భార్యపై అనుమానంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఈ సంఘటన గుంటూరు జిల్లా గురజాలలోని శ్రీదేవి రైస్‌మిల్ సెంటర్‌లో శుక్రవారం వెలుగు చూసింది.
గురజాల: భార్యపై అనుమానంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఈ సంఘటన గుంటూరు జిల్లా గురజాలలోని శ్రీదేవి రైస్‌మిల్ సెంటర్‌లో శుక్రవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న వెంకటస్వామి, రమాదేవి(47) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో గత కొన్ని రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటస్వామి గొడవ పడుతున్నాడు. ఇదే విషయం పై శుక్రవారం భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన వెంకట స్వామి, భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.