అకౌంటింగ్ | accounting | Sakshi
Sakshi News home page

అకౌంటింగ్

Published Sun, Feb 9 2014 10:08 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

అకౌంటింగ్ - Sakshi

అకౌంటింగ్

 1.    అమ్మకాల పుస్తకంలో రాసేటప్పుడు జరిగే తప్పును ఏమంటారు?
       గుమస్తా తప్పు
 2.    అద్దె కొనుగోలు ధర, నగదు కొనుగోలు ధర మధ్య తేడాను ఏమంటారు?
       వడ్డీ
 3.    ఎండార్‌‌స చేసిన వసూలు హుండీని దేనికి డెబిట్ చేస్తారు?
       రుణగ్రస్తుల ఖాతాకు
 4.    బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీని ఎవరు తయారు చేస్తారు?
       బ్యాంకు ఖాతాదారు
 5.    ఏ ఆస్తికి తరుగుదల ఉండదు?
       భూమి
 6.    సరకు అమ్మకాల చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?
       1930
 7.    డిపాజిట్లపై వడ్డీని పాస్‌బుక్‌లో ఏ వైపు రాస్తారు?
       {Mెడిట్
 8.    {పయోజనాన్ని పొందే అంశం?
       డెబిట్
 9.    అమ్మకాల ఆవర్జా ఏ తరహా ఖాతా?
       రుణగ్రస్తుల ఖాతా
 10.    చరాస్తులు, చర అప్పుల నిష్పత్తి ఎంత?
       2 : 1
 11.    కన్‌సైన్‌మెంట్ ఖాతా ఏ తరహా ఖాతా?
       నామమాత్రపు ఖాతా
 12.    ఎండార్‌‌సమెంట్ అంటే?
       ఇతరులకు బదిలీ చేసే ఉద్దేశంతో చెక్కు వెనుక భాగంలో సంతకం చేయడం
 13.    ఉమ్మడి బ్యాంకు ఖాతా ఏ తరహా ఖాతా?
       వ్యక్తిగత ఖాతా
 14.    లాభ/నష్టాల ఖాతాను పోలి ఉండేది?
       ఆదాయ వ్యయాల ఖాతా
 15.    అంకణా తయారీ దేన్ని కనుక్కోవడంలో సహాయపడుతుంది?
       సవరించే దోషాలు
 16.    చెల్లింపు హుండీలను అంకణాలో ఏవైపు చూపాలి?
       {Mెడిట్
 17.    వాస్తవిక ఖాతాలు ఏ నిల్వలను చూపుతాయి?
       డెబిట్
 18.    భవనాలు, యంత్రాలు, నగదు మొదలైనవి ఏ తరహా ఖాతాలు?
       వాస్తవిక ఖాతాలు
 19.    ఎల్లప్పుడు డెబిట్ నిల్వ చూపేది?
       నగదు వరస
 20.    ముగింపు లెక్కలు తయారు చేసే ముందు రూపొందించే పట్టీ?
       అంకణా
 21.    మొత్తం ఆస్తులు = మొత్తం ఈక్విటీలు అనేది?
       అకౌంటింగ్ సమీకరణం
 22.    డిబెంచర్ల విమోచనం డిస్కౌంట్‌కు జరిగితే?
       పెట్టుబడి లాభం
 23.    నగదుతో సరకు కొంటే సంస్థకు ఏ ప్రయోజనం వస్తుంది?
       సరకు
 24.    {పొరెటా పద్ధతి ఎప్పుడు సంభవిస్తుంది?
       ఎక్కువ చందా ఉన్నప్పుడు
 25.    త్యాగాల నిష్పత్తిని ఎప్పుడు లెక్కిస్తారు?
       భాగస్వామి ప్రవేశించినప్పుడు
 26.    ఏ విధమైన ప్రయోజనం లేకుండా ద్రవ్యా న్ని వదిలేస్తే?
       నష్టం వస్తుంది
 27.    సరకు కొనుగోళ్లపై ఇచ్చే డిస్కౌంట్?
       వర్తకపు డిస్కౌంట్
 28.    హుండీల్లో ఉండే పార్టీలు?
       ముగ్గురు
 29.    ఒక ఖాతాను ప్రభావితం చేసే తప్పు?
       నమోదు దోషం కావచ్చు
 30.    పుస్తకం రాసిన రచయితకు రాయల్టీ అనేది?
       ఆదాయం
 31.    చేతిలో నగదు తెలుసుకోవాలంటే దేన్ని రూపొందించాలి?
       వ్యవహారాల నివేదిక
 32.    నగదు పుస్తకం నిల్వ దేన్ని తెలుపుతుంది?
       చేతిలో నగదు
 33.    బ్యాంకుపై ఖాతాదారు జారీ చేసే ఆజ్ఞ?
       చెక్కు
 34.    వేతనాల చెల్లింపు అనేది?
       ఖర్చు
 35.    సంస్థ పేరు లేకుండానే చేసే వ్యాపారాన్ని ఏమంటారు?
       ఉమ్మడి వ్యాపారం
 36.    జంట పద్ధతిని ఎప్పుడు కనుక్కొన్నారు?
       1494
 37.    దీర్ఘకాలిక, కనిపించని ఆస్తుల్లో పెట్టుబడిని రద్దు చేసే విధానం ఏమిటి?
       ఎమార్టైజేషన్
 38.    సరకు అమ్మకాల చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?
       1930
 39.    జాయింట్ స్టాక్ కంపెనీలు అనుసరించడానికి వీలులేని పద్ధతి?
       ఒంటి పద్దు పద్ధతి
 40.    ఏ కారణం చేతనైనా ఒక ఆస్తి విలువ క్రమేణా తగ్గిపోవడాన్ని తరుగుదల అని నిర్వచించినవారు?
       కార్టర్
 41.    ఖరీదుపై స్థూల లాభం 1/6 అయితే అమ్మకాలపై విలువ?
       1/7
 42.    వసూలు కాని బాకీలను అంకణాలో ఎటు వైపు చూపుతారు?
       క్రెడిట్ వైపు
 43.    నగదు పుస్తకంలో రెండుసార్లు నమోదు చేసే అంశం?
       పోటీ పద్దు
 44.    ఇ-అకౌంటింగ్ అంటే?
       ఎలక్ట్రానిక్ అకౌంటింగ్
 45.    వ్యవహారాలను ఏ సూత్రం ఆధారంగా రాస్తారు?
       డెబిట్ క్రెడిట్ సూత్రం
 46.    దీర్ఘకాల ప్రయోజనాన్ని ఇచ్చే వ్యయాన్ని ఏమంటారు?
       పెట్టుబడి వ్యయం
 47.    వాటా విలువలో వాటా దరఖాస్తుపై చెల్లించే మొత్తం ఎంత శాతానికి తక్కువగా ఉండొద్దు?
       5 శాతం
 48.    చిట్టా పద్దు తర్వాత రాసేది?
       క్లుప్త వివరణ
 49.    మూడు వరసల నగదు చిట్టాలో ఉండేవి?
       నగదు, బ్యాంకు, డిస్కౌంట్ వరసలు
 50.    ఎండార్‌‌సమెంట్ పొందిన వ్యక్తి?
       ఎండార్సర్
 51.    వ్యాపార ఆర్థిక స్థితిని తెలిపేది?
       ఆస్తి-అప్పుల పట్టీ
 52.    సర్దుబాటు పద్దులు ఏ సహాయక చిట్టాలో రాస్తారు?
       అసలు చిట్టా
 53.    గుడ్‌విల్ ఏ తరహా ఆస్తి?
       కనిపించని ఆస్తి
 54.    భారత భాగస్వామ్య చట్టం ఏ సంవత్స రంలో అమల్లోకి వచ్చింది?
       1932
 55.    అరువుపై రూ. 500లు సరకు కొంటే ఏ ఖాతాలోకి డెబిట్ అవుతుంది?
       సరకు
 56.    సరకుల అమ్మకం చట్టం దేనికి వర్తిస్తుంది?
       అరువు అమ్మకాలు
 57.    జంట పద్దు విధానం ఒక?
       సంపూర్ణ విధానం
 58.    వ్యాపారేతర కంపెనీలో మూలధనాన్ని ఏమంటారు?
       సంచిత నిధి
 59.    {పతి నియంత్రణ ఖాతాకు ఒక?
       సహాయక ఆవర్జా ఉండాలి
 60.    ఖాతాల సంపుటి అని దేన్ని అంటారు?
       ఆవర్జా
 61.    ఏ రకమైన ఖాతాలకు బ్యాంకు అధిక వడ్డీ ఇస్తుంది?
       ఫిక్స్‌డ్ ఖాతా
 62.    అరువు కొనుగోళ్లను ఏ ఖాతా ద్వారా కనుక్కోవచ్చు?
       రుణదాతల ఖాతా
 63.    నియమావళిలో పేర్కొన్నప్పుడు ముందు గా చేసిన పిలుపుపై వడ్డీ ఎంత?
       6 శాతం
 64.    డిబెంచర్‌పై దేన్ని చెల్లిస్తారు?
       వడ్డీ
 65.    ఒక భాగస్వామి విరమణ వల్ల మిగిలిన వారి వాటా?
       పెరుగుతుంది
 66.    ఆస్తి-అప్పుల పట్టిలో గుడ్‌విల్‌ను ఏ వైపున చూపుతారు?
       ఆస్తుల వైపు
 67.    ఉమ్మడి జీవిత బీమా పాలసీపై ప్రీమియం చెల్లింపును ఎప్పుడు నిలిపివేస్తారు?
       భాగస్వామి మరణం తర్వాత
 68.    తరుగుదలను ఖాతా పుస్తకాల్లో చూపడం వల్ల ఏం జరుగుతుంది?
       లాభం తగ్గుతుంది
 69.    ఏ తరుగుదల పద్ధతిలో ఆస్తి ఖాతా పూర్తిగా రద్దవుతుంది?
       స్థిర వాయిదాల పద్ధతి
 70.    ఆదాయ, వ్యయాల ఖాతాలోని నిల్వ దేన్ని చూపుతుంది?
       మిగులు
 71.    {పామిసరీ నోట్ కాలపరిమితి ఎంత?
       మూడేళ్లు
 72.    తరుగుదలను దేనిపై లెక్కిస్తారు?
       స్థిరాస్తులపై
 73.    మలిపద్దు పుస్తకం అంటే?
       ఆవర్జా
 74.    కౌలుదారుడికి రాయల్టీ అనేది?
       ఖర్చు
 75.    డెల్‌క్రెడరీ కమిషన్ ఇచ్చినప్పుడు రాని బాకీల నష్టాన్ని ఎవరు భరిస్తారు?
       కన్‌సైనీ
 76.    చిట్టాలో ఉండే వరసల సంఖ్య?
       ఐదు
 77.    అన్యాక్రాంత యోగ్య పత్రాల చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
       1881
 78.    కంపెనీ చట్టం ప్రకారం ఆస్తి - అప్పుల పట్టీ ఏ పద్ధతిని అనుసరించి ఉంటుంది?
       జాబితా -2
 79.    సరాసరి గడువు తేదీ అంటే?
 
     ప్రారంభ తేదీ +  గుణిజాల మొత్తం
                          చిచిచిచిచిచిచిచిచి
                             వ్యవహారాల మొత్తం
 80.    మూలధనం ఏ ఖాతాకు చెందింది?
       వ్యక్తిగత ఖాతా
 81.    ఓవర్ డ్రాఫ్ట్ అంటే?
       ప్రతికూల నిల్వ
 82.    క్లెయిమ్ చేయని డివిడెండ్ అంటే ఏమిటి?
       అప్పు
 83.    విలువలేని ఆస్తులను ఏమంటారు?
       {దవ్యత్వ ఆస్తులు
 84.    సహాయక పుస్తకాలకు ఉదాహరణ?
       నగదు పుస్తకం
 85.    వ్యాపారేతర సంస్థలోని మిగులును దేనికి కలుపుతారు?
       మూలధన నిధి
 86.    రాని బాకీలను ఏ నిల్వ చూపుతుంది?
       డెబిట్ నిల్వ
 87.    సర్దుబాటు పద్దులు ఏ సహాయక చిట్టాలో రాస్తారు?
       అసలు చిట్టా
 88.    నమోదిత కంపెనీలు అంటే?
       కంపెనీల చట్టం 1956 కింద నమోదైన కంపెనీలు
 89.    పెట్టుబడులు ఏ తరహా ఖాతా?
       వాస్తవిక ఖాతా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement