బెంగళూరు: దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తన సర్వీసులతో దూసుకుపోతోంది. ఆకాశ ఎయిర్ ఇపుడు వైజాగ్-బెంగళూరు మార్గంలో విమానాల్ని నడపనుంది. తద్వారా బెంగళూరు నుంచి విమానాన్ని సర్వీసును అందిస్తున్న పదవ నగరంగా విశాఖపట్నంను చేర్చింది.
ఇదీ చదవండి: డిమాండ్ లేదు, షేర్లు ఢమాల్: కార్వానా సీఈవో సంచలన నిర్ణయం
డిసెంబరు 10 నుండి బెంగళూరు నుండి విశాఖపట్నానికి విమాన సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ తెలిపింది. అంతేకాదు డిసెంబర్ మధ్య నాటికి పది నగరాల్లో మొత్తం పద్నాలుగు రూట్లలో 450కి పైగా వీక్లీ ఫ్లైట్ సర్వీసులను దాటాలని ఆశిస్తోంది. ప్రతిరోజూ రెండుసార్లు బెంగళూరు-వైజాగ్ మధ్య విమానాలను నడపనున్నామని ఆకాశ ఎయిర్ కో-ఫౌండర్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ ప్రకటించారు. తమ సర్వీసులను ప్రయాణీకులు ఎంజాయ్ చేస్తారని తెలిపారు. మొదటి ఫ్రీక్వెన్సీ డిసెంబర్ 10న, ఎర్లీ మార్నింగ్ ఆప్షన్‌తో రెండో ఫ్రీక్వెన్సీ డిసెంబర్ 12న మొదలవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గౌహతి, పూణే, విశాఖపట్నం ఎనిమిది నగరాలను కనెక్ట్ చేస్తూ ఆకాశ ఎయిర్ ఇప్పుడు 24 రోజువారీ నాన్-స్టాప్ విమానాలను బెంగళూరుకు అందిస్తోంది.(తగ్గేదేలే: మస్క్ కొత్త పాలసీ, అలా చేస్తే అంతే!)
కాగా ప్రముఖ పెట్టుబడిదారుడు, దివంగత రాకేశ్‌ఝన్‌ఝన్‌వాలా మద్దతిచ్చిన ఆకాశ ఎయిర్ తన మొదటి వాణిజ్య విమానాన్ని ఆగస్టు 7, 2022న ప్రారంభించింది. నవంబర్ 26 నుంచి దేశంలోని ఐటీ హబ్ నగరాలు పూణే, బెంగళూరులను కలుపుతూ డబుల్ డైలీ విమానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment