అక్రమ మైనింగ్ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ ప్రమేయం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నాలుగున్నరేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని, పంచ భూతాలను సైతం ఆక్రమిస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు