‘వైఎస్సార్‌ సీపీ కమిటీ వాస్తవాలను బయటపెడుతుంది’ | YSRCP Leader Kasu Mahesh Reddy On Gurajala Illegal Mining | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ సీపీ కమిటీ వాస్తవాలను బయటపెడుతుంది’

Published Sun, Aug 12 2018 7:13 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

YSRCP Leader Kasu Mahesh Reddy On Gurajala Illegal Mining - Sakshi

మాట్లాడుతున్నవైఎస్సార్‌ సీపీ నేత అంబటి రాంబాబు

సాక్షి, గుంటూరు : వైఎస్సార్‌ సీపీ నిజనిర్థారణ కమిటీ రేపు గురజాలలో పర్యటించి వాస్తవాలను బయట పెడుతుందని వైఎస్సార్‌ సీపీ నేత కాసు మహేష్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యరపతినేని తన అనుచరులను అక్రమ మైనింగ్‌ తామే చేసినట్లు ఒప్పుకోమని వేధిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ నిజనిర్థారణ కమిటీకి పోలీసులు ఎందుకు అడ్డుచెడుతున్నారని ప్రశ్నించారు. 

రూ. 290కోట్ల సున్నపురాయిని అ‍క్రమంగా తరలించారు
గుంటూరు : ఈ నాలుగేళ్లలో రూ. 290కోట్ల విలువైన సున్నపురాయిని టీడీపీ నాయకులు అక్రమంగా తరలించారని వైఎస్సార్‌ సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఎమ్మెల్యే హస్తముందని అందరికీ తెలుసన్నారు. హైకోర్టు స్టే ఇచ్చి విచారణకు ఆదేశించటంతో డొంక కదిలిందని అన్నారు. మైనింగ్‌ అధికారులు ఎమ్మెల్యేను కేసు నుంచి తప్పించేందుకు సంబంధంలేని వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement