
కాంగ్రెస్ నుంచా.. మేమా.. పోటీ చేయం
గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇద్దరు అభ్యర్థులు ఆ పార్టీకి కోలుకోలేని ఝలక్ ఇచ్చారు. నరసరావుపేట, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన కాసు మహేశ్ రెడ్డి, కాండ్రు కమల.. ఇద్దరూ తాము పోటీ చేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పేశారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించి తీరుతో విసుగెత్తిపోయిన ప్రజలు ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని, పైగా అనవసరంగా బోలెడు ఖర్చవుతుందని భావించే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి అధిష్ఠానం ఎంపిక చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆ వెంటనే బీజేపీలో చేరిపోతే.. ఇప్పుడు వీళ్లిద్దరూ ఈ రకమైన ఝలక్ ఇచ్చారు.