
అన్నకు హారతిస్తున్న ఓ చెల్లెమ్మ
గురజాలరూరల్: ‘గ్రామాల్లో ఎక్కడా చూసినా సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. నియోజకవర్గంలో దోపిడీయే ప్రధాన ఎజెండాగా యరపతినేని కోట్ల రూపాయలు దండుకున్నారు. రాష్ట్రమంతా అవినీతి కంపుకొడుతోంది. ఈ దగా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయ్’ అంటూ వైఎస్సార్ సీపీ గురజాల నియోజకవర్గ ఇన్‌చార్జి కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర స్ఫూర్తితో కాసు తలపెట్టిన ‘అదేబాట’లో కాలినడకన రెండోరోజు మంగళవారం అంజనాపురం గ్రామానికి చేరుకున్నారు. అడుగడుగునా మహిళలు పూలతో, హారతులతో బ్రహ్మరథం పట్టారు. దేవాలయాల్లో, చర్చిల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్రతో వస్తున్న మహేష్‌రెడ్డికి ప్రజలు సమస్యలు ఏకరవు పెట్టారు.
పొలంలో పనిచేస్తున్న వ్యవసాయకూలీలు బియ్యం కూడా కొనుగోలు చేసుకోలేని స్థితితో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాసు మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. రాజన్నరాజ్యం స్థాపనకు జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయని భరోసానిచ్చారు. రైతులకు ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, మండల కన్వీ నర్ సిద్దాడపు గాంధీ, సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, మేకల శేషి రెడ్డి, సోమ వెంకట్రావు, గ్రామ కన్వీనర్ పేరం సత్యనారాయణరెడ్డి, ఎం.వెంకటేశ్వరరెడ్డి, మిర్యాల కృష్ణ, వెంటేశ్వర్లు, రాం బాబు, చంద్రశేఖర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, వెంకటరెడ్డి, వెన్నా వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment