దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్‌ఝన్ వాలా ఏవియేషన్ రంగంలో అడుగపెట్టారు. తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఝున్‌ఝన్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు.
ఈ సేవల్ని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఆకాశ ఎయిర్ తొలి విమానం ముంబైలో టేకాఫ్ అవ్వగా.. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ విమానం ప్రయాణించింది.
ఈ విమానయాన సంస్థ అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి ప్రాంతాలలో తొలుత తన సర్వీసులను అందజేస్తుంది. ముంబై నుంచి అహ్మదాబాద్‌కి 28 వీక్లి ఫ్లయిట్స్‌ను నడపనుంది. ఈ సందర్భంగా తమ కస్టమర్లకు సరికొత్త విమానయాన అనుభవాన్ని అందించేందుకు తాము మరింత ముందుకు వెళ్లనున్నామని, తమ సర్వీసులు కస్టమర్లకు నచ్చుతాయని భావిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వినయ్ దుబే అన్నారు .
Comments
Please login to add a commentAdd a comment