illigal mining
-
ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మైనింగ్ ఎక్కడా జరగడం లేదు : గోపాలకృష్ణ ద్వివేది
-
వెలుగులోకి జేసీ అవినీతి బాగోతం
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అవినీతి బాగోతం భట్టబయలైంది. జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని, వేల సంఖ్యలో ఉద్యాగాలు కల్పిస్తామని ప్రజలను మభ్యపెట్టి మోసానికి పాల్పడ్డారు. అంతోటితో ఆగని జేసీ.. తన ఇంట్లోని పని మనుషులు, డ్రైవర్ల పేర్లతో త్రిశూల్ సిమెంట్స్‌కు అనుమతులు పొందారు. అలాగే రూ. 200 కోట్లు విలువ చేసే సున్నపురాయి గనులను అక్రమంగా విక్రయానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి అవినీతిపై విచారణ జరపాలని స్థానికులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. అవినీతి బయటకు రావడంతో త్రిశుల్ సిమెంట్ ఫ్యాక్టరీని అనుమతులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం త్రిశుల్ భూములను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, స్థానిక అఖిలపక్ష నేతలు పరిశీలించారు. జేసీ దివాకర్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. మరోవైపు ఆయనపై హైకోర్టులో నమోదు కేసులో తుది తీర్పు ఈనెల 10న వెలువడే అవకాశం ఉంది. (జేసీ బ్రదర్స్ దొంగల కన్నా హీనం) కాగా కొనుప్పలపాడులో 649.86 హెకార్ట సున్నపురాతి గనుల లీజు రద్దు చేస్తున్నట్టు ఇదివరకే ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి.. మరో ఐదేళ్ల పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడనందునే లీజు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. (త్రిసూల్ సిమెంట్ కంపెనీ లీజు రద్దు) -
నిరూపించకుంటే 100 గుంజీలు తీయాలి
బంకురా/పురూలియా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థులు అక్రమంగా బొగ్గు తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ మోదీ చేసిన ఆరోపణలను రుజువుచేయలేకపోతే ఆయన వంద గుంజీలు తీయాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అదే మోదీ తాను చేసిన ఆరోపణలను ఏ ఒక్క అభ్యర్థిపైనైనా రుజువు చేస్తే లోక్‌సభ బరిలో ఉన్న మొత్తం 42 మంది టీఎంసీ అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరిస్తానని ఆమె సవాల్ విసిరారు. గురువారం బెంగాల్‌లోని బంకురా నియోజకవర్గంలో మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ టీఎంసీ అభ్యర్థులు అక్రమంగా బొగ్గు తవ్వకాలకు పాల్పడి డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మమత కూడా అదే నియోజకవర్గంలోని ఓ సభలో మాట్లాడుతూ ‘బొగ్గు గనుల తవ్వకాల వ్యవహారమంతా కేంద్రంలోని బొగ్గు మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. గనులకు కాపలాగా ఉండేది కూడా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్). బొగ్గు గనులను అక్రమంగా తవ్వుతున్నది బీజేపీ వాళ్లే’ అంటూ మోదీపై ఎదురుదాడి చేశారు. తన దగ్గర ఒక పెన్‌డ్రైవ్ ఉందనీ, దాన్ని బయటపెడితే బొగ్గు మాఫియా, పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూస్తాయని మమత హెచ్చరించారు. ఓ కేంద్ర మంత్రి, మరో బీజేపీ ఎంపీకి సంబంధించిన వివరాలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయన్నారు. చిట్‌ఫండ్ కుంభకోణాల్లో టీఎంసీ నేతలపై వచ్చిన ఆరోపణలు కూడా రుజువుకాలేదని ఆమె పేర్కొన్నారు. ఈ దేశాన్ని దుర్యోధన, దుశ్శాసనులు పాలిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మోదీని కొడతానని నేను అనలేదు.. మోదీని చెంపదెబ్బ కొడతానని తానెప్పుడూ అనలేదని మమత స్పష్టం చేశారు. ఆయనను కొట్టాల్సిన అవసరం తనకు ఏంటని ఆమె ప్రశ్నించారు. బుధవారం మమత మాట్లాడుతూ ప్రజాస్వామ్యపు చెంపదెబ్బను మోదీ రుచి చూస్తారని అనడం తెలిసిందే. దీనిపై మోదీ గురువారం మాట్లాడుతూ ‘మమత నన్ను కొడతానంటున్నారు. ఆమె నాకు అక్క వంటివారు. ఆమె కొట్టినా నాకు అది ఆశీర్వాదమే’ అని పేర్కొన్నారు. దీంతో మమత మాట్లాడుతూ మోదీ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని, వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యపు చెంపదెబ్బను మోదీ రుచి చూస్తారని తాను అన్నానే తప్ప, తానే మోదీని చెంపదెబ్బ కొడతానని కాదని వెల్లడించారు. ప్రజలే తమ ఓటుతో మోదీకి బుద్ధి చెబుతారనే అర్థంలో తాను ‘ప్రజాస్వామ్యపు చెంపదెబ్బ’ అన్నానని తెలిపారు. -
బాక్సైట్ దోపిడీ గుట్టు రట్టు
ఎన్నికలకు ముందు కమీషన్ల కోసం హడావిడిగా కుంభకోణాలకు దిగజారడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. 2004 ఎన్నికలకు ముందు కూడా, షెడ్యూల్ వెలువడిన తర్వాత.. ఆపద్ధర్మ సీఎం హోదాలో ఐఎంజీ భారత అనే ఊరూ పేరూ లేని కంపెనీకి స్టేడియంల నిర్మాణం పేరిట హైదరాబాద్ నడిబొడ్డున రూ.8,500 కోట్ల విలువైన 850 ఎకరాల భూమిని కేవలం రూ.4 కోట్లకే కట్టబెట్టేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. బాక్సైట్ నిక్షేపాల వెలికితీత వల్ల మూడు జిల్లాల్లోని 10 లక్షల గిరిజన, ఆదివాసీ కుంటుంబాల బతుకులు నాశనమవుతాయి. అడవిపై తమ హక్కులను కోల్పోతారు. వారంతా తండాలను వదులుకుని వెళ్లాల్సి వస్తుంది. వారు తమకు సహజ సిద్ధంగా, స్థానికంగా దొరికే ఉపాధిని కోల్పోతారు. వారి సంస్కృతి చిన్నాభిన్నమవుతుంది. బాక్సైట్ వెలికితీత పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సాక్షి, అమరావతి: చంద్రబాబు బాక్సైట్ కుంభకోణం గుట్టు రట్టయ్యింది. బాక్సైట్ తవ్వకాలకు తాను వ్యతిరేకమని ఎప్పటికప్పుడు అవాస్తవాలు వల్లె వేస్తూ గిరిజనులను మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి.. ఎన్నికల ముందు ముసుగు తీసేశారు. వైఎస్సార్సీపీ ప్రభంజనం నేపథ్యంలో ఓటమి భయంతో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన.. అత్యంత రహస్యంగా.. వంద, రెండొందల కోట్లు కాదు.. ఏకంగా రూ.41 వేల కోట్ల విలువైన బాక్సైట్ నిక్షేపాల వెలికితీతకు అనుమతిచ్చేశారు. మూడు జిల్లాల్లో ఏకంగా 10 లక్షల గిరిజన కుంటుబాలను రోడ్డుపాలు చేసే దారుణ కృత్యానికి తెగబడ్డారు. బిజినెస్ రూల్స్ పాటించలేదు. ఆర్థిక శాఖ పరిశీలనకూ పంపలేదు. ఎన్నికల షెడ్యూల్ వెలవడటానికి ఐదురోజుల ముందు అత్యంత రహస్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గంతో ఆమోదముద్ర వేయించారు. విదేశాలతో అంతర్గత ఒప్పందమూ చేసుకున్నారు. ఇదే అంశంపై గతంలో తాను చేసిన తప్పును ఓ అధికారిపై నెట్టేసి, ఆ అధికారిని బలిచేసి చంద్రబాబు తప్పించుకున్నారు. గిరిజనలు, వైఎస్సార్సీపీ ఆందోళనతో అప్పట్లో యూటర్న్ తీసుకున్న ముఖ్యమంత్రి.. ఎన్నికల సమయంలో ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశంతో.. ఇప్పుడు అదే నిర్ణయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి గిరిజనులను దెబ్బకొట్టేలా గుట్టుగా పనికానిచ్చేశారు. గిరిజన ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ నేపథ్యంలోనే అధికార టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే ఇటీవల మావోయిస్టుల చేతిలో చనిపోయారు. గిరిజన ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై అధికారవర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఇది పైకి రూ.41 వేల కోట్ల ఒప్పందంగా కన్పిస్తున్నా.. ఏకంగా లక్ష కోట్ల దోపిడీ దాగి ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు ముందు కమీషన్ల కోసం కుంభకోణాలకు పాల్పడటం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. 2004 ఎన్నికలకు ముందు కూడా, షెడ్యూల్ వెలువడిన తర్వాత.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఐఎంజీ భారత అనే ఊరూ పేరూ లేని కంపెనీకి స్టేడియంల నిర్మాణం పేరిట హైదరాబాద్ నడిబొడ్డున రూ.8,500 కోట్ల విలువైన 850 ఎకరాల భూమిని కేవలం రూ.4 కోట్లకే కట్టబెట్టేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వేల కోట్ల సంపదపై చంద్రబాబు కన్ను ఇసుక, మట్టి దేన్నీ వదలకుండా దోచుకుని, ప్రాజెక్టుల అంచనాలు అడ్డగోలుగా పెంచేసి కమీషన్లు దండుకున్న చంద్రబాబు.. మళ్లీ అధికారం ఆశలు అడుగంటిన చివరిదశలో కూడా వేల కోట్ల అవినీతికి తెరతీశారు. మూడు జిల్లాల్లోని అత్యంత విలువైన బాక్సైట్ వెలికితీతకు నిర్ణయం తీసుకుని, ఈ నెల 5వ తేదీన ఎలాంటి కనీస నిబంధనలూ పాటించకుండా కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించారు. అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ అధికారుల పరిశీలనకు పంపించలేదని, కేవలం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దృష్టికి మాత్రం తీసుకువెళ్లి ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి ఆమోదంతో 5వ తేదీన కేబినెట్లో ఆమోదం తీసుకున్నట్లు గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేశ్ సంబంధిత ఫైలులో పేర్కొనడం గమనార్హం. కాగా అదేరోజు ప్రత్యేకంగా బాక్సైట్ తవ్వకాల కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక కార్పొరేషన్.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 615.27 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలున్నాయని చంద్రబాబు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో బాక్సైట్‌తో పాటు మాంగనీస్, బంగారం, ఇతర ప్రధానమైన ఖనిజ సంపద వెలికి తీయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ఏపీ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్‌కు 23 మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్ బాడీని ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ప్రధానంగా విదేశీ ప్రైవేట్ సంస్థల ద్వారా జియో ఫిజికల్ సర్వే, జియో కెమికల్ సర్వేలు నిర్వహించడం, ప్రధాన ఖనిజాల నిల్వలపై అధ్యయనం చేయడంతో పాటు వేలం పాటల ద్వారా బాక్సైట్, ఇతర ప్రధాన ఖనిజాల వెలికితీతకు అనుమతించడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కార్పొరేట్ సంస్థలకు టెండర్ల ద్వారా లీజులకు ఇవ్వడం తదితర అంశాలన్నింటినీ కూడా కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఎవ్వరికైనా లీజుకు ఇచ్చిన తర్వాత దాన్ని సవాల్ చేయడానికి వీల్లేకుండా (ఆర్బిట్రేషన్ క్లాజు లేకుండా) జాగ్రత్తపడటం గమనార్హం. కాగా బాక్సైట్ నిల్వలను వెలికి తీసేందుకు ఇప్పటికే అస్ట్రేలియా, కెనడా, యూరప్ దేశాల్లోని ప్రైవేట్ సంస్థలతో అంతర్గత ఒప్పందాలను చంద్రబాబు కుదుర్చుకున్నారు. ఈ విషయం ఇప్పటివరకు బయటకు పొక్కకపోవడాన్ని బట్టి ముఖ్యమంత్రి ఎంత గుట్టుగా వ్యవహరించారో అర్ధమవుతుంది. అప్పుడు కాదని బుకాయించి... వాస్తవానికి బాక్సైట్ నిల్వలపై 2015లోనే చంద్రబాబు కన్ను పడింది. విశాఖపట్నం జిల్లా చింతపల్లి జీలెల్లి అటవీ బ్లాకులోని 1,212 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ 5–11–2015న జీవో నం.97 జారీ చేయించారు. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గిరిజనుల హక్కులను కాలరాస్తూ బాక్సైట్ తవ్వకాలకు ఎలా అనుమతిస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. గిరిజనులూ ఉద్యమించారు. సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం కావడంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. జీవో నం. 97 నాకు తెలియకుండా వచ్చిందంటూ బుకాయించారు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిపై నెట్టేసి ఆయన్ను బలిచేశారు. నిజానికి సంబంధిత మంత్రితో పాటు ముఖ్యమంత్రి సంతకం లేకుండా ప్రభుత్వంలో ఎటువంటి జీవో జారీ కాదు. అలాంటిది తనకు తెలియకుండా జీవో జారీ అయిందని చంద్రబాబు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు కూడా ఎన్నికల హడావుడిలో గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేయాలని భావించారు. -
క్వారీల్లో ఉపాధికి ఘోరి..
సాక్షి, దాచేపల్లి(గురజాల) : ఉదయం నుంచి సాయంత్రం వరకు కండలను కరిగించి రాళ్లను బద్దలుకొట్టేవారు. వచ్చే ఆదాయంతో ఇంటిల్లిపాదీ చీకూచింతా లేకుండా హాయిగా జీవించేవారు. కాలేజీ విద్యార్థులు సైతం అప్పుడప్పుడు క్వారీల్లో పనులకు వెళ్లి వచ్చే డబ్బులను చదువుకోసం ఖర్చుచేసేవారు. హాయిగా సాగుతున్న వారి జీవితాలను తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ దెబ్బతీసింది. అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో క్వారీలన్నీ మూతపడ్డాయి. వడ్డెరలకు పనికరువైంది. చేసేదేమీలేక ఇళ్లకు తాళాలు వేసి పనులు వెతుక్కుంటూ వలసబాట పట్టారు. కండలు కరిగించి రాళ్లు బద్దలు కొట్టి జీవనం సాగించే వడ్డెర కార్మికుల బతుకుల్లో టీడీపీ నాయకులు చీకట్లు నింపారు. ఒకప్పుడు దర్జాగా బతికిన వడ్డెర కార్మికులు నేడు దయనీయ పరిస్థితుల్లో జానెడు పొట్టనింపుకొనేందుకు కొందరు వలస బాట పట్టగా, మరికొంత మంది వ్యవసాయ కూలీలుగా మారారు. నిత్యం సమ్మెట చప్పుళ్లు, వడ్డెర కార్మికుల కబర్లతో సందడిగా కనిపించే క్వారీలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. కార్మికులు ఉపాధి కోసం వలస వెళ్లడంతో క్వారీలతోపాటు, గ్రామాలు సైతం నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు అక్రమంగా క్వారీలను నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం కోట్ల రూపాయలకు పడగలెత్తారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులు సాగించిన అక్రమ మైనింగ్‌తో దాచేపల్లి మండలంలోని నడికుడి, కేసానుపల్లి, పిడుగురాళ్ల మండలంలోని కొనంకి గ్రామాల్లో క్వారీలు మూతపడ్డాయి. దీంతో వడ్డెర కార్మికులు వలసబాట పట్టారు. రెక్కల కష్టంతో కట్టుకున్న ఇళ్లకు తాళాలు వేసి తట్టాబుట్ట సర్దుకుని ఉపాధిని వెతుక్కుంటూ వలసబాట పట్టారు. వడ్డెర కార్మికులు అధికంగా నివసించే నడికుడి పంచాయతీ పరిధిలోని అంజనాపురం కాలనీ నిర్మానుషంగా ఉంది. క్వారీల్లో యరపతినేని అనుచరుల పాగా నడికుడి, కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో క్వారీపై ఆధారపడి ఈ మూడు గ్రామాల్లోనే మూడు వేల మందికి పైగా వడ్డెర కార్మికులు జీవించేవారు. జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వడ్డెర కార్మికులు నిర్భయంగా క్వారీ పనులు చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డెర కార్మికుల బతుకులు పూర్తిగా మారాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన అనుచరులు క్వారీలను బలవంతంగా లాగేసుకున్నారు. నడికుడిలో వడ్డెర సొసైటీకి ఉన్న రెండున్నర ఎకరాల లీజును రద్దు చేయించి ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూములు, ఓ సిమెంట్ కంపెనీ సొంత భూముల్లో సైతం అక్రమంగా మైనింగ్‌కు పాల్పడి రాయిని తవ్వి తరలించేశారు. కేసానుపల్లిలో ప్రభుత్వ భూములతో పాటుగా ప్రైవేట్ వ్యక్తుల భూముల్లో కూడా అక్రమంగా క్వారీ పనులు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. వడ్డెర కార్మికుల శ్రమ దోపిడీ క్వారీలను లాగేసుకున్న టీడీపీ నాయకులు వారి శ్రమను సైతం దోచుకున్నారు. గతంలో ట్రక్కు రాయి కొడితే రూ.600లకు పైగా కూలి వచ్చేది. టీడీపీ నాయకులు మాత్రం రూ.450 చొప్పున సరిపెట్టారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కూడా కార్మికుల శ్రమ దోపిడీలో భాగస్వాములుగా మారడంతో కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోజూ వేల టన్నుల తెల్లరాయిని రవాణాచేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న టీడీపీ నాయకులు తమకు రావాల్సిన కూలిలో సైతం కోత విధించారని కార్మికులు ఆరోపించారు. వలసబాట పట్టిన కార్మికులు అక్రమమైనింగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయటంతో నడికుడి, కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో అక్రమమైనింగ్ నిలిచిపోయింది. గతంలో చట్టప్రకారం రాయల్టీ చెల్లించి క్వారీలను నడిపేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయల్టీ చెల్లించకుండా ఇష్టానుసారంగా క్వారీలను నిర్వహిస్తుండటంతో హైకోర్టులో పిల్ దాఖలైంది. అక్రమమైనింగ్‌లో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్వారీలు నిలిచిపోయాయి. దీంతో రెక్కల కష్టంతో కట్టుకున్న ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇంటి వద్ద వృద్ధ తల్లిదండ్రులను వదిలిపెట్టి అతికష్టం మీద వలసలకు పయనమయ్యారు. క్వారీ పనులు లేకపోవటంతో కొంతమంది వడ్డెర కుటుంబాల్లోని పిల్లల చదువులు కూడా ఆగాయి. క్వారీని వదిలి.. డ్రైవర్‌గా కుదిరి.. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు చల్ల అమరలింగేశ్వరరావు. 17 సంవత్సరాల వయస్సు నుంచే క్వారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరుకుమార్తెలు, ఒకకుమారుడు ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత క్వారీలను అక్రమించుకున్నారు. టీడీపీ నాయకులు కొంతకాలం అమరలింగేశ్వరరావుతో పనులు చేయించినా, వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడంతో పనులకు రాకుండా అడ్డుకున్నారు. ఆ తరువాత బతుకుదెరువు కోసం జేపీ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడా పని కల్పించకుండా యజమాన్యంపై టీడీపీ నాయకుడు బత్తుల రాంబాబు వత్తిడిచేశాడు. చేసేదేమీలేక ఇప్పుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. క్వారీ పనుల్లో రూ.800 ఆదాయం వచ్చేది. ఇద్దరు పిల్లలను చక్కగా చదివించుకునేవాడు. ఇప్పుడు డ్రైవర్‌గా వెళ్లడం వల్ల ఆదాయం తగ్గిపోయింది. వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణభారంగా మారింది. కష్టపడితే నాలుగు రూపాయలు వచ్చే క్వారీ పనులు మానుకుని డ్రైవర్‌గా వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. నాకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. టీడీపీ నాయకులు తాను క్వారీ పనులు చేయకుండా అడుగడుగునా అడ్డుకుని పంతం నెగ్గించుకున్నారు. తాపీ పనులు చేస్తున్నా క్వారీ పనులు నిలిచిపోవటం వలన పొట్టచేతపట్టుకుని విజయవాడకు వెళ్లి తాపీ పనులు చేసుకుని బతుకుతున్నా. అక్కడ కూడా పనులు అడపా దడపా మాత్రమే లభిస్తున్నాయి. నాకు ఇచ్చే కూలి తినటానికి, ఉండటానికే సరిపోతుంది. అంతా దూరం వెళ్లి నేను సంపాదించిందేమీలేదు. క్వారీ పనులు ఉంటే కుటుంబంతో కలిసి హాయిగా పనిచేసుకుని ఇక్కడే ఉండేవాళ్లం. ఇప్పుడు నేను విజయవాడలో, నా కుటుంబం అంజనాపురంలో ఉంటోంది. –వేముల క్రిష్టయ్య చదువులకు అటంకం నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. క్వారీ పనులు ఉంటే రోజూ ఉదయం పనికి వెళ్లి ట్రక్కురాయి కొడితే రూ.600 వచ్చేవి. ఆ డబ్బును చదువు కోసం ఉపయోగించుకునేవాడిని. ఇప్పుడు క్వారీ పనులు లేవు. చదువుకు ఆటంకంగా మారింది. చదువుకోవటం ఇబ్బందిగా ఉంది. పరిస్థితులు ఇలానే ఉంటే చాలామంది చదువు ఆగిపోయే ప్రమాదం ఉంది. – బత్తుల చిన్నపరాజు -
క్వారీ.. ఘోరీ!
సాక్షి, కంచికచర్ల(నందిగామ) : పాపం.. ఆ చిన్నారులకు తెలీదు, అది మృత్యులోయని.. ఆ తల్లికి ఊహకైనా అంది ఉండదు.. అది ప్రాణాలు మింగే అగాధమని.. బట్టలు ఉతుకుదామని వెళ్లారు.. తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. దొనబండ.. ఈ ఘోరానికి సాక్షిగా నిలిచింది. మాటలకందని విషాదం.. వర్ణింప వీలుకాని వేదన.. ఇష్టారీతిన తవ్వి వదిలేసిన ‘క్వారీ’ గొయ్యి ఇద్దరు చిన్నారులతో పాటు, మరో మహిళను బలితీసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇబ్రహీంపట్నం మూలపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. నీటి కుంటలో సరదాగా ఆడుకుందామని దిగిన చిన్నారులను అదే నీటికుంట మృత్యుకుహరమై మింగేసింది. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ క్వారీలో ఇబ్రహీంపట్నం మూలపాడు గ్రామానికి చెందిన దేవనం పరమేశ్వరి(ఏలేము జ్యోతి)(38)బడ్డీ కొట్టు పెట్టుకుని బతుకీడ్చుతుంది. భర్త సుబ్రహ్మణ్యం రోజు కూలీగా క్వారీలో పనిచేస్తుంటాడు. ఆదివారం పరమేశ్వరీ బట్టలు ఉతికేందుకని క్వారీలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లింది. ఆమెతో పాటు కుమార్తె దేవనం మీనా(5), వరుసకు మనుమరాలు అయిన వల్లెపు దుర్గ(8)లు అక్కడకు వెళ్లారు. పరమేశ్వరి నీటి కుంటలో దిగి బట్టలు ఉతుకుతుండగా ఒడ్డున చిన్నారులు ఆటలు ఆడుకుంటున్నారు. కొంత సమయం అయిన తర్వాత ఉల్లాసంగా ఆడుకుంటున్న చిన్నారులు ఒక్కసారిగా నీటికుంటలోకి దిగారు. ఆ నీటి కుంట లోతు ఎక్కువగా ఉండడంతో ముని గిపోతూ కేకలు పెట్టారు. దీంతో అక్కడే ఉన్న పరమేశ్వరి వారిని కాపాడేందుకు ప్రయత్నించి నీటికుంటలోకి దిగింది. దీంతో చిన్నారులతో పాటు ఆమె కూడా మునిగిపోయి మృత్యువాత పడింది. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు.. దేవనం సుబ్రహ్మణ్యం పరమేశ్వరి దంపతులు రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని కొండలు పిండిచేసి జీవనం చేస్తున్న నిరుపేద కుటుంబాలు. నిత్యం కాయకష్టం చేసుకుని తమ పిల్లలను పోషించుకుంటున్నారు. అప్పటిదాకా కళ్లముందు ఆడుకున్న ఆ చిన్నారులతోపాటు పరమేశ్వరి కూడా నీటికుంటలో పడి మృత్యువాతపడడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. మరో 5నిముషాల్లో బట్టలు ఉతికి చిన్నారులతో సహా ఇంటికి వెళ్లదామనే లోపే ఈ సంఘటన జరగటంతో వారి శోకం వర్ణనాతీతంగా ఉంది. అడ్డదిడ్డంగా క్వారీల తవ్వకాలు.. పరిటాల శివారు దొనబండ క్వారీల్లో కాంట్రాక్టర్లు అడ్డదిడ్డంగా తవ్వకాలు జరపటంతో ఇటువంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. క్వారీ బ్లాస్లింగ్ సమయంలోనూ ప్రమాదాలు జరిగిన ఘట నలు ఉన్నాయి. ఎక్కువ లోతులో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నా.. అటు మైనింగ్ అధికారులు గానీ, ఇటు రెవెన్యూ అధికారులుగానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. లోతైన నీటి కుంటల వద్ద ప్రమాద హెచ్చరికలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. -
వంతాడలో రూ.3 వేల కోట్ల అక్రమ మైనింగ్
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని రక్షిత అటవీ ప్రాంత గ్రామమైన వంతాడలో ఏడాదికి రూ.3 వేల కోట్ల విలువైన అక్రమ మైనింగ్ జరుగుతోందని.. ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం మాత్రం అక్కడ అసలు మైనింగ్ జరగడం లేదని అబద్ధాలు చెబుతున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ధ్వజమెత్తారు. అక్కడ మైనింగ్ డబ్బులు ఎవరి జేబులకు వెళుతున్నాయంటూ ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా, లేక లోకేష్‌కు మాత్రమే తెలిసి చేయిస్తున్నారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలరాజు శనివారం విజయవాడలో పవన్‌కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ విలేకరులతో మాట్లాడుతూ.. వంతాడలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న సంస్థ స్వేచ్ఛగా తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటోందని చెప్పారు. ఆ అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఆదాయం రావడం లేదన్నారు. గిరిజనులకు మంచినీరు ఇచ్చే పైపులైను ఏర్పాటుకు అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు ఉంటాయి కానీ, రిజర్వుడ్ పారెస్టులో అటవీ శాఖ అనుమతి లేకుండా అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతానికి పెద్ద ట్రక్లు కూడా వెళ్లే రోడ్లు వేసి ఉన్నాయన్నారు. అక్రమ మైనింగ్ చేసే వారికి ప్రభుత్వం అంతగా రెడ్ కార్పెట్ పరుస్తుంటే, దానిని ఏమంటారు? అది అవినీతి కాదా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే, గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు జరగకుండా చూస్తామన్నారు. జనసేనతో కలిసి పనిచేయడానికి బాలరాజు ముందుకు రావడం సంతోషమన్నారు. తెలంగాణలో మద్దతివ్వమంటున్నారు.. తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధమైన పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు జనసేన మద్దతు కోరుతున్నారని పవన్ చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ వైఖరిని 2–3 రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. సాధారణ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 23 అసెంబ్లీ, మల్కాజ్గిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలనుకున్నామని, అయితే అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతుండటంతో ఆ ఆలోచన మార్చుకున్నామని తెలిపారు. జనసేన పార్టీలో చేరిన బాలరాజు మాట్లాడుతూ.. పవన్ మొదలు పెట్టిన రాజకీయ ప్రస్తానంలో భాగస్వామి కావాలనే పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేత నాదెండ్ల మనోహర్, ఉత్తరాంధ్ర జనసేన కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
అక్రమ మైనింగ్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమ మైనింగ్ పట్ల ప్రభుత్వ నిస్సహాయత సరికాదని ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ జరుగుతోందని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శర్మ వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వమే చోద్యం చూస్తే ఎలా అని మొట్టికాయలేసింది. సుప్రీంకోర్టులో కేసు ఉందనగానే ప్రభుత్వం భయపడుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మేమేమి మనుషులను తినే పులులం కాదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడింది. ఎవరో ఏదో చేస్తారని ప్రభుత్వమే భయపడితే ఎలా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా గుంటూరు జిల్లాలోని గురజాల వంటి ప్రాంతాల్లో టీడీపీ అక్రమంగా మైనింగ్ చేస్తోందంటూ ప్రతిపక్షం వైఎస్సార్ సీపీతో సహా పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. -
వంతాడ, చింతలూరులో అక్రమ మైనింగ్:భూమా
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా వంతాడ, చింతలూరులో అక్రమ మైనింగ్ జరిగినట్లు గుర్తించామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ భూమా నాగిరెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూముల్లో లీజుదారులు 40 అడుగుల మేర రోడ్లు నిర్మించారని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. మైనింగ్ లీజు వ్యవహారంలో రెవెన్యూ, అటవీశాఖ, మైనింగ్ శాఖలు జాయింట్ సర్వే చేయలేదని భూమా అన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే చింతలూరు, పెద్దినపూడిలలో మైనింగ్ తవ్వకాలు చేపట్టారని ఆయన తెలిపారు. ఎస్ఈజెడ్ పరిహారం విషయంలో రైతులు అసంతృప్తితో ఉన్నారని, వీటిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అంద చేస్తామని భూమా నాగిరెడ్డి చెప్పారు. కాగా జిల్లాలోని కొత్తపల్లి మండలం కొత్తమూలపేటలోని కేఎస్ఈజెడ్ నిర్వాసిత కాలనీ, చైనా బొమ్మల తయారీ కంపెనీలను బుధవారం పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ సభ్యులు పరిశీలించారు.