దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన ఫాల్గుని నాయర్‌ని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ప్రశంసించారు. ఫాల్గుని నాయర్ కెరీర్ ఎదుగుదలను వివరిస్తూ ప్రచురితమైన కథనాన్ని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ వాట్ ఏ టెర్రిఫిక్ స్టోరీ అంటూ కేటీఆర్ ప్రశంసించారు. దేశంలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు మీరే ఆదర్శనమంటూ పేర్కొన్నారు. దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం విమెన్ ఎంట్రప్యూనర్‌షిప్ హబ్‌ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు.
What a terrific story #FalguniNayar 👏
— KTR (@KTRTRS) November 10, 2021
Inspiration to many young women entrepreneurs @WEHubHyderabad India’s only women entrepreneurship Hub launched by Govt of #Telangana https://t.co/IYtPSSxyHg
అత్యంత సంపన్నురాలు
ఫాల్గని నాయర్ నేతృత్వంలో నడుస్తున్న బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ నైకా ఇటీవల స్టాక్ ఎక్సేంజీలో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్‌కి వచ్చింది. ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఆమె సంపద విలువ 53.50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న స్వీయ-నిర్మిత మహిళా బిలియనీర్‌గా నిలిచారు.
ప్రభావం చూపిన ఇంటర్వ్యూ
స్టాక్ మార్కెట్‌లో ఏస్ బిగ్‌బుల్ రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలాని ఇటీవల సినీటి శ్రద్ధ కపూర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా షేర్ మార్కెట్ టిప్స్ చెప్పాలంటూ బిగ్‌బుల్‌ని అడిగారు. అంతేకాదు తాను త్వరలో ఐపీవోకి రాబోతున్న బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నట్టు వెల్లడించారు. తన నిర్ణయం సరైందో కాదో చెప్పాలంటూ బిగ్‌బుల్‌ని కోరారు. సౌందర్య ఉత్పత్తలుకు ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉందని, అయితే బ్యూటీ ప్రొడక్టుల ధరలు తగ్గిస్తే మరింత మార్కెట్‌కి ఆకాశమే హద్దంటూ రాకేశ్ వివరించారు. బ్యూటీ కంపెనీలో షేర్లు తీసుకోవాలనే నిర్ణయం మంచిదేనంటూ రాకేశ్ సూచించారు. ఇంటర్వ్యూ ప్రచురితమైన కొద్ది రోజులకే మైకా సంస్థ ఐపీవోకి వచ్చింది. బిగ్‌బుల్ మాటల ప్రభావం షేర్ వ్యాల్యూపై కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment