
సాక్షి,పల్నాడు జిల్లా: పల్నాడులో మరోసారి టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెదకూరపాడులో టీడీపీ నేతలు దాదాగిరి చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు.. ముంపు ప్రాంతాల పరిశీలనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్‌రావుపై దాడికి యత్నించారు.
టీడీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని నంబూరి శంకర్‌రావు మండిపడ్డారు. ‘‘ముంపు ప్రాంత బాధితులను పరామర్శించడం తప్పా?. పోలీసుల సమక్షంలోనే మాపై దాడి చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన దాడి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం దారుణం’’ అని శంకర్‌రావు అన్నారు.
ఆళ్లగడ్డలో అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం
మరోవైపు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. అఖిలప్రియ వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పట్టణానికి చెందిన విశ్వనాథం పెద్ద కొండయ్య స్థలాన్ని కబ్జాకు యత్నించారు. అడ్డుకున్న కొండయ్య కూతురిపై అసభ్యపదజాలంతో తిడుతూ అఖిలప్రియ అనుచరుడు రవి చంద్రారెడ్డి రెచ్చిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment