గురజాలలో రోహిత్ కుటుంబసభ్యుల విచారణ
గుంటూరు : హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. గుంటూరు జిల్లా గురజాలలోని రోహిత్ నాయనమ్మ మాధవమ్మ, తాతయ్య వెంకటేశ్వర్లును పోలీసులు బుధవారం విచారించారు. మాదాపూర్ ఏసీపీ రమణకుమార్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది.
రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై పోలీసులు ఆరా తీశారు. అలాగే రోహిత్ కుటుంబం ఎంతకాలంగా గురజాలలో నివాసం ఉంది, ఎప్పుడు హైదరాబాద్ వచ్చిందనే దానిపై వివరాలు సేకరించారు. రోహిత్ కుటుంబసభ్యులు, ఇంటి చుట్టుపక్కలవారితో పాటు అతని స్నేహితులను ప్రశ్నించారు. రోహిత్ ఆదివారం హెచ్సీయూ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.