సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమ మైనింగ్ పట్ల ప్రభుత్వ నిస్సహాయత సరికాదని ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ జరుగుతోందని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శర్మ వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వమే చోద్యం చూస్తే ఎలా అని మొట్టికాయలేసింది.
సుప్రీంకోర్టులో కేసు ఉందనగానే ప్రభుత్వం భయపడుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మేమేమి మనుషులను తినే పులులం కాదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడింది. ఎవరో ఏదో చేస్తారని ప్రభుత్వమే భయపడితే ఎలా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా గుంటూరు జిల్లాలోని గురజాల వంటి ప్రాంతాల్లో టీడీపీ అక్రమంగా మైనింగ్ చేస్తోందంటూ ప్రతిపక్షం వైఎస్సార్ సీపీతో సహా పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment