Rakesh jhunjhunvala
-
ఝున్‌ఝున్‌వాలా లేని ఆకాశ ఎయిర్‌లైన్ పరిస్థితి ఏంటి?
సాక్షి,ముంబై: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అకాలమరణంతో ఇటీవలే సేవలను ప్రారంభించిన సరికొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్ భవితవ్యం ఏంటి? ప్రణాళికలు ఏంటి? సంస్థ నిర్వహణ ఎలా ఉండబోతోంది అనే సందేహాలు బిజినెస్ వర్గాల్లో నెలకొన్నాయి. ఝున్‌ఝున్‌వాలా రెక్కల కింద ఎదగాలని, రాణించాలని ఎదురు చూసిన ఆకాశ ఎయిర్‌కి ఆయన ఆకస్మిక మరణం షాక్‌నిచ్చింది. (ఝున్‌ఝున్‌వాలా అస్తమయంపై స్మృతి ఇరానీ ఏమన్నారంటే) ముఖ్యంగా భారతదేశంలో, బిలియనీర్ యాజమాన్యంలోని విమానయాన సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, సుబ్రతా రాయ్ సహారాకు చెందిన సహారా ఎయిర్‌లైన్స్ కథ ఇదే. ఈ కారణంగానే విశ్లేషకులు ఆకాశ ఎయిర్ కార్యకలాపాలను ప్రారంభించకముందే దాని భవిష్యత్తుపై, సందేహాలను, భయాలను వ్యక్తం చేశారు. ఇపుడు ఆయన హఠాన్మరణంతో ఈ భయాలు మరింత పెరిగాయి. (రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?) అయితే ఆకాశ సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ ఝున్‌ఝున్‌వాలా వారసత్వాన్ని, విలువను ముందుకు తీసుకెడతామని, మంచి విలువలతో గొప్ప విమానయాన సంస్థగా నడపడానికి కృషి చేస్తామని దూబే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా తనపై విశ్వాసముంచిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆకాశకు ఝున్‌ఝున్‌వాలా చాలా కీలకం. ముఖ్యమైన పెట్టుబడిదారుడిగా మాత్రమే కాకుండా ఆయనకున్న అపారమైన పలుకుబడితో బ్యాంకులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుండి చౌకగా ఫైనాన్సింగ్ ఏర్పాటు చేయగల సత్తా ఉన్నవారు. అలాంటి ఆయన మరణంతో కొంత ఒత్తిడి తప్పదని సీనియర్ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. ఆయన మరణం కంపెనీ వృద్ధికి, ఆశయ సాధనకు తాత్కాలిక బ్రేక్స్ ఇస్తుందని, పెట్టుబడిదారులు కూడా జాగ్రత్తగా ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే దేశ విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే గ్లోబల్ఎయిర్లైన్స్తో ఆకాశ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని మరికొంతమంది మార్కెట్ నిపుణుల అంచనా. ఝున్‌ఝున్‌వాలా ఎయిర్ లైన్స్ సంస్థ ఎల్సిసిలో 40 శాతానికి పైగా వాటా 3.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 264 కోట్లు) పెట్టుబడులు పెట్టాడు. ఇది ఆయన చివరి ప్రధాన పెట్టుబడులలో ఒకటి మాత్రమే కాదు, ఆయనకు అత్యంత ఇష్టమైనది కూడా. ఆకాశ మొదటి విమానంలోని ప్రయాణీకులతో తీసుకున్న సెల్పీలు తీపి జ్ఞాపకాలుగా మిగిలి పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ పేరొందిన ఝున్‌ఝున్‌వాలా చివరిసారిగా ఆగస్ట్ 7న ముంబై -అహ్మదాబాద్ మధ్య జరిగిన ఆకాశ ఎయిర్ తొలి విమాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించారు. వీల్‌చైర్‌లో తిరుగుతూ అందరిన్నీ ఉత్సాహపరుస్తూ జోక్స్ వేస్తూ పోటీదారులతో ముచ్చటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకుల సౌకర్యాల్లోగానీ, ఉత్పత్తి నాణ్యతలో ఎలాంటి రాజీలేకుండా పొదుపుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆకాశ యాజమాన్యం , సిబ్బందికి పిలుపునిచ్చారు. ఆకాశ కోసం ఝున్‌ఝున్‌వాలా ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టి ఇండిగో లాంటి సంస్థల్ని భయపెట్టిన ఝున్‌ఝున్‌వాలా సంస్థ భవిష్యత్తు కోసం భారీ ప్రణాళికలే వేశారు విస్తృతమైన పెట్టుబడితో పాటు, ఎయిర్‌లైన్ నిర్వహణ కోసం అగ్రశ్రేణి విమానయాన పరిశ్రమ లీడర్లను ఎంచుకున్నారు. ప్రపంచంలో బహుశా ఏ విమానయాన సంస్థ ఏర్పాటైన 12 నెలల్లో సేవలు ప్రారంభించ లేదు. కానీ ఝున్‌ఝున్‌వాలా ఆ ఘనతను సాధించారు. ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ సీఈఓగా పనిచేసిన దుబెనే సీఈవోగా ఎంపిక చేశారు. విమానయాన సంస్థలో దుబేకు 31 శాతం వాటా ఉంది. అలాగే 2018 వరకు ఇండిగో డైరెక్టర్‌గా ఒక దశాబ్దం పాటు పనిచేసిన ఆదిత్య ఘోష్‌ను కూడా తన టీంలో చేర్చుకున్నారు. ఘోష్ ఎయిర్‌లైన్‌లో 10 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఝున్‌ఝున్‌వాలా చరిష్మా సలహాలు, ఫండ్ పుల్లింగ్ సామర్థ్యాలు ఆకాశకు ఇకపై అందుబాటులో లేనప్పటికీ, ఆకాశ అభివృద్ధి చెందుతుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని అన్నారు. ఆ మేరకు ఆయన సంస్థను కట్టుదిట్టం చేశారన్నారు. ఇండియా జనాభా, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఏవియేషన్ పరిశ్రమ వృద్ధిపై ఆయన విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక ఆకాశ ఎయిర్ అని అన్నారు. అక్టోబర్ 11న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ప్రమోటర్‌గా ఉన్న 'ఆకాశ ఎయిర్' అల్ట్రా-లో కాస్ట్ విమాన సేవలు ప్రారంభించేందుకు పౌర విమానయాన శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు లభించాయి. జులై 7న సేవలు ప్రారంభించేందుకు 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్' నుంచి 'ఆపరేటర్ సర్టిఫికేట్' పొందింది. ఆకాశ ఎయిర్ ఆగస్టు 7న తొలి సర్వీసును నడిపింది. ఈ క్రమంలోనే ఆగస్టు 13న బెంగళూరు-కొచ్చి, ఆగస్టు19న బెంగళూరు-ముంబై,సెప్టెంబరు 15న చెన్నై-ముంబైకు తన విమాన సేవల్ని అందించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. -
రాకేష్ ఝున్ ఝున్ వాలా..'ఆకాశ ఎయిర్' సేవలు షురూ!
దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్‌ఝన్ వాలా ఏవియేషన్ రంగంలో అడుగపెట్టారు. తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఝున్‌ఝన్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవల్ని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఆకాశ ఎయిర్ తొలి విమానం ముంబైలో టేకాఫ్ అవ్వగా.. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ విమానం ప్రయాణించింది. ఈ విమానయాన సంస్థ అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి ప్రాంతాలలో తొలుత తన సర్వీసులను అందజేస్తుంది. ముంబై నుంచి అహ్మదాబాద్‌కి 28 వీక్లి ఫ్లయిట్స్‌ను నడపనుంది. ఈ సందర్భంగా తమ కస్టమర్లకు సరికొత్త విమానయాన అనుభవాన్ని అందించేందుకు తాము మరింత ముందుకు వెళ్లనున్నామని, తమ సర్వీసులు కస్టమర్లకు నచ్చుతాయని భావిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వినయ్ దుబే అన్నారు . -
నిఫ్టీ డౌన్, 25లక్షల షేర్లను అమ్మేసిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా!
ముంబై: ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు రెండోరోజూ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 185 పాయింట్లు పతనమై 55,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 16,523 వద్ద నిలిచింది. జీడీపీతో సహా కీలక స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించకపోవడం, క్రూడాయిల్ ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగడం, ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. స్టాక్ సూచీలు జూన్ తొలి ట్రేడింగ్ సెషన్‌ను స్వల్ప నష్టాలతో ప్రారంభించాయి. ఇంట్రాడేలో 700 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ 55,091 వద్ద కనిష్టాన్ని, 55,791 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 210 పాయింట్ల శ్రేణిలో 16,439 – 16,649 పరిధిలో ట్రేడైంది. చివరి గంటలో బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు నష్టాలు కొంతమేర తగ్గాయి. చిన్న తరహా షేర్లలో ఎక్కువగా విక్రయాలు తలెత్తడంతో బీఎస్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆరశాతానికి పైగా నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,930 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.984 కోట్ల షేర్లు కొన్నారు. ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీరేట్ల పెంపు ఆందోళనలు వీడకపోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి జీవితకాల కనిష్టస్థాయి నుంచి 20 పైసలు రికవరీ అయ్యి 77.51 స్థాయి వద్ద స్థిరపడింది. లిస్టింగ్ లాభాలన్నీ మాయం లిస్టింగ్ లాభాల్ని నిలుపుకోవడంలో ఈ–ముద్ర షేరు విఫలమైంది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.256)తో పోలిస్తే ఆరుశాతం ప్రీమియంతో రూ.271 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 9% ఎగిసి రూ.279 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్ నుంచి లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో లిస్టింగ్ లాభాలన్నీ మాయమయ్యాయి. చివరికి ఒకశాతం స్వల్ప లాభంతో రూ.259 వద్ద స్థిరపడింది. మొత్తం 5.54 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,020 కోట్లుగా నమోదైంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ►ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తన మొత్తం వాటా(7.1%)లో ఒకశాతం వాటా(25 లక్షల షేర్లు)ను విక్రయించడంతో డెల్టా కార్పొరేషన్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.212 వద్ద స్థిరపడింది. ఒక దశలో 7% క్షీణించి రూ.202 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ►బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించడంతో హెచ్డీఎఫ్సీ షేరు ఒకశాతం లాభపడి రూ.2,329 వద్ద నిలిచింది. ►గోవా ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని విక్రయించడంతో జువారీ ఆగ్రో షేరు ఏడుశాతం బలపడి రూ.148.25 వద్ద ముగిసింది. -
ఆకాశ..ఇక మరింత ఆలస్యం
మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాల ప్లాన్స్‌కి చివరి నిమిషంలో అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఆకాశ ఎయిర్‌లైన్స్ సర్వీసెస్‌ను 2022 మేలో ప్రారంభించాలని ముందుగా బిగ్బుల్ నిర్ణయించుకున్నారు. అయితే కీలకమైన బోయింగ్ విమానం 737 ఎయిర్‌క్రాఫ్ట్ రావడం ఆలస్యం అయ్యింది. దీంతో ఎయిర్‌లైన్స్ సేవలను ముందుగా అనుకున్నట్టుగా మేలో కాకుండా జులైలో ప్రారంభించనున్నారు. ఎయిర్‌లైన్స్ సేవలకు సంబంధించి ఆకాశ సీఈవో వినయ్ దుబే మాట్లాడుతూ.. ఆకాశ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన తొలి విమానం 2022 జూన్‌లో గాలిలోకి లేస్తుంది. ఇక కమర్షియల్ ఫ్లైట్స్ జులై నుంచి అందుబాటులోకి వస్తాయంటూ ప్రకటించారు. బోయింగ్ విమానం విషయంలో కొంత ఆలస్యమైన మిగిలిన 18 ఎయిర్ క్రాఫ్ట్స్ సకాలంలో వస్తాయంటూ దుబే ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..! -
స్టార్ హెల్త్ ఐపీవో.. ఫ్లాప్!
న్యూఢిల్లీ: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఐపీవో ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయింది. ఆఫర్ చేస్తున్న షేర్లకు సరిపడా బిడ్లు కూడా దాఖలు కాలేదు. గురువారం ఇష్యూ ముగియగా 0.79 శాతం మేర సబ్స్క్రయిబ్ అయింది. ఈ సంస్థలో వెస్ట్బ్రిడ్స్ క్యాపిటల్, రాకేశ్ జున్‌జున్‌వాలా తదితరులకు వాటాలున్నాయి. మొత్తం 4,49,08,947 షేర్లను కంపెనీ విక్రయానికి పెట్టగా.. 3,56,02,544 షేర్లకే బిడ్లు వచ్చాయి. రిటైల్ విభాగంలో మాత్రం పూర్తి స్థాయి బిడ్లను అందుకుంది. ఆఫర్ చేస్తున్న షేర్లతో పోలిస్తే 1.10 రెట్ల సబ్స్క్రిప్షన్లు వచ్చాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల (క్యూఐబీ) కోటా కూడా 1.03 రెట్ల స్పందన అందుకుంది. కానీ, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (పెద్ద ఇన్వెస్టర్లు) పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఒక్కో షేరు ధరల శ్రేణిగా రూ.870–900ను కంపెనీ ప్రకటించడం గమనార్హం. ఖరీదైన వ్యాల్యూషన్లతో కంపెనీ ఐపీవోకు రావడం కూడా పేలవ ప్రదర్శనకు కారణంగా భావిస్తున్నారు. -
వాట్ ఏ టెర్రిఫిక్ స్టోరీ - మంత్రి కేటీఆర్
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన ఫాల్గుని నాయర్‌ని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ప్రశంసించారు. ఫాల్గుని నాయర్ కెరీర్ ఎదుగుదలను వివరిస్తూ ప్రచురితమైన కథనాన్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ వాట్ ఏ టెర్రిఫిక్ స్టోరీ అంటూ కేటీఆర్ ప్రశంసించారు. దేశంలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు మీరే ఆదర్శనమంటూ పేర్కొన్నారు. దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం విమెన్ ఎంట్రప్యూనర్షిప్ హబ్‌ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. What a terrific story #FalguniNayar 👏 Inspiration to many young women entrepreneurs @WEHubHyderabad India’s only women entrepreneurship Hub launched by Govt of #Telangana https://t.co/IYtPSSxyHg — KTR (@KTRTRS) November 10, 2021 అత్యంత సంపన్నురాలు ఫాల్గని నాయర్ నేతృత్వంలో నడుస్తున్న బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ నైకా ఇటీవల స్టాక్ ఎక్సేంజీలో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్‌కి వచ్చింది. ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఆమె సంపద విలువ 53.50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న స్వీయ-నిర్మిత మహిళా బిలియనీర్‌గా నిలిచారు. ప్రభావం చూపిన ఇంటర్వ్యూ స్టాక్ మార్కెట్లో ఏస్ బిగ్బుల్ రాకేశ్ఝున్ఝున్వాలాని ఇటీవల సినీటి శ్రద్ధ కపూర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా షేర్ మార్కెట్ టిప్స్ చెప్పాలంటూ బిగ్‌బుల్‌ని అడిగారు. అంతేకాదు తాను త్వరలో ఐపీవోకి రాబోతున్న బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నట్టు వెల్లడించారు. తన నిర్ణయం సరైందో కాదో చెప్పాలంటూ బిగ్‌బుల్‌ని కోరారు. సౌందర్య ఉత్పత్తలుకు ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉందని, అయితే బ్యూటీ ప్రొడక్టుల ధరలు తగ్గిస్తే మరింత మార్కెట్‌కి ఆకాశమే హద్దంటూ రాకేశ్ వివరించారు. బ్యూటీ కంపెనీలో షేర్లు తీసుకోవాలనే నిర్ణయం మంచిదేనంటూ రాకేశ్ సూచించారు. ఇంటర్వ్యూ ప్రచురితమైన కొద్ది రోజులకే మైకా సంస్థ ఐపీవోకి వచ్చింది. బిగ్బుల్ మాటల ప్రభావం షేర్ వ్యాల్యూపై కనిపించింది. చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్ -
Rakesh JhunJhunwala:ఇదేం మ్యాజిక్! ఒక్క సెకనుకి రూ.1.68 కోట్ల సంపాదన
Rakesh Jhunjhunwala Made Rs 101 Crore From These 5 Stocks: మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరోసారి సంచలనం సృష్టించారు. ఊహకి అందని రీతిలో మార్కెట్లో ఎత్తులు వేస్తూ కాసుల వర్షం కురిపించే బిగ్బుల్ జాదూ మళ్లీ వర్కవుట్ అయ్యింది. ముహూరత్ ట్రేడింగ్ దీపావళి పండగ సందర్భంగా స్టాక్ మార్కెట్లో ప్రతీ ఏడు ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. రెగ్యులర్ ట్రేడింగ్‌కి భిన్నంగా దీనికి ప్రత్యేకంగా సమయం కేటాయించి గంట పాటు లావాదేవీలు నిర్వహిస్తారు. ఈసారి కూడా దీపావళి రోజున కొత్త సంవత్ 2078కి స్వాగతం పలుకుతూ సాయంత్రం 6:15 గంటల నుంచి రాత్రి 7:15 గంటల వరకు ముహూరత్ ట్రేడ్ నిర్వహించారు. గంటలో రూ.101 కోట్లు ముహూరత్ ట్రేడింగ్‌లో బిగ్బుల్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీల షేర్లు బాగా లాభపడ్డాయి. దీంతో కేవలం గంట వ్యవధిలోనే ఆయన సంపాదనలో కొత్తగా రూ. 101 కోట్లు వచ్చి చేరాయి. ఓ రకంగా ప్రతీ సెకనుకి బిగ్బుల్ ఖాతాలో రూ.1.68 కోట్లు వచ్చి పడ్డట్టయ్యింది. కాసులు కురిపించిన హోటల్ షేర్లు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఉన్న వాటిలో ఇండియన్ హోటల్ కంపెనీ షేర్లు గంట వ్యవధిలో ఆరు శాతం వృద్ధిని కనబరిచాయి. కేవలం గంట వ్యవధిలో షేరు విలువ రూ.205 నుంచి రూ.215కి చేరుకుంది. కేవలం పది రూపాయలు షేరు ధర పెరగడంతో రాకేశ్ ఖాతాలో రూ.31.13 కోట్లు వచ్చి చేరాయి. ఆ నాలుగు - టాటా మోటార్స్‌లో బిగ్బుల్కి 3.67 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి ధర 1 శాతం పెరగడంతో గంట వ్యవధిలో రూ.17.82 కోట్ల ఆదాయం వచ్చి పడింది. - రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ షేర్ల ధరలో 2 శాతం వృద్ధి కనిపించడంతో రాకేశ్ ఖాతాలో 21.72 కోట్లు వచ్చాయి. - ఎస్కార్ట్ షేర్ల ధరలు పెరగడంతో రూ. 18.11 కోట్లు, డెల్టా కార్పొరేషన్ నుంచి రూ.12.6 కోట్లు ఆర్జించారు. సెంటిమెంట్ అండతో ముహూరత్ ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి జరుగుతుందనే సెంటిమెంట్ ఉంది. బాంబే స్టాక్ ఎక్సేంజీలో 1957 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కొత్తగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు కూడా ఈ రోజు మొదలు పెడతారు. ఇలాంటి వారిలో చాలా మంది బిగ్బుల్ రాకేశ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న షేర్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఆయా కంపెనీల షేర్ల బాగా పెరిగాయి. ఫలితంగా కేవలం గంటలో రాకేశ్ సంపాదన రూ. 101 కోట్లు పెరిగింది. -
బుల్ రన్ తొలి దశలో: జున్‌జున్‌వాలా
దేశీయంగా స్టాక్ మార్కెట్లు అతిపెద్ద బుల్ రన్ ప్రారంభ దశలో ఉన్నట్లు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా పేర్కొంటున్నారు. కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ను పూర్తిగా ఎత్తివేశాక కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై రాకేష్ అభిప్రాయాలను చూద్దాం.. టెస్ట్ మ్యాచ్ బుల్ మార్కెట్ అంటే క్రికెట్లో టెస్ట్ మ్యాచ్వంటిదని చెప్పవచ్చు. ఇది 50 ఓవర్లలో ముగిసే గేమ్ కాదు. అయితే బుల్ ట్రెండ్ మొదలయ్యేముందు మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోవడం సాధారణం. కొత్తగా మొదలయ్యే ప్రతీ బుల్ మార్కెట్ గతంలో నమోదైన బుల్ ట్రెండ్కంటే ప్రభావవంతంగా ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభణతో మార్చిలో వెల్లువెత్తిన భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో ఇక్కడినుంచి దేశీ మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యే వీలుంది. పరిస్థితులు వేగంగా సాధారణ స్థితికి చేరుకోనున్న సంకేతాలను ఇటీవల మార్కెట్లలో కనిపిస్తున్న ర్యాలీ ప్రతిబింబిస్తోంది. లాక్‌డవున్‌ను పూర్తిగా ఎత్తివేశాక ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా వ్యయప్రణాళికలు అమలు చేసే అవకాశముంది. రిస్క్ తక్కువే ప్రస్తుత స్థాయిల నుంచి మార్కెట్లు భారీగా పతనంకాకపోవచ్చు. ఇప్పటికే ప్రారంభమై బుల్ మార్కెట్ నేపథ్యంలో కంపెనీల ఈపీఎస్‌లు, పీఈ రేషియోలు విస్తరించే వీలుంది. గత మూడు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లూ సమస్యలు ఎదుర్కొన్నాయి. అనవసర భయాల కారణంగా కోవిడ్-19 సంక్షోభం అధికమైనట్లు తోస్తోంది. ఇది ఒక ఫ్లూ వ్యాధి మాత్రమే. ప్లేగు లేదా క్యాన్సర్కాదు. దీర్ఘకాలంలో కోవిడ్-19 కారణంగా పెను మార్పులు కనిపించకపోవచ్చు. ప్రజలు తిరిగి ప్రయాణాలు చేయడం, రెస్టారెంట్లను సందర్శించడంవంటివి చేపడతారని చెప్పవచ్చు. కోవిడ్-19 కారణంగా ఏర్పడిన నష్టాలపై ఒక అవగాహనకు రావడం ద్వారా ప్రభుత్వం తదుపరి దశలో తగిన చర్యలు చేపట్టే వీలుంది. కోవిడ్-19 సవాళ్ల తదుపరి పలు కంపెనీలు యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. కొన్ని కంపెనీలు వేగవంత వృద్ధిని అందుకోవచ్చు. మరికొన్ని కంపెనీలు సవాళ్లను అధిగమించడంలో మరికొంత శ్రమించవలసిరావచ్చు. అనిశ్చితి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇటీవల బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు తలెత్తాయి. డిసెంబర్ తదుపరి మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల(ఎన్పీఏలు) సమస్యల వివరాలు వెల్లడయ్యే వీలుంది. దీంతో ఫైనాన్షియల్ రంగ కౌంటర్లు అంతంత మాత్ర పనితీరునే చూపవచ్చు. ఎన్బీఎఫ్సీ రంగంలో కన్సాలిడేషన్‌కు దారి ఏర్పడవచ్చు. అయితే హౌసింగ్ రంగానికి భారీ సమస్యలు ఎదురుకాకపోవచ్చని అంచనా. పలు సంస్థలు దివాళా బాట పట్టడం ద్వారా ఫైనాన్షియల్ రంగంలో సమస్యలు పెరగనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. నిజానికి ఇతర సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ కస్టమర్లు అతితక్కువగా రుణ చెల్లింపుల వాయిదాల మారటోరియంవైపు మొగ్గు చూపడం గమనించదగ్గ అంశం! -
ఒక్క నెలలోనే యస్ బ్యాంకు రికార్డు లాభం
సాక్షి, ముంబై : వరుస వివాదాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రయివేటు బ్యాంకు యస్ బ్యాంకు రికార్డు స్తాయి లాభాలతో దూసుకుపోతోంది. రుణాల సేకరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి రానుండటంతో పాటు, రాకేష్ ఝన్‌ఝన్ వాలా షేర్ల కొనుగోలు పరిణామాల నేపథ్యంలో యస్ బ్యాంక్ షేర్లు ఒక నెలలో 78 శాతానికిపైగా పుంజుకున్నాయి. దీంతో ఒక బిలియన్ డాలర్లకు పైగా ఎక్కువ విలువైన కంపెనీల వరుసలో చేరింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లాభంగా నిలవడం విశేషం. గత ఏడాదిలో 68 శాతం కోల్పోగా, ఈ సంవత్సరం ప్రారంభంనుంచి 61శాతం పడిపోయి, సెప్టెంబర్ 2019 చివరలో, వ్యవస్థాపకుడు రానా కపూర్, ఇతర ప్రమోటర్ల వాటాల విక్రయంతో 2019లో అతిచెత్త ప్రదర్శన కనబర్చిన కంపెనీగా దిగజారిపోయింది. అయితే ఇటీవల నిధుల సేకరణకు బ్యాంకు యాజమాన్యం ప్రయత్నాలుముమ్మరంలో చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి తోడు ప్రముఖ పెట్టుబడిదారుడు నవంబరు 5వ తేదీన రాకేష్ ఝన్ ఝన్‌వాలా రూ. 87కోట్ల విలువైన 1.3 కోట్ల షేర్లను కొనుగోలు చేయడం మరింత సానుకూలంగా మారింది. దీంతో వరుస సెషన్లుగా లాభపడుతూ వచ్చిన యస్ బ్యాంకు షేరు సోమవారం నాటి ట్రేడింగ్‌లో మరో 5 శాతం ఎగిసి రూ.72.90వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 71.35 గరిష్టాన్ని తాకింది. అక్టోబర్ 1 న, యస్ బ్యాంక్ షేర్ ధర 23 శాతానికి పైగా పడిపోయి రూ. 29 వద్ద 52 వారాల కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. -
ఫిర్ ఏక్‌బార్ మోదీ సర్కార్ : రాకేష్ ప్రశంసలు
సాక్షి, ముంబై : కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్వంలో మళ్లీ రెండోసారి సర్కార్ కొలువు దీరనున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్, నిప్టీ అల్ టైం రికార్డు స్థాయిలను తాకాయి. తొలిసారిగా సెన్సెక్స్ 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 12,000 పాయింట్ల కీలక మార్క్‌ను దాటేసింది. వెరసి మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 289 పాయింట్ల లాభాలకు పరిమితమై 39,405, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 11829 వద్ద ట్రేడవుతోంది. అత్యధిక స్థాయిల్లో ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ అమ్మకాలకు క్యూకట్టడంతో స్టాక్ మార్కెట్ హైనుంచి వెనక్కి తగ్గింది. మరోవైపు మార్కెట్ గురు, పెట్టుబడిదారుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కేంద్రంలో బీజేపీ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆశ్రిత పెట్టుబడి విధానానికి (క్రోనీ క్యాపిటలిజం) మరణ శాసనమనీ, ఈజ్ ఆఫ్ బిజినెస్‌కు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, మోదీ నేతృత్వంలో దేశ ఆర్థిక రంగం మరింత వృద్దిని సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
మార్కెట్ అక్కడక్కడే...
స్వల్ప లాభాల్లో స్టాక్ సూచీలు ♦ వరుసగా ఐదో రోజూ పైపైకే ఆద్యంతం హెచ్చుతగ్గులకు లోనైన గురువారం నాటి స్టాక్ మార్కెట్ చివరకు స్వల్ప లాభ్లాలో ముగిసింది. విదేశీ కొనుగోళ్ల జోరుతో వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు లాభపడి 25,844 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 0.05 పాయింట్ల లాభంతో 7,915 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఆర్థిక రంగ, లోహ షేర్లు లాభపడ్డాయి. ఐదు రోజుల్లో 1,171 పాయింట్ల లాభం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ బ్లూ చిప్ షేర్ల జోరుతో మరింతగా లాభపడింది. అయితే లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండడం, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం ప్రతికూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 25,956, 25,717 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. మొత్తం మీద సెన్సెక్స్ 239 పాయింట్ల రేంజ్లో కదలాడింది. అంచనాల కంటే తక్కువగానే టీసీఎస్ మార్జిన్లు ఉండడం, అధిక సరఫరా అంశాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పతనం కావడంతో లాభాలు తగ్గాయని నిపుణులంటున్నారు. మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1171 పాయింట్లు లాభపడింది. ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండడం, వర్షాలు విస్తారంగా కురుస్తాయన్న అంచనాలు, ఇన్ఫోసిస్ గెడైన్స్ అంచనాలను మించడం... దీనికి ప్రధాన కారణాలు. బుల్ రన్ మొదలైంది..: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మన స్టాక్ మార్కెట్ దీర్ఘకాలిక బుల్ రన్ ప్రారంభ దశలో ఉందని ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చని, సమంజసమైన రాబడులు పొందవచ్చని చెప్పారు. అయితే మరీ అత్యావ రాబడులు ఆశించవద్దని ఇన్వెస్టర్లకు హితవు పలికారు. రియల్టీ, ఫార్మా, ఐటీ రంగాలు బుల్లిష్‌గా ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు.