
వైఎస్సార్ సీపీ నాయకులకు అందిన పోలీసుల నోటీసులు
సాక్షి, గుంటూరు : గురజాలలో వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీ సోమవారం పర్యటించనుంది. పిడుగురాళ్ల, దాచేపల్లిలోని అక్రమ క్వారీంగ్‌లో కమిటీ పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీని అడ్డుకోవటానికి ప్రభుత్వం కుట్రపన్నుతోంది. పోలీసుల ద్వారా వైఎస్సార్ సీపీ నాయకులకు నోటీసులు పంపింది. అక్రమ క్వారీంగ్ సంబంధించి సాక్ష్యాలు మాయమవుతాయంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. నోటీసుల పేరుతో గురజాల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేతలకు బెదిరింపులు మొదలయ్యాయి. పర్యటన రద్దు చేసుకోకపోతే కేసులు పెడతామని పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను హెచ్చరిస్తున్నారు.