సాక్షి, తాడేపల్లి: పల్నాడుపై చంద్రబాబు కక్ష్య పెట్టుకున్నారని గురజాల ఎమ్మెల్యే కాసు మషేశ్‌రెడ్డి అన్నారు. పల్నాడుకు బోండా ఉమ, బుద్దా వెంకన్న ఎందుకు వచ్చారు? గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులే లేరా? అని వరుస ప్రశ్నలు సంధించారు. ఇక్కడ ఉద్రిక్తతలు పెంచడానికి బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుద్దా వెంకన్న, బోండా ఉమతో పాటు పల్నాడుకు బాబు రౌడీలను పంపారని విమర్శించారు. కనీసం వచ్చే ముందు పోలీసులకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. అంతేకాక దివ్యాంగుడిని కార్లతో గుద్ది వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘మొహం చెల్లదనే బాబు వారిని రప్పించారు’)
టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అది తట్టుకోలేక ఎన్నికలను ఆపాలని చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఇప్పటినుంచే బాబు సాకులు వెతుక్కుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు ఎందుకు ఎన్నికలు పెట్టలేదు. పల్నాడును ఎందుకు అభివృద్ధి చేయలేదు. బాబు చిల్లర రాజకీయాలు మానుకోవడం లేదని.. ఆయన ప్రస్తుతం ఓడిపోతామన్న ఫ్రస్టేషన్‌లో ఉన్నారు’ అని మహేశ్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (టీడీపీ అరాచకాలను ఆధారాలతో నిరూపిస్తాం : కాసు)
Comments
Please login to add a commentAdd a comment