బ్యూటీషియన్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నుదుట బాసికం నుంచి పెళ్లిలో కట్టే చీర వరకు అన్నీ వారే డిజైన్ చేస్తున్నారు. ఇలా.. కొందరిని పెళ్లిరోజు, మరికొందరిని పెళ్లికి వారం రోజుల ముందు నుంచే సిద్ధం చేస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పెళ్లి వేడుక ఏదైనా.. ఆయా మత సాంప్రదాయాల ఆధారంగా నవ వధువులను ముస్తాబు చేసుందుకు బ్యూటీషియన్లు ముందుకొస్తున్నారు. వాటర్ మేకప్, మడ్ మేకప్, స్ప్రే మేకప్ ఇలా వివిధ రకాల మేకప్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. పెళ్లిరోజు చీరను కూడా వారే కడుతున్నారు. రెండు గంటల ముందు నుంచే.. వేడుక ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచే పెళ్లి కూతురును ముస్తాబు చేయడం ప్రారంభిస్తారు. తొలుత వధువు పర్మనాలజీ, ముఖ కవలికలను బట్టి ఎలాంటి మేకప్ వేయాలో నిర్ణయిస్తారు. ముఖంపై మచ్చలు ఉంటే కనిపించకుండా కన్సెలర్ మేకప్ వేసి సిరిదిద్దుతారు. కొందరికి నుదుటి భాగం నలుపు రంగులో ఉంటుంది. అలాంటి వాటిని సరిదిద్దేందుకు ఫౌండేషన్ మేకప్ వేస్తారు. అనంతరం కాంపాక్ట్ కోటింగ్ ద్వారా చూడచక్కగా తీర్చిదిద్దుతారు. పెళ్లిలో కట్టే చీరరంగు బట్టి కనురెప్పలపై మేకప్ డిజైన్ చేస్తారు. లిప్‌స్టిక్ కూడా ముఖ కవలికల ఆధారంగానే ఉంటుంది. పెదవులు పెద్దగా ఉన్న వారికి చిన్నవిగా చూపించే లిప్‌స్టిక్ వేస్తారు. ఇలా ప్రతి అంశాలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వధువును ముస్తాబు చేస్తారు. ఈ మేకప్ 6 నుంచి 7 గంటలు చెక్కు చెదరదు. శి‘రోజా’లు పెళ్లి సంప్రదాయూన్ని బట్టి బ్యుటీషియన్లు నవ వధువు హెయిర్ స్టైల్ డిజైన్ చేస్తారు. హిందూ సంప్రదాయ పెళ్లయితే పూలజడ, క్రిస్టియన్ పెళ్లి అయితే జుట్టు ముడివేసి ముఖంపైకి వెయిల్, ముస్లిం మ్యారేజ్ అయితే జుట్టు ముడివేసి పూలతో జడలా అల్లడం, ముఖంపైకి పూలు వచ్చేలా చేయడం చేస్తారు. రిసెప్షన్కైతే హెయిర్‌ను ఫ్రీగా వదిలేసి డిజైన్ చేస్తారు. కొందరు పెళ్లి వేడుకకు వారం, పదిరోజుల ముందు నుంచే బ్యూటీస్పా సెంటర్లకు వెళ్తున్నారు. టానింగ్, పేషియల్స్, బాడీ పాలీషింగ్ వంటి సిటింగ్‌ల ద్వారా చర్మంలోని మృత కణాలను తొలగించి సౌందర్యవంతంగా తయూరుచేస్తున్నారు. చేతులు నిగనిగ లాడేందుకు మానెక్యూర్, పాదాలు అందంగా కనిపించేందుకు పెడిచ్యూర్, జుట్టు మిలమిలా మెరిసిపోయేందుకు స్పా చేస్తున్నారు. రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తాం.. వధువు ముస్తాబు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారి ఇష్టానుసారమే మేకప్ వేస్తాం. ఇటీవల కాలంలో పెళ్లిళ్ల సమయంలోనే కాదు.. పెళ్లి కూతురును చేసేటపుడు కూడా బ్యూటీషియన్లను ఆశ్రయిస్తున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నవ వధువులను తీర్చిదిద్దుతున్నాం. ఈ విషయంలో ముందుగానే బంధువులకు కౌన్సెలింగ్ ఇస్తాం. ఒక్కో వేడుకకు రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తాం. పెళ్లి వేడుకల్లో కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేసేందుకు ప్రత్యేక శిక్షణ కూడా మేము ఇస్తున్నాం. - ఉడత ముఖేష్‌కుమార్, వెర్టెక్స్ గ్రూప్, డెరైక్టర్ అందానికే ప్రాధాన్యత నవ వధువుకు మేకప్ వేసేందుకు ముందుగా ఆమె పర్శనాలటీ, ముఖ కవలికలు వంటివి పరిగణనలోకి తీసుకుంటాం. పెళ్లి పగలా, రాత్రా అనే అంశాన్ని బట్టీ మేకప్ డిజైన్ ఉంటుంది. కనురెప్పల మేకప్‌తో పాటు లిప్‌స్టిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. చేతి గోర్లను షేప్ తీసుకురావడంతో పాటు అందంగా కనిపించేలా మెహిందీ వేస్తాం. పాదాలు మరింత అందంగా కనిపించేలా చూస్తాం. ఎంత సమయం పట్టినా.. పెళ్లి వేడుకలో అందంగా కనిపించడమే లక్ష్యంగా కృషి చేస్తుంటాం. - అను అగర్వాల్, బ్యూటీషియన్ -
అకౌంటింగ్
1. అమ్మకాల పుస్తకంలో రాసేటప్పుడు జరిగే తప్పును ఏమంటారు? గుమస్తా తప్పు 2. అద్దె కొనుగోలు ధర, నగదు కొనుగోలు ధర మధ్య తేడాను ఏమంటారు? వడ్డీ 3. ఎండార్స చేసిన వసూలు హుండీని దేనికి డెబిట్ చేస్తారు? రుణగ్రస్తుల ఖాతాకు 4. బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీని ఎవరు తయారు చేస్తారు? బ్యాంకు ఖాతాదారు 5. ఏ ఆస్తికి తరుగుదల ఉండదు? భూమి 6. సరకు అమ్మకాల చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 1930 7. డిపాజిట్లపై వడ్డీని పాస్‌బుక్‌లో ఏ వైపు రాస్తారు? {Mెడిట్ 8. {పయోజనాన్ని పొందే అంశం? డెబిట్ 9. అమ్మకాల ఆవర్జా ఏ తరహా ఖాతా? రుణగ్రస్తుల ఖాతా 10. చరాస్తులు, చర అప్పుల నిష్పత్తి ఎంత? 2 : 1 11. కన్సైన్మెంట్ ఖాతా ఏ తరహా ఖాతా? నామమాత్రపు ఖాతా 12. ఎండార్సమెంట్ అంటే? ఇతరులకు బదిలీ చేసే ఉద్దేశంతో చెక్కు వెనుక భాగంలో సంతకం చేయడం 13. ఉమ్మడి బ్యాంకు ఖాతా ఏ తరహా ఖాతా? వ్యక్తిగత ఖాతా 14. లాభ/నష్టాల ఖాతాను పోలి ఉండేది? ఆదాయ వ్యయాల ఖాతా 15. అంకణా తయారీ దేన్ని కనుక్కోవడంలో సహాయపడుతుంది? సవరించే దోషాలు 16. చెల్లింపు హుండీలను అంకణాలో ఏవైపు చూపాలి? {Mెడిట్ 17. వాస్తవిక ఖాతాలు ఏ నిల్వలను చూపుతాయి? డెబిట్ 18. భవనాలు, యంత్రాలు, నగదు మొదలైనవి ఏ తరహా ఖాతాలు? వాస్తవిక ఖాతాలు 19. ఎల్లప్పుడు డెబిట్ నిల్వ చూపేది? నగదు వరస 20. ముగింపు లెక్కలు తయారు చేసే ముందు రూపొందించే పట్టీ? అంకణా 21. మొత్తం ఆస్తులు = మొత్తం ఈక్విటీలు అనేది? అకౌంటింగ్ సమీకరణం 22. డిబెంచర్ల విమోచనం డిస్కౌంట్‌కు జరిగితే? పెట్టుబడి లాభం 23. నగదుతో సరకు కొంటే సంస్థకు ఏ ప్రయోజనం వస్తుంది? సరకు 24. {పొరెటా పద్ధతి ఎప్పుడు సంభవిస్తుంది? ఎక్కువ చందా ఉన్నప్పుడు 25. త్యాగాల నిష్పత్తిని ఎప్పుడు లెక్కిస్తారు? భాగస్వామి ప్రవేశించినప్పుడు 26. ఏ విధమైన ప్రయోజనం లేకుండా ద్రవ్యా న్ని వదిలేస్తే? నష్టం వస్తుంది 27. సరకు కొనుగోళ్లపై ఇచ్చే డిస్కౌంట్? వర్తకపు డిస్కౌంట్ 28. హుండీల్లో ఉండే పార్టీలు? ముగ్గురు 29. ఒక ఖాతాను ప్రభావితం చేసే తప్పు? నమోదు దోషం కావచ్చు 30. పుస్తకం రాసిన రచయితకు రాయల్టీ అనేది? ఆదాయం 31. చేతిలో నగదు తెలుసుకోవాలంటే దేన్ని రూపొందించాలి? వ్యవహారాల నివేదిక 32. నగదు పుస్తకం నిల్వ దేన్ని తెలుపుతుంది? చేతిలో నగదు 33. బ్యాంకుపై ఖాతాదారు జారీ చేసే ఆజ్ఞ? చెక్కు 34. వేతనాల చెల్లింపు అనేది? ఖర్చు 35. సంస్థ పేరు లేకుండానే చేసే వ్యాపారాన్ని ఏమంటారు? ఉమ్మడి వ్యాపారం 36. జంట పద్ధతిని ఎప్పుడు కనుక్కొన్నారు? 1494 37. దీర్ఘకాలిక, కనిపించని ఆస్తుల్లో పెట్టుబడిని రద్దు చేసే విధానం ఏమిటి? ఎమార్టైజేషన్ 38. సరకు అమ్మకాల చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 1930 39. జాయింట్ స్టాక్ కంపెనీలు అనుసరించడానికి వీలులేని పద్ధతి? ఒంటి పద్దు పద్ధతి 40. ఏ కారణం చేతనైనా ఒక ఆస్తి విలువ క్రమేణా తగ్గిపోవడాన్ని తరుగుదల అని నిర్వచించినవారు? కార్టర్ 41. ఖరీదుపై స్థూల లాభం 1/6 అయితే అమ్మకాలపై విలువ? 1/7 42. వసూలు కాని బాకీలను అంకణాలో ఎటు వైపు చూపుతారు? క్రెడిట్ వైపు 43. నగదు పుస్తకంలో రెండుసార్లు నమోదు చేసే అంశం? పోటీ పద్దు 44. ఇ-అకౌంటింగ్ అంటే? ఎలక్ట్రానిక్ అకౌంటింగ్ 45. వ్యవహారాలను ఏ సూత్రం ఆధారంగా రాస్తారు? డెబిట్ క్రెడిట్ సూత్రం 46. దీర్ఘకాల ప్రయోజనాన్ని ఇచ్చే వ్యయాన్ని ఏమంటారు? పెట్టుబడి వ్యయం 47. వాటా విలువలో వాటా దరఖాస్తుపై చెల్లించే మొత్తం ఎంత శాతానికి తక్కువగా ఉండొద్దు? 5 శాతం 48. చిట్టా పద్దు తర్వాత రాసేది? క్లుప్త వివరణ 49. మూడు వరసల నగదు చిట్టాలో ఉండేవి? నగదు, బ్యాంకు, డిస్కౌంట్ వరసలు 50. ఎండార్సమెంట్ పొందిన వ్యక్తి? ఎండార్సర్ 51. వ్యాపార ఆర్థిక స్థితిని తెలిపేది? ఆస్తి-అప్పుల పట్టీ 52. సర్దుబాటు పద్దులు ఏ సహాయక చిట్టాలో రాస్తారు? అసలు చిట్టా 53. గుడ్‌విల్ ఏ తరహా ఆస్తి? కనిపించని ఆస్తి 54. భారత భాగస్వామ్య చట్టం ఏ సంవత్స రంలో అమల్లోకి వచ్చింది? 1932 55. అరువుపై రూ. 500లు సరకు కొంటే ఏ ఖాతాలోకి డెబిట్ అవుతుంది? సరకు 56. సరకుల అమ్మకం చట్టం దేనికి వర్తిస్తుంది? అరువు అమ్మకాలు 57. జంట పద్దు విధానం ఒక? సంపూర్ణ విధానం 58. వ్యాపారేతర కంపెనీలో మూలధనాన్ని ఏమంటారు? సంచిత నిధి 59. {పతి నియంత్రణ ఖాతాకు ఒక? సహాయక ఆవర్జా ఉండాలి 60. ఖాతాల సంపుటి అని దేన్ని అంటారు? ఆవర్జా 61. ఏ రకమైన ఖాతాలకు బ్యాంకు అధిక వడ్డీ ఇస్తుంది? ఫిక్స్డ్ ఖాతా 62. అరువు కొనుగోళ్లను ఏ ఖాతా ద్వారా కనుక్కోవచ్చు? రుణదాతల ఖాతా 63. నియమావళిలో పేర్కొన్నప్పుడు ముందు గా చేసిన పిలుపుపై వడ్డీ ఎంత? 6 శాతం 64. డిబెంచర్పై దేన్ని చెల్లిస్తారు? వడ్డీ 65. ఒక భాగస్వామి విరమణ వల్ల మిగిలిన వారి వాటా? పెరుగుతుంది 66. ఆస్తి-అప్పుల పట్టిలో గుడ్‌విల్‌ను ఏ వైపున చూపుతారు? ఆస్తుల వైపు 67. ఉమ్మడి జీవిత బీమా పాలసీపై ప్రీమియం చెల్లింపును ఎప్పుడు నిలిపివేస్తారు? భాగస్వామి మరణం తర్వాత 68. తరుగుదలను ఖాతా పుస్తకాల్లో చూపడం వల్ల ఏం జరుగుతుంది? లాభం తగ్గుతుంది 69. ఏ తరుగుదల పద్ధతిలో ఆస్తి ఖాతా పూర్తిగా రద్దవుతుంది? స్థిర వాయిదాల పద్ధతి 70. ఆదాయ, వ్యయాల ఖాతాలోని నిల్వ దేన్ని చూపుతుంది? మిగులు 71. {పామిసరీ నోట్ కాలపరిమితి ఎంత? మూడేళ్లు 72. తరుగుదలను దేనిపై లెక్కిస్తారు? స్థిరాస్తులపై 73. మలిపద్దు పుస్తకం అంటే? ఆవర్జా 74. కౌలుదారుడికి రాయల్టీ అనేది? ఖర్చు 75. డెల్క్రెడరీ కమిషన్ ఇచ్చినప్పుడు రాని బాకీల నష్టాన్ని ఎవరు భరిస్తారు? కన్సైనీ 76. చిట్టాలో ఉండే వరసల సంఖ్య? ఐదు 77. అన్యాక్రాంత యోగ్య పత్రాల చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1881 78. కంపెనీ చట్టం ప్రకారం ఆస్తి - అప్పుల పట్టీ ఏ పద్ధతిని అనుసరించి ఉంటుంది? జాబితా -2 79. సరాసరి గడువు తేదీ అంటే? ప్రారంభ తేదీ + గుణిజాల మొత్తం చిచిచిచిచిచిచిచిచి వ్యవహారాల మొత్తం 80. మూలధనం ఏ ఖాతాకు చెందింది? వ్యక్తిగత ఖాతా 81. ఓవర్ డ్రాఫ్ట్ అంటే? ప్రతికూల నిల్వ 82. క్లెయిమ్ చేయని డివిడెండ్ అంటే ఏమిటి? అప్పు 83. విలువలేని ఆస్తులను ఏమంటారు? {దవ్యత్వ ఆస్తులు 84. సహాయక పుస్తకాలకు ఉదాహరణ? నగదు పుస్తకం 85. వ్యాపారేతర సంస్థలోని మిగులును దేనికి కలుపుతారు? మూలధన నిధి 86. రాని బాకీలను ఏ నిల్వ చూపుతుంది? డెబిట్ నిల్వ 87. సర్దుబాటు పద్దులు ఏ సహాయక చిట్టాలో రాస్తారు? అసలు చిట్టా 88. నమోదిత కంపెనీలు అంటే? కంపెనీల చట్టం 1956 కింద నమోదైన కంపెనీలు 89. పెట్టుబడులు ఏ తరహా ఖాతా? వాస్తవిక ఖాతా -
అకౌంటింగ్
1. వ్యాపారంలో వ్యాపారస్థుడు పెట్టిన పెట్టుబడిని ఏమంటారు? మూలధనం 2. సొంతానికి యజమాని వాడుకునే సరుకు లేదా నగదును ఏమంటారు? సొంత వాడకాలు 3. వ్యాపార సంస్థ వసూలు చేయలేని మొత్తాలను లేదా రుణాలను ఏమంటారు? రాని బాకీలు (మొండి బాకీలు) 4. తేదీల ప్రకారం వరుసక్రమంలో అన్ని వ్యవహారాలను నమోదు చేసే పుస్తకాన్ని ఏమంటారు? చిట్టా 5. తొలిపద్దు పుస్తకాన్ని ఏమంటారు? చిట్టా 6. అన్ని రకాల ఖాతాలు ఉన్న ముఖ్యమైన పుస్తకాన్ని ఏమంటారు? ఆవర్జా 7. వ్యాపార వ్యవహారాన్ని చిట్టాలో నమోదు చేయడాన్ని ఏమంటారు? చిట్టాపద్దు 8. మూలధనం + అప్పులు = ? ఆస్తులు 9. ఆస్తులు - అప్పులు = ? మూలధనం 10. జంటపద్దు విధానాన్ని అనుసరించకుండా వ్యాపార వ్యవహారాలను నమోదు చేసే పద్ధతిని ఏమంటారు? ఒంటిపద్దు విధానం 11. రెండు ఖాతాల్లో వ్యవహారాన్ని నమోదు చేసే పద్ధతిని ఏమంటారు? జంటపద్దు విధానం 12. {పతి డెబిట్‌కు సరైన మొత్తంలో క్రెడిట్ నమోదు చేయాలనే సిద్ధాంతం ఏ పద్ధతి ప్రకారం అనుసరిస్తారు? జంటపద్దు విధానం 13. వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు చెందే ఖాతాలను ఏమంటారు? వ్యక్తిగత ఖాతాలు 14. చెల్లించాల్సిన జీతాలు ఏ తరహా ఖాతాకు చెందుతాయి? వ్యక్తిగత ఖాతాలు 15. బ్యాంకు ఖాతా ఏ తరహాకు చెందింది? వ్యక్తిగత ఖాతా 16. గుడ్‌విల్ ఏ తరహా ఖాతాకు చెందింది? వాస్తవిక ఖాతా 17. సొంత వాడకాలు ఏ తరహా ఖాతాకు చెందినవి? వ్యక్తిగత ఖాతా 18. వ్యక్తిగత ఖాతాలో ప్రయోజనం పొందే వ్యక్తిని ఏమంటారు? డెబిట్ దారుడు 19. వ్యక్తిగత ఖాతాలో ప్రయోజనం ఇచ్చే వ్యక్తిని ఏమంటారు? క్రెడిట్ దారుడు 20. నామమాత్రపు ఖాతాలో క్రెడిట్ నిల్వలు దేన్ని సూచిస్తాయి? ఆదాయం లేదా లాభం 21. ఖాతాలో డెబిట్, క్రెడిట్ మధ్య తేడాను ఏమంటారు? నిల్వ 22. నగదు ఖాతా ఎల్లప్పుడూ దేన్ని చూపిస్తుంది? డెబిట్ నిల్వను 23. ఓవర్ డ్రాఫ్ట్ పద్ధతిలో బ్యాంకు నిల్వ దేన్ని చూపిస్తుంది? క్రెడిట్ నిల్వ 24. అమ్మకం పుస్తకంలో దేన్ని మాత్రమే నమోదు చేస్తారు? అరువు అమ్మకాలను 25. బదిలీ పద్దులను నమోదు చేసే పుస్తకాన్ని ఏమంటారు? అసలు చిట్టా 26. బ్యాంకు ఛార్జీలను పాస్‌బుక్‌లో ఏ వైపు నమోదు చేస్తారు? డెబిట్ వైపు 27. అకౌంటింగ్ ప్రాథమిక విధి? వ్యాపార వ్యవహారాలను విశ్లేషించి, నమోదు చేయడం 28. అకౌంటింగ్ ధ్యేయం? నమోదు చేసిన వ్యవహారాల ఫలితాలను కనుక్కోవడం 29. అకౌంటింగ్ అంటే? వ్యవహారాలను నమోదు చేసి, ఫలితాలను సమీక్షించడం 30. అకౌంటింగ్ ఏ తరహా వ్యవహారాలను నమోదు చేస్తుంది? ఆర్థిక వ్యవహారాలు 31. అకౌంటింగ్ వల్ల ఏ రకమైన వ్యక్తులకు సమాచారం లభిస్తుంది? యజమానులు, ప్రభుత్వం, రుణదాతలకు 32. అకౌంటింగ్ ఒక? భాష 33. ఆర్థిక నివేదికలు దేనిలో అంతర్భాగాలు? అకౌంటింగ్ 34. నగదు లేదా నగదు సమానమైన అంశాన్ని బదిలీ చేసే వ్యవహారాన్ని ఏమంటారు? ఆర్థిక వ్యవహారం 35. జంటపద్దు విధానాన్ని కనిపెట్టింది? లూకా పాసియులి 36. అకౌంటింగ్ మొదటి దశ? చిట్టా 37. ద్వంద్వరూప భావనను అనుసరిస్తూ వ్యవహారాలను నమోదు చేసే పద్ధతి? జంటపద్దు విధానం 38. చిట్టా అంటే? తొలిపద్దు పుస్తకం 39. నగదు ఖాతా అంటే? వాస్తవిక ఖాతా 40. యజమాని ఖాతా అంటే? వ్యక్తిగత ఖాతా 41. చిట్టాలో ఆవర్జా పుట సంఖ్యను ఎప్పుడు నింపుతారు? చిట్టా నుంచి ఆవర్జాకు వ్యవహారాలను బదిలీ చేసేటప్పుడు 42. మలిపద్దు పుస్తకాన్ని ఏమంటారు? ఆవర్జా 43. వ్యవహారాలను చిట్టా నుంచి ఆవర్జాకు బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? వ్యవహారాలను ఆవర్జాలో నమోదు చేయడం 44. ఆవర్జా నమోదు తర్వాత దశ? నిల్వ తేల్చడం 45. ఆవర్జా అంటే? అన్ని ఖాతాలకు సంబంధించిన సంపుటి 46. వ్యాపార వ్యవహారాల స్వభావాన్ని బట్టి వివిధ పుస్తకాల్లో నమోదు చేసే చిట్టాలను ఏమంటారు? సహాయక చిట్టాలు 47. అరువు కొనుగోళ్లను మాత్రమే నమోదు చేసే పుస్తకం? కొనుగోళ్ల చిట్టా 48. అమ్మకం ధర మీద లేదా ఇన్వాయిస్ మీద ఇచ్చే తగ్గింపును ఏమంటారు? వర్తకపు డిస్కౌంట్ 49. రుణదాత, రుణగ్రస్థునకు ఇచ్చే మినహాయింపును ఏమంటారు? నగదు డిస్కౌంట్ 50. సహాయక చిట్టాను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? 8 51. కొనుగోలు చేసిన సరుకును సప్లయ్దారునకు తిరిగి పంపేటప్పుడు తయారుచేసే నోట్? డెబిట్ నోట్ 52. ఖాతాదారులకు అమ్మిన సరుకు తిరిగి వచ్చినప్పుడు తయారుచేసే నోట్? క్రెడిట్ నోట్ 53. నగదు వ్యవహారాలను మాత్రమే నమోదు చేసే చిట్టాను ఏమంటారు? నగదు చిట్టా 54. ఎదుటి పద్దులను మాత్రమే నమోదు చేసే చిట్టాను ఏమంటారు? మూడు వరుసల నగదు పుస్తకం 55. చిల్లర చెల్లింపులను నమోదు చేసే పుస్తకం? చిల్లర నగదు పుస్తకం 56. సర్దుబాటు పద్దులను నమోదు చేసే పుస్తకం? అసలు చిట్టా 57. పాస్‌బుక్ డెబిట్ నిల్వ చూపడాన్ని ఏమంటారు? ఓవర్ డ్రాఫ్టు 58. బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీని ఎవరు తయారుచేస్తారు? వర్తకుడు 59. బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ ఒక? నివేదిక 60. వసూళ్ల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉండటాన్ని ఏమంటారు? ఓవర్ డ్రాఫ్టు 61. అంకణా ఒక? నివేదిక 62. అంకణా తయారుచేసే ఉద్దేశం? అంకగణిత కచ్చితత్వం తెలుసుకోవడానికి 63. అంకణాలో ఉన్న తేడాను ఏ ఖాతాకు బదిలీ చేస్తారు? అనామతు ఖాతా 64. అంకణా తయారుచేయడానికి తోడ్పడేవి? ముగింపు లెక్కలు 65. ఆస్తులను అంకణాలో ఏ వైపున చూపిస్తారు? డెబిట్ 66. గణకశాస్త్ర సూత్రాలకు విరుద్ధంగా వ్యవహారాలను నమోదు చేయడం? సిద్ధాంతపరమైన తప్పులు 67. రాబడి వ్యయాన్ని మూలధన వ్యయంగా నమోదు చేసే తప్పును ఏ రకమైన తప్పుగా భావిస్తారు? సిద్ధాంతపరమైన తప్పు 68. యంత్రంపై మరమ్మతులను, యంత్రం ఖాతాకు డెబిట్ చేయడాన్ని ఏ రకమైన తప్పుగా పరిగణిస్తారు? సిద్ధాంతపరమైన తప్పు 69. గణక సిబ్బంది చేసే తప్పులను ఏమంటారు? రాత పూర్వకమైన తప్పులు 70. ఫర్నీచర్ కొనుగోలు - ఫర్నీచర్ ఖాతాకు బదులుగా కొనుగోలు ఖాతాకు డెబిట్ చేయడం? సిద్ధాంతపరమైన తప్పు 71. రాము ఖాతాలో * 500 క్రెడిట్ వైపు తక్కువగా, గోపీ ఖాతాలో * 500 డెబిట్ వైపు తక్కువగా రాసే తప్పు? సరిపెట్టే తప్పు 72. రాబడి వ్యయాలను దేనిలో నమోదు చేస్తారు? వర్తకపు లాభనష్టాల ఖాతాలో 73. మూలధన వ్యయాలను దేనిలో నమోదు చేస్తారు? ఆస్తి అప్పుల పట్టీ 74. నికర లాభం లేదా నికర నష్టాన్ని ఏ ఖాతాకు బదిలీ చేస్తారు? మూలధన ఖాతా 75. సంస్థ ఆర్థిక పరిస్థితిని తెలియజేసే నివేదికను ఏమంటారు? ఆస్తి అప్పుల పట్టీ 76. వ్యయాలపై ఆదాయాల మిగులును ఏమంటారు? నికర లాభం 77. కన్పించే, కన్పించని ఆస్తులకు సంబంధించిన ఖాతాలు? వాస్తవిక ఖాతాలు 78. వర్తకపు సంస్థ స్థూల లాభం లేదా స్థూల నష్టం తెలుసుకోవడానికి తయారుచేసే ఖాతా? వర్తకపు ఖాతా 79. ఆస్తుల నాణ్యత, విలువను కోల్పోవడాన్ని ఏమంటారు? తరుగుదల 80. ఏటా తరుగుదల సమానంగా ఏర్పాటు చేసే పద్ధతి? స్థిర వాయిదాల పద్ధతి 81. తగ్గింపు అయిన నిల్వపై తరుగుదలను లెక్కించే పద్ధతి? తగ్గుతున్న నిల్వల పద్ధతి 82. ఆస్తి జీవితకాలం తర్వాత మిగిలిన విలువను ఏమంటారు? అవశేషపు విలువ 83. ఆస్తి పునఃస్థాపనకు ఏర్పాటు చేసే నిధి? తరుగుదల నిధి 84. ఆస్తి అమ్మగా వచ్చిన నష్టాన్ని ఏ ఖాతాకు బదిలీ చేస్తారు? లాభనష్టాల ఖాతా 85. ఆస్తి అమ్మగా వచ్చిన మొత్తాన్ని ఏ ఖాతాకు క్రెడిట్ చేస్తారు? ఆస్తి ఖాతాకు 86. విడి పరికరాలకు ఏ రకమైన తరుగుదల పద్ధతిని అమలు చేస్తారు? పునర్ మూల్యాంకన పద్ధతి 87. వాహనాలకు ఏ విధమైన తరుగుదల పద్ధతి అవలంబిస్తారు? తగ్గుతున్న నిల్వల పద్ధతి 88. కన్సైన్మెంట్ అంటే? సరుకులను ఏజెంట్ల ద్వారా అమ్మడం -
రూ.178 కోట్లకు లెక్కల్లేవ్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం:‘మంజూరైన నిధులకు లెక్కలు చూపిస్తేనే తదుపరి నిధుల్ని విడుదల చేస్తాం.’ బీఆర్జీఎఫ్(వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఫండ్) నిధులపై కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరిక ఇది. దీంతో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఆడిట్ అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాల్ని దాదాపు పరిష్కరించుకుంటున్నారు. కానీ బీఆర్జీఎఫ్ యేతర నిధులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. అసలు ఆ నిధుల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్, 13వ ఆర్థిక సంఘం, రూరల్ డెవలప్మెంట్ ఫండ్స్, ఇసుక సీనరేజీ, సాధారణ నిధుల వినియోగాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతో స్థానిక సంస్థలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వాల ఉదాసీనతతో నిబంధనల్ని పక్కన పెట్టి, నచ్చినట్టు ఖర్చు చేస్తున్నాయి. ఈ క్రమంలో పాలకులు, అధికారులు చేతి వాటవాన్ని ప్రదర్శిస్తున్నారు. మంజూరైన నిధులకు లెక్కలు చూపించడం లేదు. ఈ విధంగా విడుదలైన నిధులకు, ఖర్చుకు పొంతన కుదరడం లేదు. జిల్లాకు మంజూరైన నిధుల్లో రూ.178.63 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రతీ పైసాకు స్థానిక సంస్థలు లెక్క చూపించాల్సి ఉంది. ఆ మేరకు ఆడిట్ చేయించుకోవాలి. కానీ మంజూరైన నిధులకు పూర్తి స్థాయిలో లెక్కలు చూపించడం లేదు సరికదా... ఆడిట్‌ను కూడా సరిగా చేయించుకోవ డం లేదు. ఆడిట్ చేసిన వరకూ చూస్తే జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, పంచాయతీలు, మున్సిపాల్టీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థలు, దేవాలయాల్లో ఇప్పటివరకు రూ.178.63 కోట్లకు లెక్కలు తేలలేదు. దాదాపు లక్షా 13వేల 845 అభ్యంతరాలు పేరుకుపోయి ఉన్నాయి. ఇందులో దుర్వినియోగం చేసిన నిధులతో పాటు అడ్వాన్సుల కింద వాడేసిన నిధులకు లెక్కలు చూపడం లేదు. ఎం- బుక్‌లో రికార్డు చేయకుండా నిధుల వినియోగించినట్టు కూడా ఆడిట్లో తేలింది. ఇక రికార్డులు గల్లంతు చేసిన వ్యవహారం కూడా పలుచోట్ల వెలుగు చూసింది. ఆడిట్ అధికారులు వ్యక్తం చేసిన ప్రతి అభ్యంతరానికీ అధికారులు సమాధానం చెప్పాలి. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏటా ఆడిట్ అభ్యంతరాలు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించకపోవడమే దీనికి కారణం. అభ్యంతరాల్ని పరిష్కరి స్తేనే నిధులు విడదల చేస్తామని బీఆర్‌జీఎఫ్‌కు ఏ రకంగానైతే షరతులు విధించారో ఆ దిశగా మిగతా నిధుల వినియోగంపై వ్యవహరించి ఉంటే తప్పనిసరిగా లెక్కలు చూపించేవారు. కానీ మన పాలకులు, ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నిధులిచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అవి సక్రమంగా ఖర్చు అయ్యాయా ? లేదా ? అన్నదానిపై దృ ష్టి సారించడం లేదు. పోనీ ఆడిట్ అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాల్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలని లేదంటే చర్యలు తీసుకోవల్సి వస్తోందని కనీస హెచ్చరికలు కూ డా చేయడం లేదు. ఈ క్రమంలో రూ.178 కోట్లు అతీగతి లేకుండా పోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఏమయ్యాయో తేలడం లేదు. దీంతో అవన్నీ స్వాహా అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవీ చేయాలి... కార్యాలయంలో జరిగిన ప్రతీ ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన రికార్డులను చూపించాలి. ఖర్చుకు సంబంధించిన ఓచర్లు, బిల్లులు సమర్పించాలి. మంజూరు ఉత్తర్వులు చూపించాలి. చెక్‌బుక్‌లు సమర్పించాలి. {sెజరీ, బ్యాంకు పాసు పుస్తకాలను సైతం అందజేయాలి. ఒక్కొక్క లావాదేవీకి సంబంధించిన రిజిస్టర్లను కూడా చూపించాలి. ఆడిట్ రిపోర్టు ఇచ్చిన 60 రోజుల్లోగా సాధారణ అభ్యంతరాలకు జవాబులివ్వాలి. {పత్యేక లేఖ ద్వారా తెలియజేసిన తీవ్రమైన అభ్యంతరాలకు 120రోజులు సమాధానమివ్వాలి. {పత్యేక లేఖ ద్వారా తెలియజేసిన అభ్యంతరాలకు నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే సర్ఛార్జ్ నోటీసు అందుకోవాల్సి ఉంది. సర్ఛార్జ్ లేఖ ఇచ్చిన 60రోజుల్లోగా అభ్యంతరాల సొమ్మును సంబంధిత ఖాతాకు జమ చేయాలి. జిల్లాలోని స్థానిక సంస్థలపై ఆడిట్ నివేదిక స్థానిక సంస్థ ఆడిట్ అభ్యంతరాలు లెక్కలు తేలని మొత్తం జిల్లా పరిషత్ 656 రూ. 48.73కోట్లు మండల పరిషత్‌లు 4679 రూ. 12.50కోట్లు గ్రామ పంచాయతీలు 1,02,491 రూ. 69.73కోట్లు మున్సిపాల్టీలు 3195 రూ.40.5కోట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీలు 247 రూ.2.6కోట్లు గ్రంథాలయ సంస్థలు 123 రూ.3.5కోట్లు దేవాలయాలు 2453 రూ.99.40లక్షలు