విమానయానంలో విప్లవం | International standard of accommodation at Madurapudi Airport | Sakshi
Sakshi News home page

విమానయానంలో విప్లవం

Published Mon, Dec 11 2023 5:29 AM | Last Updated on Mon, Dec 11 2023 5:29 AM

International standard of accommodation at Madurapudi Airport - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: గత తొమ్మి­ది­న్నరేళ్లలో విమానయాన గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర పౌర విమాన­యాన, ఉక్కుశాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మధురపూడిలోని రాజమహేంద్రవరం విమా­నా­శ్ర­యంలో రూ.347 కోట్లతో నిర్మిస్తున్న డొమెస్టిక్‌ టెర్మినల్‌ భవనానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 65 ఏళ్ల భారతదేశ చరిత్రలో 2014 నాటికి దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉన్నాయని, ఈ తొమ్మిదిన్నరేళ్లలో 75 ఎయిర్‌పోర్టులు ని­ర్మించామని చెప్పారు. దీంతో దేశంలో ఎయిర్‌­పోర్టుల సంఖ్య 149కి చేరిందన్నారు. వీటి సంఖ్యను 220కి పెంచుతామని తెలిపారు.

రాజమ­హేంద్రవరంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్‌ పాయింట్‌ 21,094 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుందని, రద్దీవేళల్లో 2,100 మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో­పాటు భవిష్యత్‌లో ఏటా 30 లక్షలమంది ప్ర­యాణికుల వార్షిక సామర్థ్యం ఉంటుందని వివ­రించారు. 28 చెక్‌ ఇన్‌ కౌంటర్లు, నాలుగు అరై­వల్‌ కరైజల్స్, 600 కార్లకు పార్కింగ్, ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌తో టెర్మినల్‌ రూపు దిద్దుకోనుందని చెప్పారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో రాజమ­హేం­ద్రవరం నుంచి శంషాబాద్‌కు మాత్రమే విమానాల కనెక్టివిటీ ఉండేదని, ప్రస్తుతం మూడు ప్రధాన నగరాలకు ఉందని తెలిపారు.

తిరుపతి నుంచి గతంలో ఒక నగరానికి మా­త్రమే కనెక్టివిటీ ఉండగా.. ఇప్పుడది 10 ప్రాంతాలకు విస్తరించిందని చెప్పారు. విజయవా­డ­కు రెండు నగరాలతో కనెక్టివిటీ ఉంటే ప్రస్తుతం ఎనిమిదికి పెరిగిందని, షార్జా కూడా వెళ్లగలు­గుతున్నారని తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు తొమ్మిది ప్రాంతాలతో ఉన్న కనెక్టివిటీ ఇప్పుడు 14 నగరాలకు పెరిగిందన్నారు. సింగపూర్‌కు సైతం విమానాలు వెళ్లేలా వసతులు కల్పించామని చెప్పారు.

అలాగే కడప, కర్నూలు ఎయి­ర్‌పోర్టుల ద్వారా వివిధ ప్రాంతాలకు వి­మా­­నాలు వెళ్లేలా తీర్చిదిద్దామన్నారు. భోగా­పురం, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులను గ్రీన్‌­ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే ఆరు ఎయిర్‌పోర్టుల ద్వారా ప్ర­యా­ణి­కులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఇటీవల భోగాపురంలో 2,200 ఎకరాల్లో రూ.4 వేల కోట్లతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశా­రని చెప్పా­రు. రెండేళ్లలో దీని నిర్మాణం పూర్తిచేస్తామ­న్నారు.

కర్నూలులో రూ.500 కోట్లతో ఫ్లయింగ్‌ స్కూల్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌­రా­మ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వ­రి మాట్లాడారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కలెక్టర్‌ కె.మాధవీలత, జేసీ ఎన్‌.తేజ్‌భరత్, రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ కమిష­న­ర్‌ కె.దినేష్‌కుమార్, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ సంజీవ్‌కుమార్, మధుర­పూడి విమానాశ్రయ అధికారి ఎస్‌.జ్ఞానేశ్వర­రావు తదితరులు పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న సింథియా ప్రసంగం
అందరికీ నమస్కారం.. అంటూ సింథియా ప్రారంభించిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సాంస్కృతిక రాజధానిగా ఖ్యాతిగాంచిన రాజమహేంద్రవ­రం పవిత్ర గోదావరి ఒడ్డున ఉందని, వెయ్యేళ్ల ఉత్స­వాలు చేసుకుంటున్న ఈ నగర సాంస్కృతిక వారస­త్వం దేశానికే తలమానికమని కొనియాడారు. ప్రజాకవి నన్నయ నడయాడిన నేలగా అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు, స్వాతంత్య్ర సమరయో­ధులు ఇక్కడి వారేనని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement