అకౌంటింగ్ | accounting | Sakshi
Sakshi News home page

అకౌంటింగ్

Published Tue, Feb 4 2014 11:02 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

అకౌంటింగ్ - Sakshi

అకౌంటింగ్

1.    వ్యాపారంలో వ్యాపారస్థుడు పెట్టిన పెట్టుబడిని ఏమంటారు?
     మూలధనం
 2.    సొంతానికి యజమాని వాడుకునే సరుకు లేదా నగదును ఏమంటారు?
     సొంత వాడకాలు
 3.    వ్యాపార సంస్థ వసూలు చేయలేని మొత్తాలను లేదా రుణాలను ఏమంటారు?
     రాని బాకీలు (మొండి బాకీలు)
 4.    తేదీల ప్రకారం వరుసక్రమంలో అన్ని వ్యవహారాలను నమోదు చేసే పుస్తకాన్ని ఏమంటారు?
     చిట్టా
 5.    తొలిపద్దు పుస్తకాన్ని ఏమంటారు?
     చిట్టా
 6.    అన్ని రకాల ఖాతాలు ఉన్న ముఖ్యమైన పుస్తకాన్ని ఏమంటారు?
     ఆవర్జా
 7.    వ్యాపార వ్యవహారాన్ని చిట్టాలో నమోదు చేయడాన్ని ఏమంటారు?
     చిట్టాపద్దు
 8.    మూలధనం + అప్పులు = ?
     ఆస్తులు
 9.    ఆస్తులు - అప్పులు = ?
     మూలధనం
 10.    జంటపద్దు విధానాన్ని అనుసరించకుండా వ్యాపార వ్యవహారాలను నమోదు చేసే పద్ధతిని ఏమంటారు?
     ఒంటిపద్దు విధానం
 11.    రెండు ఖాతాల్లో వ్యవహారాన్ని నమోదు చేసే పద్ధతిని ఏమంటారు?
     జంటపద్దు విధానం
 12.    {పతి డెబిట్‌కు సరైన మొత్తంలో క్రెడిట్ నమోదు చేయాలనే సిద్ధాంతం ఏ పద్ధతి ప్రకారం అనుసరిస్తారు?
     జంటపద్దు విధానం
 13.    వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు చెందే ఖాతాలను ఏమంటారు?
     వ్యక్తిగత ఖాతాలు
 14.    చెల్లించాల్సిన జీతాలు ఏ తరహా ఖాతాకు చెందుతాయి?
     వ్యక్తిగత ఖాతాలు
 15.    బ్యాంకు ఖాతా ఏ తరహాకు చెందింది?
     వ్యక్తిగత ఖాతా
 16.    గుడ్‌విల్ ఏ తరహా ఖాతాకు చెందింది?
     వాస్తవిక ఖాతా
 17.    సొంత వాడకాలు ఏ తరహా ఖాతాకు చెందినవి?
     వ్యక్తిగత ఖాతా
 18.    వ్యక్తిగత ఖాతాలో ప్రయోజనం పొందే వ్యక్తిని ఏమంటారు?
     డెబిట్ దారుడు
 19.    వ్యక్తిగత ఖాతాలో ప్రయోజనం ఇచ్చే వ్యక్తిని ఏమంటారు?
     క్రెడిట్ దారుడు
 20.    నామమాత్రపు ఖాతాలో క్రెడిట్ నిల్వలు దేన్ని సూచిస్తాయి?
     ఆదాయం లేదా లాభం
 21.    ఖాతాలో డెబిట్, క్రెడిట్ మధ్య తేడాను ఏమంటారు?
     నిల్వ
 22.    నగదు ఖాతా ఎల్లప్పుడూ దేన్ని చూపిస్తుంది?
     డెబిట్ నిల్వను
 23.    ఓవర్ డ్రాఫ్ట్ పద్ధతిలో బ్యాంకు నిల్వ దేన్ని చూపిస్తుంది?
     క్రెడిట్ నిల్వ
 24.    అమ్మకం పుస్తకంలో దేన్ని మాత్రమే నమోదు చేస్తారు?
     అరువు అమ్మకాలను
 25.    బదిలీ పద్దులను నమోదు చేసే పుస్తకాన్ని ఏమంటారు?
     అసలు చిట్టా
 26.    బ్యాంకు ఛార్జీలను పాస్‌బుక్‌లో ఏ వైపు నమోదు చేస్తారు?
     డెబిట్ వైపు
 27.    అకౌంటింగ్ ప్రాథమిక విధి?
     వ్యాపార వ్యవహారాలను విశ్లేషించి, నమోదు చేయడం
 28.    అకౌంటింగ్ ధ్యేయం?
     నమోదు చేసిన వ్యవహారాల ఫలితాలను కనుక్కోవడం
 29.    అకౌంటింగ్ అంటే?
     వ్యవహారాలను నమోదు చేసి, ఫలితాలను సమీక్షించడం
 30.    అకౌంటింగ్ ఏ తరహా వ్యవహారాలను నమోదు చేస్తుంది?
     ఆర్థిక వ్యవహారాలు
 31.    అకౌంటింగ్ వల్ల ఏ రకమైన వ్యక్తులకు సమాచారం లభిస్తుంది?
     యజమానులు, ప్రభుత్వం, రుణదాతలకు
 32.    అకౌంటింగ్ ఒక?
     భాష
 33.    ఆర్థిక నివేదికలు దేనిలో అంతర్భాగాలు?
     అకౌంటింగ్
 34.    నగదు లేదా నగదు సమానమైన అంశాన్ని బదిలీ చేసే వ్యవహారాన్ని ఏమంటారు?
     ఆర్థిక వ్యవహారం
 35.    జంటపద్దు విధానాన్ని కనిపెట్టింది?
     లూకా పాసియులి
 36.    అకౌంటింగ్ మొదటి దశ?
     చిట్టా
 37.    ద్వంద్వరూప భావనను అనుసరిస్తూ వ్యవహారాలను నమోదు చేసే పద్ధతి?
     జంటపద్దు విధానం
 38.    చిట్టా అంటే?
     తొలిపద్దు పుస్తకం
 39.    నగదు ఖాతా అంటే?
     వాస్తవిక ఖాతా
 40.    యజమాని ఖాతా అంటే?
     వ్యక్తిగత ఖాతా
 41.    చిట్టాలో ఆవర్జా పుట సంఖ్యను ఎప్పుడు నింపుతారు?
     చిట్టా నుంచి ఆవర్జాకు వ్యవహారాలను బదిలీ చేసేటప్పుడు
 42.    మలిపద్దు పుస్తకాన్ని ఏమంటారు?
     ఆవర్జా
 43.    వ్యవహారాలను చిట్టా నుంచి ఆవర్జాకు బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు?
     వ్యవహారాలను ఆవర్జాలో నమోదు చేయడం
 44.    ఆవర్జా నమోదు తర్వాత దశ?
     నిల్వ తేల్చడం
 45.    ఆవర్జా అంటే?
     అన్ని ఖాతాలకు సంబంధించిన సంపుటి
 46.    వ్యాపార వ్యవహారాల స్వభావాన్ని బట్టి వివిధ పుస్తకాల్లో నమోదు చేసే చిట్టాలను ఏమంటారు?
     సహాయక చిట్టాలు
 47.    అరువు కొనుగోళ్లను మాత్రమే నమోదు చేసే పుస్తకం?
     కొనుగోళ్ల చిట్టా
 48.    అమ్మకం ధర మీద లేదా ఇన్వాయిస్ మీద ఇచ్చే తగ్గింపును ఏమంటారు?
     వర్తకపు డిస్కౌంట్
 49.    రుణదాత, రుణగ్రస్థునకు ఇచ్చే మినహాయింపును ఏమంటారు?
     నగదు డిస్కౌంట్
 50.    సహాయక చిట్టాను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు?
     8
 51.    కొనుగోలు చేసిన సరుకును సప్లయ్‌దారునకు తిరిగి పంపేటప్పుడు తయారుచేసే నోట్?
     డెబిట్ నోట్
 52.    ఖాతాదారులకు అమ్మిన సరుకు తిరిగి వచ్చినప్పుడు తయారుచేసే నోట్?
     క్రెడిట్ నోట్
 53.    నగదు వ్యవహారాలను మాత్రమే నమోదు చేసే చిట్టాను ఏమంటారు?
     నగదు చిట్టా
 54.    ఎదుటి పద్దులను మాత్రమే నమోదు చేసే చిట్టాను ఏమంటారు?
     మూడు వరుసల నగదు పుస్తకం
 55.    చిల్లర చెల్లింపులను నమోదు చేసే పుస్తకం?
     చిల్లర నగదు పుస్తకం
 56.    సర్దుబాటు పద్దులను నమోదు చేసే పుస్తకం?
     అసలు చిట్టా
 57.    పాస్‌బుక్ డెబిట్ నిల్వ చూపడాన్ని ఏమంటారు?
     ఓవర్ డ్రాఫ్టు
 58.    బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీని ఎవరు తయారుచేస్తారు?
     వర్తకుడు
 59.    బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ ఒక?
     నివేదిక
 60.    వసూళ్ల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉండటాన్ని ఏమంటారు?
     ఓవర్ డ్రాఫ్టు
 61.    అంకణా ఒక?
     నివేదిక
 62.    అంకణా తయారుచేసే ఉద్దేశం?
     అంకగణిత కచ్చితత్వం తెలుసుకోవడానికి
 63.    అంకణాలో ఉన్న తేడాను ఏ ఖాతాకు బదిలీ చేస్తారు?
     అనామతు ఖాతా
 64.    అంకణా తయారుచేయడానికి తోడ్పడేవి?
     ముగింపు లెక్కలు
 65.    ఆస్తులను అంకణాలో ఏ వైపున చూపిస్తారు?
     డెబిట్
 66.    గణకశాస్త్ర సూత్రాలకు విరుద్ధంగా వ్యవహారాలను నమోదు చేయడం?
     సిద్ధాంతపరమైన తప్పులు
 67.    రాబడి వ్యయాన్ని మూలధన వ్యయంగా నమోదు చేసే తప్పును ఏ రకమైన తప్పుగా భావిస్తారు?
     సిద్ధాంతపరమైన తప్పు
 68.    యంత్రంపై మరమ్మతులను, యంత్రం ఖాతాకు డెబిట్ చేయడాన్ని ఏ రకమైన తప్పుగా పరిగణిస్తారు?
     సిద్ధాంతపరమైన తప్పు
 69.    గణక సిబ్బంది చేసే తప్పులను ఏమంటారు?
     రాత పూర్వకమైన తప్పులు
 70.    ఫర్నీచర్ కొనుగోలు - ఫర్నీచర్ ఖాతాకు బదులుగా కొనుగోలు ఖాతాకు డెబిట్ చేయడం?
     సిద్ధాంతపరమైన తప్పు
 71.    రాము ఖాతాలో * 500 క్రెడిట్ వైపు తక్కువగా, గోపీ ఖాతాలో * 500 డెబిట్ వైపు తక్కువగా రాసే తప్పు?
     సరిపెట్టే తప్పు
 72.    రాబడి వ్యయాలను దేనిలో నమోదు చేస్తారు?
     వర్తకపు లాభనష్టాల ఖాతాలో
 73.    మూలధన వ్యయాలను దేనిలో నమోదు చేస్తారు?
     ఆస్తి అప్పుల పట్టీ
 74.    నికర లాభం లేదా నికర నష్టాన్ని ఏ ఖాతాకు బదిలీ చేస్తారు?
     మూలధన ఖాతా
 75.    సంస్థ ఆర్థిక పరిస్థితిని తెలియజేసే నివేదికను ఏమంటారు?
     ఆస్తి అప్పుల పట్టీ
 76.    వ్యయాలపై ఆదాయాల మిగులును ఏమంటారు?
     నికర లాభం
 77.    కన్పించే, కన్పించని ఆస్తులకు సంబంధించిన ఖాతాలు?
     వాస్తవిక ఖాతాలు
 78.    వర్తకపు సంస్థ స్థూల లాభం లేదా స్థూల నష్టం తెలుసుకోవడానికి తయారుచేసే ఖాతా?
     వర్తకపు ఖాతా
 79.    ఆస్తుల నాణ్యత, విలువను కోల్పోవడాన్ని ఏమంటారు?
     తరుగుదల
 80.    ఏటా తరుగుదల సమానంగా ఏర్పాటు చేసే పద్ధతి?
     స్థిర వాయిదాల పద్ధతి
 81.    తగ్గింపు అయిన నిల్వపై తరుగుదలను లెక్కించే పద్ధతి?
     తగ్గుతున్న నిల్వల పద్ధతి
 82.    ఆస్తి జీవితకాలం తర్వాత మిగిలిన విలువను ఏమంటారు?
     అవశేషపు విలువ
 83.    ఆస్తి పునఃస్థాపనకు ఏర్పాటు చేసే నిధి?
     తరుగుదల నిధి
 84.    ఆస్తి అమ్మగా వచ్చిన నష్టాన్ని ఏ ఖాతాకు బదిలీ చేస్తారు?
      లాభనష్టాల ఖాతా
 85.    ఆస్తి అమ్మగా వచ్చిన మొత్తాన్ని ఏ ఖాతాకు క్రెడిట్ చేస్తారు?
      ఆస్తి ఖాతాకు
 86.    విడి పరికరాలకు ఏ రకమైన తరుగుదల పద్ధతిని అమలు చేస్తారు?
      పునర్ మూల్యాంకన పద్ధతి
 87.    వాహనాలకు ఏ విధమైన తరుగుదల పద్ధతి అవలంబిస్తారు?
      తగ్గుతున్న నిల్వల పద్ధతి
 88.    కన్‌సైన్‌మెంట్ అంటే?
      సరుకులను ఏజెంట్ల ద్వారా అమ్మడం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement