మార్కెట్ బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాల ప్లాన్స్‌కి చివరి నిమిషంలో అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఆకాశ ఎయిర్‌లైన్స్ సర్వీసెస్‌ను 2022 మేలో ప్రారంభించాలని ముందుగా బిగ్‌బుల్ నిర్ణయించుకున్నారు. అయితే కీలకమైన బోయింగ్ విమానం 737 ఎయిర్‌క్రాఫ్ట్ రావడం ఆలస్యం అయ్యింది. దీంతో ఎయిర్‌లైన్స్ సేవలను ముందుగా అనుకున్నట్టుగా మేలో కాకుండా జులైలో ప్రారంభించనున్నారు.
ఎయిర్‌లైన్స్ సేవలకు సంబంధించి ఆకాశ సీఈవో వినయ్ దుబే మాట్లాడుతూ.. ఆకాశ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన తొలి విమానం 2022 జూన్‌లో గాలిలోకి లేస్తుంది. ఇక కమర్షియల్ ఫ్లైట్స్ జులై నుంచి అందుబాటులోకి వస్తాయంటూ ప్రకటించారు. బోయింగ్ విమానం విషయంలో కొంత ఆలస్యమైన మిగిలిన 18 ఎయిర్ క్రాఫ్ట్స్ సకాలంలో వస్తాయంటూ దుబే ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..!
Comments
Please login to add a commentAdd a comment