సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు అడ్డం తిరిగారు. తాను పార్టీకి డబ్బులు ఇవ్వడం కాదు. తనకు పార్టీ బీ–ఫారంతోపాటు డబ్బులు కూడా ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు సమాచారం. దీంతో ఖంగుతిన్న టీడీపీ అధిష్టానం ఆయనకు బీ–ఫారం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అరవింద్‌బాబు డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఆయనకు బీ–ఫారం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయినా అరవింద్‌బాబు లెక్క చేయకుండా బీ–ఫారం లేకుండానే ఈ నెల 18న నామినేషన్ దాఖలు చేశారు.
ఓటమి భయంతోనే
తనను అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అరవింద్‌బాబు టీడీపీ అధిష్టానికి రూ.30 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉందని సమాచారం. అయితే వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణతో మరోసారి ఇక్కడ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. టీడీపీలోని ఓ ప్రధాన సామాజికవర్గం కూడా అరవింద్‌బాబుకు సహకరించడం లేదు. అదే సమయంలో ఇటీవల పట్టణంలోని 24వ వార్డులో వడ్డెర సామాజికవర్గ నేతలు అరవింద్‌బాబు కుమారుడిని తమ వార్డులోకి రావద్దని అడ్డుకున్నారు.
అటు టీడీపీలో ముఖ్య సామాజికవర్గం సహకరించక, ఇటు బీసీలు ఆదరించక తాను ఎలా గెలవడమని అరవింద్‌బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓడిపోయే సీటుకు రూ.కోట్లు ఎందుకు ఖర్చు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఆయన కావాలనే డబ్బుల్లేవని డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం టీడీపీ అభ్యర్థులందరికీ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీ–ఫారాలు అందించారు. అయితే అరవింద్‌బాబు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నరసరావుపేటకు చెందిన టీడీపీలోని ఓ ముఖ్య నేతకు రూ.30 కోట్లు ఇవ్వగానే బీ–ఫారం అందజేసేలా అధిష్టానం ఏర్పాట్లు చేసింది.
డబ్బులు ఇస్తేనే పోటీలో ఉంటా?
అరవింద్‌బాబు పంచాయితీని ఓ ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుకు చంద్రబాబు అప్పగించారు. దీంతో ఇటీవల వారి మధ్య చర్చల సందర్భంగా ఇప్పటికే పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చు చేశానని, ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు చేసే పరిస్థితిలో తాను లేనని అరవింద్ బాబు తేలి్చచెప్పినట్లు సమాచారం. బి.ఫారంతోపాటు ఖర్చులకు డబ్బులు ఇస్తేనే పోటీలో ఉంటానని, లేకపోతే మరో అభ్యరి్థని చూసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. అయినా అరవింద్‌బాబు పంచాయితీ తేలకపోవడంతో టీడీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment