gopi reddy srinivasa reddy
-
మెడికల్ సీట్లు వద్దని చెప్పడం దుర్మార్గం: గోపిరెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, వాటిలో 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే, ఈ ఏడాది మరో 5 కాలేజీలు కూడా మొదలై ఉండేవని తెలిపారు.కానీ, సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల.. అవి ప్రారంభం కాకపోగా.. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చిన 50 మెడికల్ సీట్లు కూడా పోయాయని ఆక్షేపించారు. ఆ సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి ప్రభుత్వం లేఖ రాయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కొత్తగా మెడికల్ సీట్లు వస్తే మీకు (ప్రభుత్వానికి) వచ్చిన నష్టమేమిటని.. ఒక డాక్టర్‌గా అడుగుతున్నానన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అందుకు సమాధానం చెప్పాలని నిలదీశారు.40 ఏళ్ళుగా ఏపీలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. వైద్య విద్య ఎంత కష్టమైందో.. మెడిసిన్ సీటు సంపాదించడం కూడా ఎంత ఇబ్బందో అందరికీ తెలిసిందేనన్న నరసారావుపేట మాజీ ఎమ్మెల్యే.. వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మాటలు విస్మయం కలిగించాయని చెప్పారు.ఇదీ చదవండి: తెల్ల ‘కోట్లు’!.. నీట్ ర్యాంకర్ల నిర్వేదంగత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ , వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడమే కాక.. పోస్టులన్నీ భర్తీ చేశారని స్పష్టం చేశారు. అందుకే.. మంత్రి సత్యకుమార్ సవాల్ స్వీకరిస్తున్నానని, ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో ఎంత అభివృద్ధి జరిగింది?. ఈ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు. గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సిబ్బంది ధర్నాతో పీహెచ్‌సీల్లో వైద్య సేవలు ఆగిపోయాయని, స్పెషలిస్ట్ వైద్యసేవలూ నిల్చిపోయాయని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివరించారు. -
టీడీపీ ఎమ్మెల్యే అరవింద బాబుపై గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సెటైర్లు
-
అడ్డం తిరిగిన అరవింద్‌బాబు
సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు అడ్డం తిరిగారు. తాను పార్టీకి డబ్బులు ఇవ్వడం కాదు. తనకు పార్టీ బీ–ఫారంతోపాటు డబ్బులు కూడా ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు సమాచారం. దీంతో ఖంగుతిన్న టీడీపీ అధిష్టానం ఆయనకు బీ–ఫారం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అరవింద్‌బాబు డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఆయనకు బీ–ఫారం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయినా అరవింద్‌బాబు లెక్క చేయకుండా బీ–ఫారం లేకుండానే ఈ నెల 18న నామినేషన్ దాఖలు చేశారు. ఓటమి భయంతోనే తనను అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అరవింద్‌బాబు టీడీపీ అధిష్టానికి రూ.30 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉందని సమాచారం. అయితే వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణతో మరోసారి ఇక్కడ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. టీడీపీలోని ఓ ప్రధాన సామాజికవర్గం కూడా అరవింద్‌బాబుకు సహకరించడం లేదు. అదే సమయంలో ఇటీవల పట్టణంలోని 24వ వార్డులో వడ్డెర సామాజికవర్గ నేతలు అరవింద్‌బాబు కుమారుడిని తమ వార్డులోకి రావద్దని అడ్డుకున్నారు.అటు టీడీపీలో ముఖ్య సామాజికవర్గం సహకరించక, ఇటు బీసీలు ఆదరించక తాను ఎలా గెలవడమని అరవింద్‌బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓడిపోయే సీటుకు రూ.కోట్లు ఎందుకు ఖర్చు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఆయన కావాలనే డబ్బుల్లేవని డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం టీడీపీ అభ్యర్థులందరికీ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీ–ఫారాలు అందించారు. అయితే అరవింద్‌బాబు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నరసరావుపేటకు చెందిన టీడీపీలోని ఓ ముఖ్య నేతకు రూ.30 కోట్లు ఇవ్వగానే బీ–ఫారం అందజేసేలా అధిష్టానం ఏర్పాట్లు చేసింది. డబ్బులు ఇస్తేనే పోటీలో ఉంటా? అరవింద్‌బాబు పంచాయితీని ఓ ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుకు చంద్రబాబు అప్పగించారు. దీంతో ఇటీవల వారి మధ్య చర్చల సందర్భంగా ఇప్పటికే పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చు చేశానని, ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు చేసే పరిస్థితిలో తాను లేనని అరవింద్ బాబు తేలి్చచెప్పినట్లు సమాచారం. బి.ఫారంతోపాటు ఖర్చులకు డబ్బులు ఇస్తేనే పోటీలో ఉంటానని, లేకపోతే మరో అభ్యరి్థని చూసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. అయినా అరవింద్‌బాబు పంచాయితీ తేలకపోవడంతో టీడీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. -
చంద్రబాబుపై ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్
-
బోండా ఉమా, బుద్దా వెంకన్నకు మాచర్లలో ఏంటి పని?
సాక్షి, తాడేపల్లి: స్థానిక ఎన్నికలు జరగకుండా ఉండటమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాబు ఎన్నికలను ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని చిన్న సంఘటనలను కూడా భూతద్దంలో చూపుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా లేరని విమర్శించారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డబ్బు, మద్యం లేకుండా స్థానిక ఎన్నికలు జరగాలని నూతన సంస్కరణలు తెచ్చారన్నారు. ఇక 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా ఇలాంటి సంస్కరణలు తెచ్చారా విమర్శించారు. రాజకీయ నాయకులు, బంధువులు ఎన్నికల్లో పోటీ చేయకుడదనే నూతన విధానాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారన్నారు. సీఎం జగన్ పాలనను అన్ని రాష్ట్రాల వారు అభినందిస్తుంటే ఎల్లో మీడియాకు అవి కనబడటం లేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీలో భారీ ఎత్తున చేరికలు 8 నెలల కాలంలో సీఎం జగన్ చేసిన పాలనను ఇతర రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నాయని చెప్పారు. అవి...ఎల్లో మీడియాకు కునబడం లేదా అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తెస్తున్న నూతన సంస్కరణలు నచ్చక చంద్రబాబు ఎల్లో మీడియాల్లో రాష్ట్రంలో ఏదో జరిగిపోయినట్లుగా కల్పితాలు రాపిస్తున్నారన్నారు. ఆయన అమలులోకి తెచ్చిన ఇంగ్లీషు మీడియం, వికేంద్రీకరణ, దిశ చట్టాన్ని ఇతర రాష్టాలు కూడా మెచ్చుకుని వాటిని అనుసరిస్తున్నాయి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. గతంలో తమ నాయకులైన అంబటి రాంబాబు, ముస్తఫాలు సత్తెనపల్లిలో ఎంపీటీసీగా గెలిచిన వారిని బస్సులో తీసుకువెళుతుంటే జరిగిన దాడిపై బాబు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. పల్నాడులో టీడీపీ పాలనలో జరిగిన అరాచకాలు అందరికీ తెలుసని, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం, గురజాలలో యరపతినేని, చిలకలూరిపేటలో పుల్లారావ్ చేసిన అరాచకాలు ప్రజలు గమనించారని తెలిపారు. బోండా ఉమా, బుద్దా వెంకన్నకు మాచర్లలో ఏంటి పని..? అని ప్రశ్నించారు. విజయవాడ నుండి గూండాలను మాచర్ల తెచ్చారా అని ఎద్దేవా చేశారు. పల్నాడు పౌరుషాల గడ్డ ప్రజలు మీ అరాచకాలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ‘సంతాప సభను.. బాబు రాజకీయ సభగా మార్చారు’ టీడీపీ నుంచి రోజుకు ఇద్దరూ చొప్పున పార్టీ మారుతుంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందలువేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో సీబీఐ, ఈడీలను ఎందుకు రాష్ట్రంలోకి రానివ్వలేదని, చంద్రబాబు ఎల్లో మీడియాతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏడాది పాటు ఎన్నికలు జరపకుండా ప్రత్యేక అధికారులతో పాలన చేసిన నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. సీఎం జగన్ ఆర్డినెన్స్ తో నూతన సంస్కరణలు తీసుకువచ్చారని, డబ్బులు లేకుండా ఎన్నికల జరగాలన్నదే ఆయన ఉద్దేశం అన్నారు. పులివెందుల పంచాయతీ అని విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకులు ఓసారి పులివెందుల వెళదాం రండి... అక్కడి ప్రజల మమకారం మీకు తెలియదు అని వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యoలో హింసకు తావు లేదని.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం జగన్ తీసుకువచ్చిన సంస్కరణలకు కట్టుబడి పని చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ: చంద్రబాబు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆరాచకాలు ఎలా చేయాలో బాబు తన మనుషులకు చెప్పి పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవలేమనే జనాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా బాబు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. -
నిప్పునంటూ బాబు డబ్బాలు కొట్టుకున్నారు
-
నా మాటలను మీడియా వక్రీకరించింది
సాక్షి, అమరావతి: రాజధాని అంశంపై తాను మాట్లాడిన మాటలను కొన్ని పత్రికలు, మీడియా పూర్తిగా వక్రీకరించాయని, తల, తోక తీసేసి ప్రసారం చేశాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినదాంతో తామందరం ఏకీభవిస్తున్నామన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తిని తానన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనతో హైదరాబాద్ మహా నగరాన్ని కోల్పోయి, ఎంత నష్టపోయామో అందరికీ తెలిసిందేనన్నారు. పెట్టుబడులు అక్కడే పెట్టడంతో మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు బాగా వెనకబడ్డాయన్నారు. దాన్నుంచి గుణపాఠం నేర్చుకోకుండా చంద్రబాబు మళ్లీ అదే తప్పిదం చేశారని విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కారన్నారు. అయితే శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్నే ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆ మేరకు వికేంద్రీకరణలో భాగంగా లెజిస్లేటివ్ కేపిటల్ అమరావతిలో, కార్యనిర్వాహక కేపిటల్ విశాఖలో, జ్యుడీషియల్ కేపిటల్ కర్నూలులో ఉండేలా ఆలోచనలు చేస్తున్నామని సీఎం చెప్పినదాన్ని పూర్తిగా సమర్థిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజానీకం కూడా సీఎంను సమర్థించాలన్నారు. తాను పదేళ్లుగా వైఎస్సార్సీపీలో ఉన్నానని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. -
నరసరావు పేటలో కోడెల ఇష్టారాజ్యంగా వ్యవహరించారు
-
రికార్డు బ్రేక్.. ఆధిక్యం.. అద్భుతం
సాక్షి, నరసరావుపేట: ఏపీ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే అత్యధిక మెజార్టీ ఓట్లు ఇచ్చి నియోజకవర్గ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఐదుమార్లు, కాసు వెంకటకృష్ణారెడ్డి మూడుసార్లు తమ ప్రత్యర్థులపై గెలిచినా డాక్టర్ గోపిరెడ్డికి వచ్చి నంత మెజార్టీ తెచ్చుకోలేకపోవటం గమనార్హం. తొలిసారిగా 1955లో సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి. నరసరావు పేట అసెంబ్లీ నుంచి నల్లపాటి వెంకట రామయ్యచౌదరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి కరణం రంగారావుపై 12063 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1962లో చాపలమడుగు రామయ్యచౌదరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా కొత్తూరి వెంకటేశ్వర్లుపై 2656 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1967లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాసు బ్రహ్మానందరెడ్డి స్వతంత్ర అభ్యర్థిపై 13,699 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొండేటి కృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థి కొత్తూరి వెంకటేశ్వర్లుపై 14,587 ఓట్లతో గెలిచారు. 1978లో కాసు కుటుంబం నుంచి రాజకీయాలోక్లి ప్రవేశించిన కాసు వెంకటకృష్ణారెడ్డి జనతా పార్టీ అభ్యర్థి కొత్తూరి వెంకటేశ్వర్లుపై 6,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ రంగప్రవేశం చేసిన డాక్టర్ కోడెల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూచిపూడి సుబ్బారెడ్డిపై 14,557 ఓట్ల మెజార్టీతో తొలిసారిగా గెలిచారు. 1985 ఎన్నికల్లో డాక్టర్ కోడెల తన ప్రత్యర్థి కాసు కృష్ణారెడ్డిపై 2064 ఓట్లు, 1989లో ముండ్లమూరి రాధాకష్ణమూర్తిపై 9055 ఓట్లు, 1994లో దొడ్డా బాలకోటిరెడ్డిపై 9300 ఓట్లు, 1999లో కాసు కృష్ణారెడ్డిపై 14306 ఓట్ల మెజార్టీతో వరుసగా ఐదు సార్లు విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాసు కృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై 15,495, 5971 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో తొలి సారిగా సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ గోపిరెడ్డి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ నలబోతు వెంకటరావుపై 15,766 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. -
రెడ్డి అనేది కులం కాదు గుణం : గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సాక్షి, సత్తెనపల్లి: రెడ్డి అనేది కులం కాదు గుణం అని, అన్ని వర్గాలను కలుపుకొని వారికి సాయం అందిస్తూ ముందుకు సాగాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని ఏజీకేఎం కళాశాలలో ఆదివారం రెడ్డిజన సేవా సమితి అధ్యక్షుడు బాసు లింగారెడ్డి అధ్యక్షతన రెడ్ల వనసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, మనతో పాటు వచ్చే కులాలు, మతాలను కలుపుకొని పోవాలని పిలుపునిచ్చారు. నాలుగున్నర సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారన్నారు.పెన్షన్ నుంచి ఇల్లు కట్టుకునేదాకా ఒక పార్టీకి, ఒక వర్గానికే ఈ రోజు పనులు జరుగుతున్నాయన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని తెలిపారు. గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రెడ్లకు రాజ్యాధికారం రావాలంటే అన్ని కులాలను ప్రేమించే మంచి మనస్సు ఉండాలని, ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే ధనం కావాలన్నారు. వైఎస్సార్ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి రెడ్లు ఎనలేని సేవలు అందించారన్నారు. వారి సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా పుస్తకాలు ప్రచురించాలని సూచించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆరిమండ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ రెడ్డి ఒక కులం కాదని, ఒక టైటిల్ అన్నారు. రాబోయే రోజుల్లో అంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నలందా ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి ఆరిమండ విజయశారదారెడ్డి, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.గీతాహాసంతి, డాక్టర్ గజ్జల నాగభూషణ్‌రెడ్డి, డాక్టర్ ఎస్.రాజమోహన్‌రెడ్డి, డాక్టర్ షకీలా శ్రీధర్, చెన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వెన్నా సాంబశివారెడ్డి, యేరువ ప్రతాపరెడ్డి, న్యాయవాది మర్రి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడారు. ముందుగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్ఎస్పీ ఏఈగా పనిచేస్తూ మృతి చెందిన ఇనగంటి హిమబిందు మృతికి మౌనం పాటించారు. ఈ సందర్భంగా మహిళలకు వివిధ లక్కీ డిప్లు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ కొమ్మారెడ్డి చెంచిరెడ్డి, ముప్పాళ్ల మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఇందూరి నరిసింహారెడ్డి, మర్రి సుబ్బారెడ్డి, యాంపాటి కోటిరెడ్డి, అచ్చిరెడ్డి, అల్లు మధుసూదన్‌రెడ్డి, కొమ్మారెడ్డి సాయిరెడ్డి పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవటంలో ఘోర వైఫల్యం
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం శనగలు పండించిన రైతులను ఆదుకోవటంలో ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తన విలాసాలు, విహారయాత్రలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పంటలు పండించిన రైతులకు మద్దతు ధరను ప్రకటించి వారిని ఆదుకునేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేట మార్కెట్ యార్డులో ప్రభుత్వం తూతూ మంత్రంగా వారం రోజులపాటు మాత్రమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం నడిపి గత నెల 30వ తేదీతో ముగించిందన్నారు. రైతులు ఈ క్రాప్, సర్టిఫికెట్ ఆఫ్ కల్టివేషన్ (సీవోసీ)లతో రిజిస్ట్రేషన్ల ద్వారా నమోదు చేసుకున్న పంటను కొనుగోలు చేయలేదన్నారు. రొంపిచర్ల మండలంలో 5200 ఎకరాల్లో శనగలు వేసి సీవోసీ తీసుకోగా, నరసరావుపేట మండలంలో 3400ఎకరాల్లో శనగలు వేశారన్నారు. మొత్తంగా 8600 ఎకరాల్లో పంటలు వేసినట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఎకరానికి కనీసంగా 8 క్వింటాళ్లు చొప్పున 68,800 క్వింటాళ్లు పండించారన్నారు. అయితే ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా ఏప్రిల్ 30 వరకు నియోజకవర్గంలో కేవలం 3011 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. ప్రభుత్వం రూ.4450 మద్దతు ధర ప్రకటించగా బయట మార్కెట్లో రూ.3,200కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో రైతులు బయటమార్కెట్లో విక్రయించటం ద్వారా క్వింటాలుకు కనీసంగా రూ.1250 కోల్పోవాల్సి వస్తోందన్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి ఖర్చులను పరిశీలిస్తే వారికి మిగిలేది ఈ రూ.1250 మాత్రమే అన్నారు. రొంపిచర్లలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించి అందరివద్దా కొనుగోలు చేయకపోతే తాము చేసిన పోరాటం ద్వారా ప్రతి రైతు నుంచి కందులను కొనుగోలు చేశారన్నారు. వ్యవసాయంలో 16 శాతం వృద్ధిరేటు సాధించామని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన శనగలు కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించి వారిని ఆదుకునేందుకు ఎందుకు ప్రయత్నించటం లేదని ప్రశ్నించారు. ధర్మపోరాటానికి రూ.60 కోట్లు, విహార యాత్రలకు కోట్లాది రూపాయలు దుబారా ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నివాసాలకు హైదరాబాదులో రూ.40 కోట్లు, విజయవాడలో వందల కోట్లు దుబారా చేశారన్నారు. ఇంత దుబారా చేస్తూ రైతులను ఆదుకోవటంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రైతులు పండించిందే మెట్ట పైర్లు అయితే కనీస మద్దతు ధర రాకపోతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌లో నిండుగా నీరున్నా కనీసం రైతులకు ఒక పంటకైనా నీరివ్వకుండా గుడ్డిగా వ్యవహరించిందన్నారు. కొంతమంది రైతులు ధైర్యంచేసి బావులు, చెరువుల కింద మాగాణి వరివేస్తే ఎకరాకు 50 బస్తాల వరకు ధాన్యం పండిందన్నారు. కనీసంగా ఆ నీరు ఇచ్చినా ప్రతి రైతు ఒక పంట వేసుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేవారన్నారు. వారిని మాగాణి వేసుకోనీయకుండా, వేసిన మెట్టపైర్లకు మద్దతు ధర రానీయకుండా చేయటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వెల్లడించారు. రైతులే మీడియా ముందుకు వచ్చి తాము పండించిన పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నా పట్టించుకునే ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు కరువయ్యారని దుయ్యబట్టారు. -
కేసీఆర్‌ను నీరు అడగాలంటే చంద్రబాబుకు భయం
నరసరావుపేట: కేసీఆర్‌ను నీరు అడగాలంటే చంద్రబాబుకు భయమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌లలో సమృద్ధిగా నీరు చేరినందున ప్రభుత్వం కుడికాలువ ఆయకట్టు రైతులకు రబీపంటకు సాగునీరు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎన్ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కుడికాలువ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం వారిద్దరూ రైతులతో కలిసి ఎన్ఎస్పీ సూపరిండెంట్ ఇంజినీర్ వెంకటరమణారావుతో సమావేశమయ్యారు. రెండు ప్రాజెక్ట్‌లలో సోమవారం నాటికి 420 టీఎంసీలు ఉన్నా ప్రభుత్వం నీటి విడుదలపై ప్రకటన ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. గతంలో సాగర్‌లో 530 అడుగుల నీరుండగానే రైతులకు సాగునీరు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి పత్తిపాటి పుల్లారావులు ఇక్కడ ఉండి కూడా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. గతేడాది వీరు రైతులకు నీరు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఇప్పుడు కనీసం నీరిచ్చేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడతామని కూడా ప్రకటన చేయట్లేదని మండిపడ్డారు. ఇంకా 50 టీఎంసీల వరకు నీరు వచ్చే అవకాశం ఉన్నందున ఆయకట్టు రైతులకు నీరివ్వాలని కోరారు. సాగర్‌డ్యాం తాళాలు తెలంగాణ చేతుల్లోనే.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ సాగర్ నుంచి నీరు తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సాగర్ డ్యామ్ తాళాలు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వద్దే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేవలం ఆరుతడి పంటలకే ఇద్దామని మంత్రివర్గంలో ముఖ్యమంత్రి అనటం బాధాకరమైన విషయమన్నారు. దీనిని బట్టి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అర్ధమవుతుందని స్పష్టం చేశారు. గత మూడేళ్ల నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు సాగునీరు అందక అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. దాళ్వాకు నీరివ్వాలని కోరుతూ ఎస్ఇ రమణారావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వానికి నివేదిస్తామని ఎస్ఈ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నరసరావుపేట, రొంపిచర్ల మండల అధ్యక్షుడు పచ్చవ రవీంద్ర, కొమ్మనబోయిన శంకరయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి పి.ఓబుల్‌రెడ్డి, సర్పంచులు కంచేటి వీరనారాయణ, చల్లా నారపరెడ్డి, ఎంపీటీసీ ధూపాటి వెంకటేశ్వర్లు, సాంబశివరావు, రైతులు పాల్గొన్నారు. -
ప్రతిపక్ష నేత జగన్ గొంతు నొక్కారు
నరసరావుపేట వెస్ట్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి గొంతు నొక్కి అధికాపక్షం ఏకపక్షంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్టేట్మెంట్ ఇస్తారని ప్రకటించి రిజల్యూషన్ ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కావాలనే జగన్మోహనరెడ్డిని చర్చలో పాల్గొనకుండా చేశారని ఆరోపించారు. తాను మాట్లాడతానని జగన్మోహనరెడ్డి పదే పదే కోరినా అవకాశం ఇవ్వలేదన్నారు. రైతులకు ఓపిక నశించి రుణమాఫీ అడగలేని విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బంగారు, డ్వాక్రా రుణాలకు తిలోదకాలు ఇచ్చే విధంగా విధివిధానాలు రూపొందిస్తోందని తెలి పారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రతి జిల్లాకు చేసిన వాగ్దానాలు అమలు కావాలంటే రూ.20 లక్షల కోట్లు కావాలని తెలిపారు. లింగంగుంట్లకు చెందిన 1900 ఎకరాల భూములకు రైతులు రిజిస్ట్రేషన్లు, రుణాలు తీసుకోవటం, విక్రయాలు చేసుకునేందుకు ఎండోమెంట్, రెవెన్యూ మంత్రులను కలిశామని, వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. సమావేశంలో మండల కన్వీనర్ కె.శంకరయాదవ్, ఎస్సీసెల్ కన్వీనర్ కందుల ఎజ్రా, మండల కార్యదర్శి భవనం రమణారెడ్డి పాల్గొన్నారు.