పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, హత్యలు, అక్రమాలు తప్పితే మరేం కనిపించడం లేదని గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జూలకల్లులో దళిత మహిళకు అన్యాయం చేశారని కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు.
రేషన్ షాపు వ్యవహారంలో మనీషా అనే యువతిని టీడీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత రేషన్‌షాపును మనీషా అనే యువతి చూసుకుంటుంటే ఆమెపై టీడీపీ వారు వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆమె షాప్ తీసేయడమే కాకుండా అక్రమ కేసులు పెడతామని హింసించడం మొదలుపెట్టారని, రూ. 70 వేల నుంచి రూ. 80 వేలు కట్టాలని టీడీపీ నేతలు వేధించారన్నారు. టీడీపీ నేతల వేధింపులతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. టీడీపీ నేతల వేధింపులకు ఇది పరాకాష్ట అని కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు.
ఆడ పడుచులను మరీ ముఖ్యంగా ఎస్టీ, ఎస్టీలపై టీడీపీ దాడులకు దిగుతుందన్నారు. పోలీసులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు, మా పార్టీ నాయకులు జూలకల్లు వెళ్తామని, మనీషా కుటుంబానికి అండగా ఉంటామని కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment