
సాక్షి, తాడేపల్లి: పల్నాడులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని సీఎం జగన్ చెప్పారు.

కాగా, పల్నాడులో బస్సు ప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, పల్నాడులో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారికిలో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ప్రయాణీకులు ఉన్నారు. కాగా, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు హైస్పీడ్‌లో ఉన్న సమయంలో టిప్పర్‌ను ఢీకొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment