కన్నకూతురిపై లైంగికదాడి | sexual attack on daughter | Sakshi
Sakshi News home page

కన్నకూతురిపై లైంగికదాడి

Published Sat, Jul 19 2014 12:55 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

కన్నకూతురిపై లైంగికదాడి - Sakshi

కన్నకూతురిపై లైంగికదాడి

నరసరావుపేట టౌన్: పాము తన గుడ్లను తానే మింగేసినట్లు.. తల్లి లేని పిల్లను అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన ఆ తండ్రే కాలకూట విషాన్ని చిమ్మి ఆమె జీవితాన్ని చిదిమేశాడు. అభం శుభం తెలియని కన్నపేగుపై లైంగిక దాడికి పాల్పడి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. వివరాల్లోకెళితే.... నరసరావుపేట బాపనయ్యనగర్‌కు చెందిన షేక్ బాపనపల్లి జాన్‌బాబుకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా, 16 ఏళ్ల  చిన్నకుమార్తె ఇంట్లో ఉంటుంది. జాన్‌బాబు భార్య అల్లాబి ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి కుమార్తెలను మానసికంగా జాన్‌బాబు వేధిస్తున్నాడు. గతేడాది నవంబర్ 14న చిన్నకుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరింపులకు దిగాడు. పెద్దకుమార్తె పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. నెల రోజుల క్రితం ఇన్సూరెన్స్ బాండులో నామినీగా తమ పేర్లు పెడతానని నమ్మించి ఆస్తి డాక్యుమెంట్లపై కుమార్తెలచే సంతకాలు చేయించుకున్నాడు. ఈ నెల 14న రెండోసారి చిన్నకుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కళాశాల నుంచి  ఇంటికొచ్చిన పెద్దకుమార్తె గమనించి అడగ్గా.. జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారిద్దరూ గుంటూరు రోడ్డులో నివాసం ఉంటున్న అమ్మమ్మ, తాతయ్యల వద్దకు చేరుకొని ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు.
 
 జైభారత్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర మహిళా వేదిక అధ్యక్షురాలు విజయలక్ష్మిని ఆశ్రయించి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీంతో ఆమె బాధితురాళ్లను వెంటబెట్టకొని శుక్రవారం వన్‌టౌన్ ఎస్‌ఐ సాంబశివరావును కలిసి జరిగిన సంఘటనలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు వెంటనే జాన్‌బాబును అదుపులోకి తీసుకునేందుకు అక్కడికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. కోటప్పకొండ రోడ్డులోని దాల్‌మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడని తెలుసుకొని అక్కడికి వెళ్లినా లేకపోవడంతో వెనుతిరిగారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాంబశివరావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement