ఆదాయం లెక్కింపు - కొత్త స్టాండర్డ్స్ | Computation of income - New Standards | Sakshi
Sakshi News home page

ఆదాయం లెక్కింపు - కొత్త స్టాండర్డ్స్

Published Mon, Feb 29 2016 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

ఆదాయం లెక్కింపు - కొత్త స్టాండర్డ్స్

ఆదాయం లెక్కింపు - కొత్త స్టాండర్డ్స్

అంతర్జాతీయంగా వ్యాపార/వాణిజ్య సంబంధిత లావాదేవీలను ఎలా లెక్కించాలి? లెక్కించిన వాటి ని స్టేట్‌మెంట్లలో ఎలా చూపించాలి... అనే విషయంలో గత 40 సంవత్సరాలుగా కూలంకషంగా చ ర్చలు జరుగుతున్నాయి. వీటిల్లో అకౌంటింగ్ సంస్థలూ కలిశాయి. చివరకు అంతర్జాతీయ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అమల్లోకి వచ్చాయి.  ఈ నేపథ్యంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కూడా  2010 నుంచి భారీస్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది. వారు స్వయంగా స్టాండర్డ్స్‌ని తయారుచేసి పదింటిని విడుదల చేశారు. ఇవి 01.04.2015 నుంచి అమల్లోకి వచ్చాయి. వేతన జీవులకు, ఇంటిపై ఆదాయం వచ్చేవారికి, మూలధన లాభాలకు వర్తించవు.

ఈ మూడింట్లో అకౌంటింగ్‌కు సంబంధించిన అంశాలు లేవు కనక. ఏైవైనా అంశాల్లో భేదాభిప్రాయాలు వస్తే చట్టంలోని అంశాలే చెల్లుతాయి. వీటి ముఖ్యోద్దేశం ఆదాయం పన్ను లెక్కించడానికి సంబంధించిన వివాదాలు తగ్గించడమే. ట్యాక్స్ అడిట్ ఉన్నా లేకున్నా, టర్నోవర్‌తో నిమిత్తం లేకుండా అందరికీ వర్తిస్తాయి. ఇవి అమలు చేయకపోతే డిపార్ట్‌మెంట్ వారు బెస్ట్ జడ్జ్‌మెంట్  ప్రాతిపదికన అసెస్‌మెంట్‌ను పూర్తిచేస్తారు.
 
కొత్త స్టాండర్డ్స్- వివరాలు
ఐసీడీఎస్    1    అకౌంటింగ్ పాలసీలు
ఐసీడీఎస్    2    ఇన్వెంటరీ వాల్యుయేషన్
ఐసీడీఎస్    3    కన్ స్ట్రక్షన్ కాంట్రాక్టులు
ఐసీడీఎస్    4    ఆదాయాన్ని నిర్మించటం
ఐసీడీఎస్    5    స్థిరాస్తులు
ఐసీడీఎస్    6    విదేశీ మారకం రేట్లు..మార్పు
ఐసీడీఎస్    7    ప్రభుత్వపు గ్రాంట్లు
ఐసీడీఎస్    8    సెక్యూరిటీలు
ఐసీడీఎస్    9    రుణాల మీద వడ్డీ, ఖర్చులు

ఐసీడీఎస్    10    ప్రొవిజన్లు, కంటింజెంట్ అప్పులు/ఆస్తులు
 
ఈ విషయాలు గుర్తుంచుకోండి
కొత్త స్టాండర్డ్స్‌లో కొన్ని పదాలు కావాలని తొలగించారు. దీంతో అసెస్సీలకు నష్టం, కష్టం.
ఊహించని నష్టాలను లెక్కలోకి వేయండ ని సర్వత్రా వినిపిస్తుంటే.. ఆ ప్రస్తావనే లేదు.
ఇన్వెంటరీ వాల్యుయేషన్‌లో ఎన్నో ఇబ్బందులున్నాయి.
ఆదాయాన్ని త్వరగా గుర్తించేలా, ఖర్చుని ఆలస్యంగా గుర్తించే లా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు ఇవి విరుద్ధం.
చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా స్థిరాస్తులకు సంబంధించి రికార్డులు రాయాలి.
మార్పులను, కొత్త పోకడలను పరిగణనలోకి తీసుకోలేదు.
కంపెనీలు ఎన్నో విషయాల్లో సీఏ సంస్థ ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించేవి. ఇప్పుడు ఆ అవసరం లేదు.
అటు డిపార్ట్‌మెంట్ వారు, ఇటు అసెస్సీ ఈ విషయాల్లో
 జాగ్రత్త వహించాలి.
 
ట్యాక్సేషన్ నిపుణులు
కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి , కె.వి.ఎన్ లావణ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement