
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఓ వైపు కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుంటే మరోవైపు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) మాత్రం తనపని తాను చేసుకుంటూ పోతోంది. యుద్ధవిమానాల స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతోంది.
పైలట్లకు శిక్షణ ఇచ్చిన ఐఏఎఫ్ ఈ ఏడాది చివర్లో వారిని మరోసారి ఫ్రాన్స్‌కు పంపేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ విమానాలు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే వీటిని భారత్‌కు అందించేందుకు డస్సాల్ట్ ఏవియేషన్ ప్రయత్నం చేస్తోంది. దేశంలోని రెండు ప్రధాన సరిహద్దుల్లో రాఫెల్ యుద్ధవిమానాల స్టేషన్లనూ ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment