గురజాల నియోజక వర్గంలో టీడీపికి షాక్‌ | Gurajala TDP leaders quit TDP, shock to Chandrababu | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 15 2013 3:10 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

గుంటూరు జిల్లా గురజాల నియోజక వర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు ముఖ్యనేతలు సహా కార్యకర్తలు రాజీనామా చేశారు. గుదే శివ, దాచినేని వెంకయ్య, మల్లెల ఆదినారాయణ, బుల్లబ్బాయితో పాటు మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ సభ్యులు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. చంద్రబాబు నాయుడు నోట సమైక్యాంధ్ర మాట రాకపోవడం తమను బాధించిందని వారు తెలిపారు. చంద్రబాబు కన్నా తమకు ప్రజలు ముఖ్యమని టీడీపీకి రాజీనామా చేసిన నేతలు పేర్కొన్నారు. ప్రజాభీష్టం మేరకే టీడీపీకి రాజీనామా చేశామని వారు వెల్లడించారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement