‘చేసేదే వైఎస్‌ జగన్‌ చెబుతారు’ | YSRCP Leader Kasu Mahesh Reddy Slams TDP In Palnadu Gaarjana | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 29 2018 7:43 PM | Last Updated on Thu, Nov 29 2018 8:04 PM

YSRCP Leader Kasu Mahesh Reddy Slams TDP In Palnadu Garjana - Sakshi

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసేదే చెప్తారని ఆ పార్టీ నేత కాసు మహేష్‌ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ ఆటవిక పాలనకు నిరసనగా దాచేపల్లిలో వైఎస్సార్‌ సీపీ  ‘పల్నాటి గర్జన’ చేపట్టింది. ఈ సందర్భంగా గర్జనకు హాజరైన ఆ పార్టీ నేత కాసు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయడు వచ్చారు.. కరువు తెచ్చారని ఎద్దేవ చేశారు. నాలుగున్నరేళ్లలో ఈ ప్రాంతానికి చంద్రబాబు నీళ్లు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. నీళ్లు, ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. దమ్ముంటే పల్నాడు అభివృద్దిపై గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే టికెట్‌ను చంద్రబాబు ప్పుడైనా బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతోనే పేదల అభ్యున్నతి అంటూ మహేష్‌ రెడ్డి వివరించారు. ఈ గర్జనకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పల్నాడు ప్రాంత ప్రజలు హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement